తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandramukhi 2 Ott Official: ఓటీటీలోకి భయపెట్టే చంద్రముఖి 2.. అనుకున్నదానికంటే ముందే స్ట్రీమింగ్

Chandramukhi 2 OTT Official: ఓటీటీలోకి భయపెట్టే చంద్రముఖి 2.. అనుకున్నదానికంటే ముందే స్ట్రీమింగ్

Sanjiv Kumar HT Telugu

21 October 2023, 13:38 IST

  • Chandramukhi 2 Official OTT Release: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కలిసి నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 28న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎన్నో రోజులుగా చంద్రముఖి 2 ఓటీటీ విడుదల గురించి చర్చ జరగ్గా.. తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది.

ఓటీటీలో చంద్రముఖి 2 విడుదలపై అధికారిక ప్రకటన
ఓటీటీలో చంద్రముఖి 2 విడుదలపై అధికారిక ప్రకటన

ఓటీటీలో చంద్రముఖి 2 విడుదలపై అధికారిక ప్రకటన

హీరో, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్, బాలీవుడ్ కాంట్రవర్సీ భామ కంగనా రనౌత్ మొదటి సారి కలిసి నటించిన భయపెట్టే హారర్ థ్రిల్లర్ మూవీ చంద్రముఖి 2. సుమారు 17 ఏళ్ల క్రితం ప్రేక్షకుల సంచలన విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిందే చంద్రముఖి 2. మొదటి పార్టుకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ పి వాసునే సీక్వెల్‌ను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‍లో సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు.

ట్రెండింగ్ వార్తలు

Kalvan Review: కాల్వన్ రివ్యూ - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైన‌ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Jr NTR Donation: ఏపీలోని ఆలయానికి భారీ విరాళం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్: వివరాలివే

Krishna mukunda murari serial: కృష్ణకి పట్టపగలే చుక్కలు చూపిస్తానన్న ముకుంద.. మీరా మీద డౌట్ పడిన తింగరి

Guppedantha Manasu Serial: యాక్టింగ్‌లో వ‌సుధార‌ను మించిన‌ శైలేంద్ర - మోస‌పోయిన రాజీవ్ - మ‌ను కోసం రిషి భార్య రిస్క్‌

చంద్రముఖి సెన్సేషనల్ హిట్ తర్వాత సీక్వెల్‍గా వచ్చిన చంద్రముఖి 2 మొదటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. అలా వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన చంద్రముఖి 2 సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగా వచ్చాయి. సేమ్ చంద్రముఖి తరహాలోనే సీక్వెల్‌ను కూడా దింపేసారని కామెంట్స్ చేశారు.

ఆ క్రమంలోనే చంద్రముఖి 2 ఓటీటీ విడుదలపై ఆసక్తికర చర్చ జరిగింది. గత కొన్ని రోజులుగా చంద్రముఖి 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ ప్రచారం సాగింది. కానీ, తాజాగా వాటన్నింటికి చెక్ పెడుతూ అధికారికంగా చంద్రముఖి 2 డిజిటల్ స్ట్రీమింగ్ తేదిని ప్రకటించింది సదరు ఓటీటీ సంస్థ. చంద్రముఖి 2 ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిన ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల తేది తెలుపుతూ ట్విటర్ వేదికగా అనౌన్స్ చేసింది.

"భయపెట్టే చంద్రముఖి 2 సినిమా త్వరలో మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. నెట్‌ఫ్లిక్స్ లో చంద్రముఖి 2 మూవీ అక్టోబర్ 26 నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది" అని నెట్ ఫ్లిక్స్ సౌత్ ఇండియా అకౌంట్ ద్వారా తెలిపింది. సుమారు రెండు, మూడు నెలలకు ఓటీటీలో విడుదల చేస్తారనుకున్న చంద్రముఖి 2ని అనుకున్నదానికంటే ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి, థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం