Dunki 8 Days Collections: భారీగా పడిపోయిన డంకీ కలెక్షన్లు.. ఇప్పటి వరకు ఎంతంటే!
29 December 2023, 14:05 IST
- Dunki 8 Days Collections: షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద నెమ్మదించింది. 8వ రోజు కలెక్షన్లు తక్కువగానే వచ్చాయి. ఈ చిత్రం ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందంటే..
Dunki 8 Days Collections: భారీగా పడిపోయిన డంకీ కలెక్షన్లు.. ఇప్పటి వరకు ఎంతంటే!
Dunki 8 Days Collections: స్టార్ డైరెక్టర్ రాజ్‍కుమార్ హిరానీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ భారీ హైప్‍తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఎమోషనల్ కామెడీ డ్రామా డిసెంబర్ 21న రిలీజ్ అయింది. అయితే, ప్రారంభం నుంచి షారుఖ్ రేంజ్‍కు తగ్గట్టుగా కలెక్షన్లు రాలేదు. జవాన్, పఠాన్‍తో పోలిస్తే చాలా తక్కువగా వసూళ్లను రాబడుతూ వచ్చింది. ఇక 8వ రోజు డంకీ చిత్రం కలెక్షన్లలో మరింత డ్రాప్ వచ్చింది.
డంకీ సినిమాకు ఇండియాలో గురువారమైన 8వ రోజు కేవలం రూ.9కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రానికి దేశీయంగా సింగిల్ డిజిట్ రావడం ఇదే తొలిసారిగా ఉంది. మొత్తంగా 8 రోజుల్లో ఇండియాలో డంకీకి 8 రోజుల్లో రూ.161.01 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా డంకీ చిత్రానికి 7 రోజుల్లో రూ.305కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 8 రోజుల్లో ఇది సుమారు రూ.320 కోట్లుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 8వ రోజు ఓవర్సీస్ లెక్కలు ఈ సాయంత్రానికి వస్తాయి. మరోవైపు, న్యూఇయర్ వస్తుండటంతో డంకీ కలెక్షన్లు ఒకటి రోజు రోజులు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ పోటీలో ఉండడం.. డంకీని బాగానే దెబ్బ తీసింది. సలార్‌కు హిందీలోనూ పాజిటివ్ టాక్ రావటంతో డంకీపై ప్రభావం పడింది. సలార్ సినిమా ఇండియాలో 7 రోజుల్లోనే రూ.300కోట్ల నెట్ కలెక్షన్లను దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.540 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును అధిగమించింది.
డంకీ చిత్రంలో షారుఖ్ ఖాన్‍తో పాటు తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, బొమ్మన్ ఇరానీ, అనిల్ గ్రోవర్ కీలకపాత్రలు పోషించారు. పీకే, 3 ఇడియట్స్ లాంటి క్లాసిక్స్ తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అయితే, డంకీకి తొలి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అందులోనూ ఈ మూవీ రిలీజైన మరుసటి రోజునే సలార్ రావడం భారీ ప్రభావాన్ని చూపింది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‍మెంట్స్, రాజ్‍కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మించాయి.