తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Waltair Veerayya Collection Day 10: 200 కోట్ల క్ల‌బ్‌లో వాల్తేర్ వీర‌య్య‌ - బాహుబ‌లి -2 త‌ర్వాత చిరంజీవిదే ఈ రికార్డ్‌

Waltair Veerayya Collection Day 10: 200 కోట్ల క్ల‌బ్‌లో వాల్తేర్ వీర‌య్య‌ - బాహుబ‌లి -2 త‌ర్వాత చిరంజీవిదే ఈ రికార్డ్‌

23 January 2023, 19:37 IST

  • Waltair Veerayya Collection Day 10: చిరంజీవి వాల్తేర్ వీర‌య్య సినిమా బాహుబ‌లి -2 త‌ర్వాత ప‌దో రోజు బాక్సాఫీస్ వ‌ద్ద హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. ప‌ది రోజుల్లో ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

చిరంజీవి వాల్తేర్ వీర‌య్య
చిరంజీవి వాల్తేర్ వీర‌య్య

చిరంజీవి వాల్తేర్ వీర‌య్య

Waltair Veerayya Collection Day 10: చిరంజీవి (Chiranjeevi) వాల్తేర్ వీర‌య్య ప‌ది రోజుల్లో 200 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవి కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా వాల్తేర్ వీర‌య్య నిలిచింది. శ‌నివారం నాటితో ఈ సినిమా 200 కోట్ల క‌లెక్ష‌న్ల మైలురాయిని అందుకున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

Anil Ravipudi: దర్శకరత్న దాసరి జయంతి వేడుకలు.. ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి కాంట్రవర్సీ కామెంట్స్

Aha OTT: ఓటీటీలో ఆహా అనిపించే 3 సినిమాలు.. అన్ని ఒకేదాంట్లో ఒకే రోజు నుంచి స్ట్రీమింగ్.. మీరు చూశారా?

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో సైరా న‌ర‌సింహారెడ్డి హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది. ఆ రికార్డ్‌ను వాల్తేర్ వీర‌య్య బ్రేక్ చేసింది. శ‌నివారం రోజు వాల్తేర్ వీర‌య్య సినిమాకు ఆరున్న‌ర కోట్ల వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌దో రోజు బాహుబ‌లి -2 త‌ర్వాత అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా వాల్తేర్ వీర‌య్య‌ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ జాబితాలో ఆర్ఆర్ఆర్ టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా వాల్తేర్ వీర‌య్య మూడో ప్లేస్‌లో ఉంది.

ఈ ఏడాది సంక్రాంతి రిలీజ్‌ల‌లో టాలీవుడ్ నుంచి రెండు వంద‌ల కోట్ల మైలురాయిని అందుకున్న ఏకైక సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఔట్‌ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈసినిమాలో చిరంజీవితో పాటు ర‌వితేజ (Raviteja) మ‌రో హీరోగా న‌టించాడు. టైటిల్ పాత్ర‌లో చిరంజీవి న‌టించ‌గా ఏసీపీ విక్ర‌మ్ సాగ‌ర్ అనే క్యారెక్ట‌ర్‌ను ర‌వితేజ చేశాడు.

ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌న సోద‌రుడి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన డాన్‌పై వాల్తేర్ వీర‌య్య ఎలా రివేంజ్ తీర్చుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. ఇందులో చిరంజీవికి జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. కేథ‌రిన్ కీల‌క పాత్ర‌లో న‌టించింది. వాల్తేర్ వీర‌య్య సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.