తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Ott Release: యానిమల్ ఓటీటీ రిలీజ్‌ ఆపండి.. హైకోర్టుకు వెళ్లిన సహ నిర్మాత

Animal OTT Release: యానిమల్ ఓటీటీ రిలీజ్‌ ఆపండి.. హైకోర్టుకు వెళ్లిన సహ నిర్మాత

HT Telugu Desk HT Telugu

15 January 2024, 18:47 IST

google News
    • సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ టి-సిరీస్ ప్రాఫిట్ షేరింగ్ ఒప్పందాన్ని గౌరవించడం లేదని, ఆర్థిక నష్టపరిహారం అందించడంలో విఫలమైందని సినీ1 ఆరోపించింది.
యానమిల్ మూవీలో రణ్‌బీర్ కపూర్
యానమిల్ మూవీలో రణ్‌బీర్ కపూర్

యానమిల్ మూవీలో రణ్‌బీర్ కపూర్

రణబీర్ కపూర్ నటించిన హిట్ మూవీ యానిమల్ సహనిర్మాత సినీ1 స్టూడియోస్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

టి-సిరీస్ తో కుదుర్చుకున్న తమ ఒప్పందం ఉల్లంఘనకు గురైందని, యానిమల్‌లో 35% ప్రాఫిట్ షేర్, మేథో సంపత్తి హక్కులు ఉన్నాయని సినీ1 స్టూడియోస్ దాఖలు చేసిన దావాలో పేర్కొంది. ఈ చిత్రాన్ని నిర్మించడం, ప్రమోట్ చేయడం, విడుదల చేయడంలో టీ-సిరీస్ తమ అనుమతిని తీసుకోలేదని సినీ1 పేర్కొంది.

సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ టి-సిరీస్ ప్రాఫిట్ షేరింగ్ ఒప్పందాన్ని గౌరవించలేదని, ఆర్థిక నష్టపరిహారం అందించడంలో విఫలమైందని సినీ1 ఆరోపించింది.

యానిమల్ పార్క్ అనే సీక్వెల్‌ను టి-సిరీస్ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ, ఈ డెరివేటివ్ వర్క్‌కు తమకు హక్కులు వర్తిస్తాయని, తమతో సంప్రదింపులు అవసరమని వాదించింది.

అయితే సోమవారం నాటి విచారణలో టి-సిరీస్ న్యాయవాది అమిత్ సిబల్ ఈ చిత్రం హక్కులను సినీ1 రూ. 2.2 కోట్లకు వదులుకున్నట్లు ఆధారాలను సమర్పించారు. దీనిని సినీ 1 దాచిపెట్టిందని చెబుతూ వారి వాదనల చెల్లుబాటుపై సందేహాలను లేవనెత్తారు. వారు ఎటువంటి చట్టపరమైన పరిష్కారానికి అర్హులు కాదని నొక్కి చెప్పారు.

దీనిపై స్పందించిన కోర్టు డాక్యుమెంట్ స్వభావాన్ని స్పష్టం చేయాలని సినీ1 తరఫు న్యాయవాది సందీప్ సేథీని కోరింది. తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసింది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన వివాదాస్పద క్రైమ్ యాక్షన్ డ్రామా యానిమల్ 2023 డిసెంబర్ 1 న విడుదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకు పైగా వసూలు చేసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం