Christopher Movie Review: క్రిస్టోఫర్ మూవీ రివ్యూ - మమ్ముట్టి యాక్షన్ సినిమా ఎలా ఉందంటే
20 March 2023, 5:54 IST
Christopher Movie Review: మమ్ముట్టి, స్నేహ, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ మూవీ క్రిస్టోఫర్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ రిలీజైంది.
క్రిస్టోఫర్
Christopher Movie Review: మమ్ముట్టి(Mammootty), స్నేహ(Sneha), అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సినిమా క్రిస్టోఫర్. యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు బి ఉన్ని కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే...
ఐపీఎస్ కథ
క్రిస్టోఫర్ (మమ్ముట్టి) నిజాయితీపరుడైన ఐపీఎస్ ఆఫీసర్. కేరళలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరుతెచ్చుకుంటాడు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన క్రిమినల్స్‌ను ఎన్‌కౌంటర్ చేస్తుంటాడు. వరుస ఎన్‌కౌంటర్స్ కారణంగా అతడిపై హోమ్ సెక్రటరీ బీనా (స్నేహ) ఒత్తిడితో ప్రభుత్వం విచారణ కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీకి సులేఖ (అమలాపాల్) హెడ్‌గా ఉంటుంది.
క్రిస్టోఫర్ గురించి ఒక్కో నిజాన్ని తెలుసుకోవడం మొదలుపెడుతుంది సులేఖ. ఆమె అన్వేషణలో క్రిస్టోఫర్ గురించి ఏ తేలింది? హోమ్ సెక్రటరీ బీనాను పెళ్లి చేసుకున్న క్రిస్టోఫర్ ఆమెకు ఎందుకు దూరంగా ఉండాల్సివచ్చింది. క్రిస్టోఫర్ దత్తత తీసుకున్న అమీనాను (ఐశ్వర్య లక్ష్మి) సీతారామ్ త్రిమూర్తి (వినయ్ రాయ్) అనే బిజినెస్‌మెన్ ఎందుకు చంపించాడు? అతడిపై క్రిస్టోఫర్ ఏ విధంగా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే (Christopher Movie Review)ఈ సినిమా కథ.
సామాజిక సందేశంతో...
హీరోయిజం, కమర్షియల్ ఫార్ములాకు బలమైన సామాజిక సందేశాన్ని మేళవించి దర్శకుడు బి ఉన్నికృష్ణన్ క్రిస్టోఫర్ సినిమాను తెరకెక్కించారు.
ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తోన్న న్యాయవ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకుంటూ డబ్బు, పలుకుబడితో కొందరు క్రిమినల్స్ నేరాలు చేసి తప్పించుకుంటూనే ఉంటున్నారని అలాంటి వారికి ఎన్‌కౌంటర్ చేయడమే పరిష్కారం అని నమ్మే ఓ పోలీస్ ఆఫీసర్ జీవితం నేపథ్యంలో ఈసినిమా సాగుతుంది.
ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతోన్న వారికి చంపడమే సరైన శిక్ష అని నమ్మిన అతడి సిద్ధాంతం సరైందా లేదా అన్నదే థ్రిల్లింగ్‌గా దర్శకుడు ఈ సినిమాలో చూపించారు.
రివేంజ్ డ్రామా..
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ప్రత్యేకంగా కథ అంటూ ఉండదు.క్రిస్టోఫర్ ఎన్‌కౌంటర్స్‌పై ప్రభుత్వం విచారణ కమిటీ వేయడం, ఆ కమిటీ హెడ్ సులేఖ క్రిస్టోఫర్ జీవితాన్ని గురించి అన్వేషించే అంశాలతో సినిమా మొదలవుతుంది. వివిధ ప్రాంతాల్లో డ్యూటీ పేరుతో క్రిస్టోఫర్ చేసిన ఎన్‌కౌంటర్స్ చుట్టూ యాక్షన్ అంశాలతో ఫస్ట్ హాఫ్‌ను నడిపించారు దర్శకుడు. ఈ సీన్స్ నుంచి కావాల్సినంత హీరోయిజాన్ని రాబట్టుకున్నారు.
ఆ తర్వాత కథ మొత్తం త్రిమూర్తులతో క్రిస్టోఫర్ రివేంజ్ డ్రామాతో పాటు బీనాకు క్రిస్టోఫర్ దూరమయ్యే అంశాల చుట్టూ నడుస్తుంది. క్రిస్టోఫర్‌ను దెబ్బతీయడానికి త్రిమూర్తులు వేసే ప్లాన్స్, వాటిని తన తెలివితేటలతో క్రిస్టోఫర్ చిత్తు చేయడం ఇలా చివరి వరకు రివేంజ్ డ్రామా సాగుతుంది. క్లైమాక్స్‌లో పెద్ద ట్విస్ట్ ఇచ్చి త్రిమూర్తులను క్రిస్టోఫర్ చంపే సీన్‌తో సినిమా ముగుస్తుంది.
ఫ్యామిలీ ఎమోషన్స్ మిస్...
పార్ట్‌లుగా సినిమా బాగున్నా ఓవరాల్‌గా యావరేజ్‌గా అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్ సరైన కథంటూ లేకపోవడంతో కేవలం కేవలం యాక్షన్ అంశాలనే దర్శకుడు నమ్ముకున్నట్లుగా అనిపిస్తుంది. క్రిస్టోఫర్, త్రిమూర్తులు మధ్య రివేంజ్ డ్రామా రోటీన్‌గా రాసుకున్నారు. క్రిస్టోఫర్‌కు బీనా దూరం అయ్యే సీన్స్ బాగున్నా ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ పై దర్శకుడు ఎక్కువగా దృష్టిసారించలేదు.
డైలాగ్స్ తక్కువ...
క్రిస్టోఫర్ అనే ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా మమ్ముట్టి యాక్టింగ్ బాగుంది. తక్కువ డైలాగ్స్ సీరియస్‌లుక్‌లో ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంది. త్రిమూర్తులుగా వినయ్ రాయ్ స్టైలిష్ విలన్‌గా కనిపించారు. మమ్ముట్టి భార్యగా స్నేహ, ఏసీపీ ఆఫీసర్‌గా అమలాపాల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించారు. మమ్ముట్టి కూతురిగా ఐశ్వర్య లక్ష్మి యాక్టింగ్ బాగుంది.
Christopher Movie Review- ఫక్తు కమర్షియల్ మూవీ...
క్రిస్టోఫర్ ఫక్తు కమర్షియల్ ఫార్ములాలో రూపొందిన సినిమా. మమ్ముట్టి ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది.
టాపిక్