తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dasara First Day Collection: ద‌స‌రా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - చిరంజీవి, బాల‌కృష్ణ రికార్డుల‌ను బ్రేక్ చేసిన నాని

Dasara First Day Collection: ద‌స‌రా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - చిరంజీవి, బాల‌కృష్ణ రికార్డుల‌ను బ్రేక్ చేసిన నాని

31 March 2023, 10:26 IST

google News
  • Dasara First Day Collection: నాని ద‌స‌రా సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది. ప‌లు టాలీవుడ్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.

నాని ద‌స‌రా
నాని ద‌స‌రా

నాని ద‌స‌రా

Dasara First Day Collection: నాని (Nani) ద‌స‌రా సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా తొలిరోజు టాలీవుడ్‌లో రికార్డుల మోత మోగించింది. గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా మొద‌టిరోజు ఇర‌వై ఐదు కోట్ల గ్రాస్‌ను ప‌ధ్నాలుగున్న‌ర‌ కోట్ల షేర్‌ను రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. నాని కెరీర్‌లో తొలిరోజు అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాగా ద‌స‌రా రికార్డుల‌ను క్రియేట్ చేసింది.

చిరు, బాలయ్య రికార్డులు బ్రేక్…

నైజాం ఏరియాలో ఈ సినిమాకు గురువారం రోజు ఆరు కోట్ల ఎన‌భైల‌క్ష‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. 2023 ఇయ‌ర్‌లో నైజాం ఏరియాలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్న‌ సినిమాగా ద‌స‌రా నిలిచింది. ఈ సంక్రాంతికి రిలీజైన బాల‌కృష్ణ (Balakrishna) వీర‌సింహారెడ్డి ఆరు కోట్ల ఇర‌వై ల‌క్ష‌ల గ్రాస్‌ను రాబ‌ట్ట‌గా, చిరంజీవి (Chiranjeevi)వాల్తేర్ వీర‌య్య ఆరు కోట్ల ప‌ది ల‌క్ష‌ల గ్రాస్‌ను ద‌క్కించుకుంది.ఆ సినిమాల రికార్డుల‌ను ద‌స‌రా అధిగ‌మించ‌డం గ‌మ‌నార్హం.

గురువారం రోజు సీడెడ్‌లో సీడెడ్‌లో రెండున్న‌ర కోట్లు, ఈస్ట్‌లో ఎన‌భై ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ , గుంటూర్‌లో కోటి ఇర‌వై ల‌క్ష‌ల‌కుపైగా ద‌స‌రా క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఓవ‌రాల్‌గా ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో మొద‌టిరోజు ఈ సినిమా ఇర‌వై ఐదు కోట్ల గ్రాస్‌ను 14.50 కోట్ల షేర్‌ను సొంతం చేసుకున్న‌ట్లు చెబుతున్నారు.

మిడ్ రేంజ్ హీరోల్లో రికార్డ్‌...

ద‌స‌రాతో మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో క‌లెక్ష‌న్స్ ప‌రంగా నాని నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలిచాడు. లైగ‌ర్(liger) సినిమా రికార్డుల‌ను ద‌స‌రా బ్రేక్ చేసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ మూవీ తొలిరోజు తొమ్మిదిన్న‌ర కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది. 14.50 కోట్ల షేర్‌తో లైగ‌ర్ రికార్డును నాని తిర‌గ‌రాశాడు. ఓవ‌ర్‌సీస్ క‌లెక్ష‌న్స్‌తో క‌లిపి మొద‌టిరోజు 30 కోట్ల‌కుపైగా ద‌స‌రా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు.

నాని న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు...

తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రియ‌లిస్టిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా అయినా ఎంతో అనుభ‌వ‌మున్న ద‌ర్శ‌కుడిగా ఈ సినిమాను తెర‌కెక్కించాడు. స్నేహం, ప్రేమ‌, ప‌గ అంశాల‌తో రూపొందిన ఈ సినిమాలో నాని, కీర్తిసురేష్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం