తెలుగు న్యూస్  /  Entertainment  /  Drishyam 2 Collection Comparison Between Malayalam And Hindi

Drishyam 2 Collection: దృశ్యం - 2 స్ట్రెయిట్ సినిమా 25 కోట్లు -హిందీ రీమేక్ 313 కోట్లు

18 December 2022, 15:44 IST

  • Drishyam 2 Collection: అజ‌య్ దేవ్‌గ‌ణ్ ( Ajay Devgn) హీరోగా న‌టించిన బాలీవుడ్ చిత్రం దృశ్యం బాక్సాఫీస్ వ‌ద్ద మూడు వంద‌ల కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. మ‌ల‌యాళ చిత్రం దృశ్యం -2 ఆధారంగా ఈ సినిమా రూపొందింది. స్ట్రెయిట్ సినిమాతో కంపేర్ చేస్తే బాలీవుడ్ రీమేక్ ప‌దింత‌ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం హాట్‌టాపిక్‌గా మారింది.

దృశ్యం -2
దృశ్యం -2

దృశ్యం -2

Drishyam 2 Collection: వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న బాలీవుడ్‌లో (Bollywood) దృశ్యం -2 నూత‌నోత్సాహాన్ని నింపింది. అజ‌య్ దేవ్‌గ‌ణ్ హీరోగా న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మూడు వంద‌ల‌ కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమా విడుద‌లై ఐదు వారాలు పూర్త‌యిన క‌లెక్ష‌న్స్ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు.

ట్రెండింగ్ వార్తలు

Panchayat Season 3 OTT: పాపులర్ సిరీస్ పంచాయత్ మూడో సీజన్‍పై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్

Romeo OTT: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ సినిమా! కానీ..

Mahesh Babu new look: పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల

Theatre releases this week: ఈ వారం థియేటర్లలోకి రానున్న 5 సినిమాలు.. డిఫరెంట్ జానర్లతో..

ఈ ఏడాది హిందీలో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న మూడో సినిమాగా దృశ్యం -2 నిలిచింది. అభిషేక్ పాఠ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో శ్రియ‌, ట‌బు, అక్ష‌య్ ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. దృశ్యం సినిమాకు కొన‌సాగింపుగా ఈ సినిమా రూపొందింది. పోలీసుల నుంచి ఎదురైన ముప్పు నుంచి త‌న ఫ్యామిలీని కాపాడుకోవ‌డానికి విజ‌య్ వేసిన ఎత్తుల‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు.

దృశ్యంతో పాటు దృశ్యం -2 సినిమాల్లో అజ‌య్ దేవ్‌గ‌ణ్ హీరోగా న‌టించాడు. ఈ రెండు సినిమాలు రీమేక్‌లే కావ‌డం గ‌మ‌నార్హం. మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళ చిత్రం దృశ్యం, దృశ్యం-2 ఆధారంగా ఈ సినిమాల‌ను తెర‌కెక్కించారు. క‌రోనా కార‌ణంగా మ‌ల‌యాళంలో దృశ్యం -2 సినిమా ఓటీటీలో విడుదైలంది. మ‌ల‌యాళ వెర్ష‌న్ డిజిట‌ల్‌ రైట్స్‌ను కేవ‌లం ఇర‌వై ఐదు కోట్ల‌కు అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకున్న‌ది.

బాలీవుడ్‌లో మాత్రం థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా మూడు వంద‌ల కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. స్ట్రెయిట్ సినిమాతో కంపేర్ చేస్తే బాలీవుడ్ రీమేక్ ప‌దింత‌ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రెండు సినిమాల క‌లెక్ష‌న్స్‌ను కంపేర్ చేస్తూ నెటిజ‌న్లు చేసిన ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

దృశ్యం -2 సినిమాను తెలుగులో వెంక‌టేష్ రీమేక్ చేశారు. తెలుగు రీమేక్ కూడా డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.