తెలుగు న్యూస్ / ఫోటో /
Naa Saami Ranga on OTT: ఓటీటీలోకి వచ్చేసిన నా సామిరంగ సినిమా: మూడు భాషల్లో స్ట్రీమింగ్: వివరాలివే
- Naa Saami Ranga on OTT: నా సామిరంగ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగుతో పాటు మరో రెండు భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.
- Naa Saami Ranga on OTT: నా సామిరంగ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగుతో పాటు మరో రెండు భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.
(1 / 5)
కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చి హిట్ అయింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్‍తో పాటు ఎంటర్‌టైన్‍మెంట్‍తో అలరించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
(2 / 5)
నా సామిరంగ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో నేడు (ఫిబ్రవరి 17) స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలోకి వచ్చిన నెల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది.
(3 / 5)
డిస్నీ+ హాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్‍లో తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ నా సామిరంగ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది.
(4 / 5)
నా సామిరంగ చిత్రంలో కిష్టయ్యగా యాక్షన్‍తో పాటు డైలాగ్‍లు కూడా అదరగొట్టారు నాగార్జున. ఈ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు.
ఇతర గ్యాలరీలు