Chiru On Waltair Veerayya : సెకండ్ హాఫ్‌లో రవితేజ.. సినిమా చూసి వచ్చిన చిరంజీవి
27 December 2022, 22:44 IST
- Waltair Veerayya Movie News : వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి.. ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది చిత్రబృందం. ఓడ రేవు సెట్ వద్దకు మీడియాను ఆహ్వానించారు.
చిరంజీవి
వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) చిత్ర బృందం స్పెషల్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కొన్నిరోజుల ముందు ఇలా ప్రెస్ మీట్ పెట్టింది. అయితే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరయ్య సినిమా చూసి.. వచ్చారు. ఈ సినిమాపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆనందం లోపల నుంచి తన్నుకొస్తుందని మెగాస్టార్ అన్నారు. ఈ సినిమాలో డబ్బు తీసుకుని ఎవరూ చేయలేదని.., ప్రేమను పంచి.. సినిమా చేశారన్నారు. బాబీ ఈ కథ చెప్పగానే.. ఏదో మేజిక్ ఉందనిపించిందన్నారు. మెుదలు, చివర బాగుంటే.. మధ్యలో ఏదో కథ అల్లుకోవచ్చని చిరు అన్నారు.
'బాబీ కథ తీసుకొచ్చాక.. హగ్ చేసుకుని.. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆరోజు చెప్పాను. ఇంత బడ్జెట్ పెట్టడానికి ఆ రోజు నేను చెప్పిన మాటే కారణం. గతంలో ఓ సీనియర్ హీరో మనల్ని అభిమానించే అభిమాని డైరెక్టర్ అయితే .. అతనితో చేయమని చెప్పాడు. బాబీ, వాళ్ల నాన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్. నేను కూడా ఊహించలేని లేవల్ లో తెర మీద నన్ను చూపిస్తాడు. ఇప్పుడే సినిమా చూసి వచ్చాను.. బాగుంది. మీరు ఊహించుకున్న దానికి మించి ఉంటుంది.' అని చిరంజీవి(Chiranjeevi) అన్నారు.
బాబీ కోరుకున్నవి అన్ని ఇచ్చామని, ఏ పాత్ర కావాలో.. దానికి తగ్గట్టుగా నటులు దొరికారన్నారు. రవితేజ(Ravi Teja) సెకండ్ హాఫ్ లో వచ్చేది కూడా పాత్రకు తగ్గట్టుగానే ఉంటుందని చిరంజీవి అన్నారు. రవితేజ వస్తేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుందన్నారు. 'నా సినిమా అనగానే.. డీఎస్పీ(DSP)కి మంచి ఊపు వస్తుంది. దేవి శీ ప్రసాద్ మంచి ట్యూన్స్(Tunes) ఇచ్చాడు. చంద్రబోస్ లిరిక్స్ చాలా బాగా ఉన్నాయి. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ ప్రేమించి చేశారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ అంటే నాకు వ్యక్తిగతంగా ఎంతో ఇష్టం.' అని చిరంజీవి అన్నారు.
రవితేజ(Ravi Teja) మాత్రం ఈ ఫంక్షన్ లో ఏం మాట్లాడలేదు. 2 ముక్కలు కూడా మాట్లాడను.. అన్ని ముక్కలూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే అంటూ చెప్పారు.
ప్రెస్ మీట్ ఇంత అద్భుతంగా ఉండటం ఎవరూ చూసుండరని నటుడు రాజేంద్రప్రసాద్(Rajendraprasad) అన్నారు. మెగా ఈవెంట్స్ అన్నీ కూడా మెగా వల్లనే అవుతాయని చెప్పారు. కంటెంట్ వినగానే మెగా హిట్ తప్పదు అనే విషయం అర్థమైందన్నారు. పాత్రలను ఎవరెవరు వేయాలో వారే వేశారన్నారు. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ తో చిరంజీవి(Chiranjeevi) చేసేందుకు రెడీ అయినప్పుడే ఈ సినిమా హిట్ అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
సినిమాలో చిరంజీవితో కలిసి రవితేజ(Ravi Teja) చేస్తున్నాడని బాబీ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానని దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) చెప్పారు. ‘చిరంజీవి స్ఫూర్తితో బాబీ సినిమాల్లోకి వచ్చాడు. రవితేజ కూడా అలానే వచ్చాడు. ఆ ఇద్దరూ కలిసి చిరంజీవితో సినిమా చేయడం విశేషమే. ఇది మెగా మాస్ మూవీ అనుకోవచ్చని’ డీఎస్పీ అన్నారు.