తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bts Groove On Naatu Naatu: బీటీఎస్ మెచ్చిన నాటు నాటు.. పాటను ఎంజాయ్ చేసిన సింగర్ జంగ్‌కుక్

BTS Groove on Naatu Naatu: బీటీఎస్ మెచ్చిన నాటు నాటు.. పాటను ఎంజాయ్ చేసిన సింగర్ జంగ్‌కుక్

04 March 2023, 18:58 IST

google News
    • BTS Groove on Naatu Naatu: ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఈ సాంగ్‌ వరల్డ్ పాపులర్ బ్యాండ్ బీటీఎస్‌ను చేరింది. బీటీఎస్ సింగర్ జంగ్‌కుక్ ఈ సాంగ్ ఎంజాయ్ చేశారు.
నాటు నాటు పాటను ఎంజాయ్ చేసిన బీటీఎస్ సింగర్
నాటు నాటు పాటను ఎంజాయ్ చేసిన బీటీఎస్ సింగర్

నాటు నాటు పాటను ఎంజాయ్ చేసిన బీటీఎస్ సింగర్

BTS Groove on Naatu Naatu: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఖండాంతరాలు దాటిన విషయం తెలిసిందే. ఎంతలా అంటే ఈ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ గెలవాలని మనవాళ్ల కంటే కూడా వెస్టర్న్ ఆడియెన్స్ ఎక్కువగా కోరుకుంటున్నారంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు నాటు నాటు పాటపై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారు. హాలీవుడ్‌‌లోనే కాకుండా తాజాగా ఈ పాట దక్షిణ కొరియాకు కూడా పాకింది. ఆ దేశానికి వరల్డ్ పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ బీటీఎస్‌ను(BTS) మెప్పించింది ఈ సాంగ్. బీటీఎస్ సింగర్, లిరిసిస్ట్ జంగ్‌కక్(Jungkook) ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్వాదించారు.

ఇటీవల అభిమానులతో లైవ్ నిర్వహించిన జంగ్‌కుక్ నాటు నాటు పాటను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. సీటులోనే కూర్చొని ఆ సాంగ్‌ను సరదాగా హమ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా స్పందించింది.

జంగ్‌కుక్.. ఈ పాటను ఇంతలా నువ్వు ప్రేమిస్తావని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ బీటీఎస్ బృందానికి, దక్షిణా కొరియా ప్జలకు టన్నుల కొద్ది ప్రేమాభిమానాలను పంపిస్తున్నాం. అని ఆర్ఆర్ఆర్ టీమ్ పేర్కొంది.

బీటీఎస్ అంటే దక్షిణకొరియాకు చెందిన మ్యూజిక్ బ్యాండ్. కేవలం పదేళ్లలోనే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యాండ్. జంగ్ కుక్, ఆర్ఎం, వీ జిమిన్, జిన్, జే హోప్, సుగా ఇలా ఏడుగురు సభ్యులతో ఈ బ్యాండ్ కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్లలో ఈ బ్యాండ్‌కు అభిమానులున్నారు. వీరి నుంచి వచ్చిన ఫేక్ లవ్, బాయ్ విత్ లవ్, బటర్ సాంగ్స్ వరల్డ్ వైడ్ విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి.

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా నాటు నాటు పాట 95వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా నామినేటైంది. మార్చి 12న లాస్ ఏంజెల్స్ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం