తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dacoit Movie: అడివి శేష్, శృతి ‘డెకాయిట్’ సినిమా స్టోరీ లైన్ ఇదే! ఇంట్రెస్టింగ్‍గా టైటిల్ టీజర్

Dacoit Movie: అడివి శేష్, శృతి ‘డెకాయిట్’ సినిమా స్టోరీ లైన్ ఇదే! ఇంట్రెస్టింగ్‍గా టైటిల్ టీజర్

20 December 2023, 18:59 IST

    • Dacoit Movie: అడివి శేష్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారైంది. ఈ మూవీ బ్యాక్‍డ్రాప్ గురించి కూడా సమాచారం వెల్లడైంది.
Dacoit Movie: అడివి శేష్, శృతి ‘డెకాయిట్’ సినిమా స్టోరీ లైన్ ఇదే! ఇంట్రెంస్టింగ్‍గా టైటిల్ టీజర్
Dacoit Movie: అడివి శేష్, శృతి ‘డెకాయిట్’ సినిమా స్టోరీ లైన్ ఇదే! ఇంట్రెంస్టింగ్‍గా టైటిల్ టీజర్

Dacoit Movie: అడివి శేష్, శృతి ‘డెకాయిట్’ సినిమా స్టోరీ లైన్ ఇదే! ఇంట్రెంస్టింగ్‍గా టైటిల్ టీజర్

Dacoit Movie: డైనమిక్ హీరో అడివి శేష్, హీరోయిన్ శృతి హాసన్ కాంబినేషన్‍లో సినిమా ప్రకటన రాగానే ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తి నెలకొంది. శేష్ఎక్స్‌శృతి (SeshXShruti) అంటూ ఈ ప్రాజెక్టు అనౌన్స్‌మెంట్ వచ్చింది. తెలుగు, హిందీలో ద్విభాషా చిత్రంగా రూపొందనుంది. షానియెల్ దేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ లవ్, యాక్షన్ చిత్రానికి టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకు ‘డెకాయిట్’ అనే టైటిల్‍ను మూవీ యూనిట్ ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి నేడు (డిసెంబర్ 20) టైటిల్ టీజర్ కూడా రిలీజ్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

Prabhas Instagram Story: ప్రభాస్ పెళ్లి కాదు.. అతని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వెనుక అసలు విషయం ఇదీ

జూలియెట్ ఎన్నేళ్లయింది మనం కలిసి అనే డైలాగ్‍లో అడివి శేష్ ఎంట్రీ.. ఈ డెకాయిట్ టైటిల్ టీజర్లో ఉంది. అల్లర్లు జరిగిన ప్రాంతంలో తుపాకీ పట్టుకొని శృతి హాసన్ కనిపిస్తారు. గతంలో వీరిద్దరూ ప్రేమించుకొని విడిపోయారనేలా డైలాగ్స్ ఉన్నాయి. శేష్, శృతి ఇద్దరూ ఒకరికొకరు తుపాకులు ఎక్కు పెట్టుకుంటారు. తుపాకీ ఫైర్ చేసినట్టు, కింద పడినట్టు బ్యాక్‍గ్రౌండ్ సౌండ్ కూడా ఉంది. మొత్తంగా డెకాయిట్ టైటిల్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఈ చిత్రానికి కథను దర్శకుడు షానెయెల్‍తో పాటు అడివి శేష్ కూడా రాశారు. టైటిల్ టీజర్‌కు భీమ్స్ సెసిరోలియో ఇచ్చిన బీజీఎం అదిరిపోయింది.

డెకాయిట్ స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇదే!

డెకాయిట్ స్టోరీ లైన్ కూడా బయటికి వచ్చింది. వారి జీవితాలు మార్చుకునేందుకు ఇద్దరు మాజీ లవర్స్ తప్పని పరిస్థితుల్లో కలిసి దోపిడీలు చేయడమే డెకాయిట్ ప్రధాన బ్యాక్‍డ్రాప్‍గా ఉంది. శేష్, శృతి ప్రేమించుకొని విడిపోయి.. మళ్లీ కలిసి దోపిడీలు చేయడం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని సమాచారం. మొత్తంగా ఇంటెన్స్, లవ్ యాక్షన్ చిత్రంగా డెకాయిట్ తెరకెక్కనుంది.

డెకాయిట్ చిత్రానికి షానియెల్ దేవ్ దర్శకుడు కాగా.. ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తుండగా.. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం