తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Remake Movies: టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ రీమేక్ మూవీస్‌ చేసిన హీరోలు వీళ్లే - చిరంజీవి టాప్ - బాల‌కృష్ణ ప్లేస్ ఇదే!

Remake Movies: టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ రీమేక్ మూవీస్‌ చేసిన హీరోలు వీళ్లే - చిరంజీవి టాప్ - బాల‌కృష్ణ ప్లేస్ ఇదే!

15 March 2024, 12:55 IST

  • Remake Movies: తెలుగులో అత్య‌ధిక రీమేక్ సినిమాలు చేసిన హీరోల లిస్ట్‌లో చిరంజీవి టాప్‌లో ఉన్నాడు. అత‌డి త‌ర్వాత ఉన్న హీరోలు ఎవ‌రంటే?

చిరంజీవి, బాల‌కృష్ణ, నాగార్జున, వెంకటేష్
చిరంజీవి, బాల‌కృష్ణ, నాగార్జున, వెంకటేష్

చిరంజీవి, బాల‌కృష్ణ, నాగార్జున, వెంకటేష్

Remake Movies: రీమేక్ క‌థ‌ల‌ను ట‌చ్ చేయ‌ని హీరోలు చాలా త‌క్కువ మంది ఉంటారు. త‌మ కెరీర్‌లో స్ట్రెయిట్ స్టోరీస్‌ కంటే రీమేక్ క‌థ‌ల‌తోనే ఎక్కువ‌గా సినిమాలు చేసిన స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. తెలుగులో సీనియ‌ర్ హీరోలు వెంక‌టేష్, చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌తో పాటు నేటిత‌రం స్టార్స్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్ర‌భాస్ వర‌కు స్టార్ హీరోలంద‌రూ రీమేక్‌ల‌ను ట‌చ్ చేసిన వారే. వీరిలో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన స్టార్లు ఎవ‌రంటే?

ట్రెండింగ్ వార్తలు

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

చిరంజీవి టాప్‌...

తెలుగులో ఎక్కువ‌గా రీమేక్ సినిమాలు చేసిన హీరోల్లో చిరంజీవి ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. న‌ల‌భై ఐదేళ్ల సినీ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చిరంజీవి 38 రీమేక్ సినిమాలు చేశాడు. బాపు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌న‌వూరి పాండ‌వులు చిరంజీవి కెరీర్‌లో ఫ‌స్ట్ రీమేక్ మూవీ. క‌న్న‌డ మూవీ పడువ‌రాల్లి పాండ‌వ‌రు సినిమా ఆధారంగా మ‌న‌వూరి పాండ‌వులు తెర‌కెక్కింది. చిరంజీవికి స్టార్‌గా నిల‌బెట్టిన‌ ఖైదీ మూవీ కూడా రీమేక్ కావ‌డం గ‌మ‌నార్హం.

రీమేక్ క‌థ‌ల‌తో చిరంజీవి చేసిన ఆరాధ‌న‌, విజేత‌, ప‌సివాడి ప్రాణం, రాజా విక్ర‌మార్క‌, ఘ‌రానా మొగుడు ఇండ‌స్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబ‌ర్ 150 కూడా త‌మిళ మూవీ క‌త్తి ఆధారంగా రూపొందింది. గ‌త ఏడాది భోళా శంక‌ర్ సినిమాలో న‌టించాడు చిరంజీవి. అజిత్ హీరోగా న‌టించిన వేదాళం రీమేక్‌గా భోళాశంక‌ర్ రూపొందింది. హిందీలో చిరంజీవి న‌టించిన ది జెంటిల్‌మ‌న్‌, ఆజ్ కా గుండారాజ్‌, ప్ర‌తిబంధ్ కూడా రీమేక్ క‌థ‌ల‌తోనే రూపొందాయి.

వెంక‌టేష్ 32 సినిమాలు...

1987 లో రిలీజైన భార‌తంలో అర్జునుడు నుంచి కిసీకా భాయ్ కిసీ కీ జాన్ వ‌ర‌కు త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 32 రీమేక్ సినిమాలు చేశాడు వెంక‌టేష్‌. చిరంజీవి త‌ర్వాత టాలీవుడ్‌లో అత్య‌ధికంగా రీమేక్ సినిమాల్లో న‌టించిన హీరోగా వెంక‌టేష్ నిలిచాడు. చంటి, చిన‌రాయుడు, రాజా, సూర్య‌వంశం, దృశ్యం వంటి రీమేక్ సినిమాల‌తో వెంక‌టేష్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు.

నాగార్జున 21 రీమేక్‌లు..

ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు నాగార్జున‌. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన పురింపు మ‌రియం జోస్ ఆధారంగా నా సామిరంగ తెర‌కెక్కింది. నాగార్జున కెరీర్‌లో ఇది 21వ రీమేక్ మూవీ. చిరంజీవి, వెంక‌టేష్ త‌ర్వాత తెలుగు హీరోల్లో అత్య‌ధిక రీమేక్ సినిమాల్లో న‌టించింది నాగార్జునే. రీమేక్ మూవీతోనే నాగార్జున కెరీర్ ఆరంభ‌మైంది. హిందీ మూవీ హీరో స్ఫూర్తితో నాగార్జున డెబ్యూ మూవీ విక్ర‌మ్ రూపొందింది. నాగార్జున రీమేక్ సినిమాల్లో హ‌లో బ్ర‌ద‌ర్‌, నువ్వు వ‌స్తావ‌ని, నిర్ణ‌యం వంటి సినిమాలు హిట్ట‌య్యాయి.

హీరోగా బాల‌కృష్ణ ఇప్ప‌టివ‌ర‌కు చేసిన 109 సినిమాల్లో కేవ‌లం 17 మాత్ర‌మే రీమేక్ సినిమాలు ఉండ‌టం గ‌మ‌నార్హం. మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, మువ్వ‌గోపాలుడు, ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు, గొప్పింటి అల్లుడు, ల‌క్ష్మిన‌ర‌సింహా, ల‌య‌న్ వంటి రీమేక్‌ల‌లో బాల‌కృష్ణ న‌టించాడు. బాల‌కృష్ణ చేసిన రీమేక్ సినిమాల్లో చాలా వ‌ర‌కు ఫ్లాప్‌లే ఉన్నాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ 15 రీమేక్‌లు...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం స్ట్రెయిట్ కంటే రీమేక్ సినిమాల‌తోనే కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం రూపొందుతోన్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ బాల‌కృష్ణ కెరీర్‌లో ప‌దిహేన‌వ రీమేక్ మూవీ. ప‌వ‌న్‌కు ఖుషి, గ‌బ్బ‌ర్‌సింగ్‌, త‌మ్ముడు, వ‌కీల్‌సాబ్ వంటి రీమేక్ సినిమాలే స్టార్‌డ‌మ్‌ను తీస‌కొచ్చాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం