తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandra Mohan Death: హీరోగా, నటుడిగా 932 సినిమాలు.. చంద్రమోహన్ చివరి మూవీ ఇదే!

Chandra Mohan Death: హీరోగా, నటుడిగా 932 సినిమాలు.. చంద్రమోహన్ చివరి మూవీ ఇదే!

Sanjiv Kumar HT Telugu

11 November 2023, 12:23 IST

  • Chandra Mohan Last Movieమరో నట దిగ్గజం నింగికెగిసింది. ప్రముఖ తెలుగు సీనియర్ హీరో, నటుడు చంద్రమోహన్ ఇక లేరు. శనివారం గుండెపోటుతో చంద్రమోహన్ మరణించారు. హీరోగా, నటుడిగా 900 సినిమాలు చేసిన చంద్రమోహన్ ఆఖరి మూవీ ఏంటని తెలుగు ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు.

హీరోగా, నటుడిగా 932 సినిమాలు.. చంద్రమోహన్ చివరి మూవీ ఇదే!
హీరోగా, నటుడిగా 932 సినిమాలు.. చంద్రమోహన్ చివరి మూవీ ఇదే!

హీరోగా, నటుడిగా 932 సినిమాలు.. చంద్రమోహన్ చివరి మూవీ ఇదే!

Chandra Mohan Movies: తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. మరో నట దిగ్గజం చంద్రమోహన్ కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ సినీ పరిశ్రమలో దిగ్భ్రాంతికి లోనైంది. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, తెలుగు ప్రేక్షకులు ఆయన మృతిపట్ల నివాళులు అర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చంద్రమోహన్ యాక్టింగ్ కెరీర్, ఆయన చివరి సినిమా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

India Biggest Overseas Hit: చైనాలో 30 కోట్లకుపైగా టికెట్స్ అమ్ముడుపోయిన ఇండియన్ సినిమా ఇదే.. RRR కాదు!

Double Ismart Teaser: బూతులతో డబుల్ ఇస్మార్ట్ టీజర్.. రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ మ్యాజిక్ రిపీట్ అవుద్దా?

Rajinikanth: ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌తో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియ‌న్ మూవీ తీయోచ్చు - ద‌ళ‌ప‌తి విజ‌య్ రికార్డ్ బ్రేక్‌

Satya OTT: ఓటీటీలోకి నెలకాకముందే తమిళ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్.. అందులో ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న జన్మించిన చంద్రమోహన్ తెలుగు సినిమా రంగంలో వైవిధ్యమైన, విలక్షణమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. 1966 సంవత్సరంలో రంగుల రాట్నం మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన చంద్రమోహన్ ఐదు దశాబ్ధాలపాటు తన సినిమాలతో మెప్పించారు. హీరోగా, నటుడిగా, కమెడియన్‌గా, సపోర్టింగ్ పాత్రలో సుమారు వేయి చిత్రాల్లో నటించారు చంద్రమోహన్.

చంద్రమోహన్ హీరోగా 175కిపైగా సినిమాల్లో నటించారు. 55 ఏళ్ల చంద్రమోహన్ సినీ కెరీర్‌లో మొత్తం 932కి పైగా సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు. ఇక కొత్త హీరోయిన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను అప్పట్లో పేర్కొనేవారు. జయప్రద మొదటి సినిమా సిరిసిరిమువ్వలో, శ్రీదేవి తొలి చిత్రం పదహారేళ్ల వయసు సినిమాలో చంద్రమోహన్‌తో నటించి తర్వాత స్టార్ హీరోయిన్లుగా పాపులారిటీ తెచ్చుకున్నారు.

పదహారేళ్ల వయసు, సీతామాలక్ష్మీ, కలికాలం వంటి చిత్రాల్లో అప్పటి ప్రేక్షకులకు చంద్రమోహన్ ఎంత గుర్తున్నా కమెడియన్‌గా చిరస్థాయిగా ఆడియెన్స్ మనసుల్లో నిలిచిపోతారు. మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేను, ఆనందం, నువ్వే నువ్వే, కృష్ణ, లౌక్యం వంటి చిత్రాల్లో హీరోలకు తండ్రిగా చేస్తూనే కామెడీతో ఆకట్టుకున్నారు. అలాంటి చంద్రమోహన్ చివరిసారిగా నటించిన మూవీ ఆక్సీజన్.

గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో చంద్రమోహన్ కీలక పాత్ర పోషించారు. 2017లో వచ్చిన ఆక్సీజన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అందుకుంది. ఇదిలా ఉంటే చంద్రమోహన్ తెలుగు సినిమాలతోపాటు పలు తమిళ చిత్రాల్లో కూడా నటించడం విశేషం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం