Brahmamudi September 21st Episode: బ్రహ్మముడి సీరియల్.. చావుబతుకుల్లో కృష్ణమూర్తి.. ఆమెతో కల్యాణ్ రొమాన్స్
21 September 2023, 6:45 IST
Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. అప్పు తీరుద్దామనుకున్న కావ్యకు తండ్రి కృష్ణమూర్తి గాయాలతో చావు బతుకుల్లో ఉండటం షాక్ ఇస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 21వ తేది ఎపిసోడ్లో..
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 21వ ఎపిసోడ్.. చావుబతుకుల్లో కృష్ణమూర్తి
కావ్య దుగ్గిరాల ఇంటి నుంచి పుట్టింటికి వస్తుంది. విగ్రహాల కాంట్రాక్ట్ పూర్తి చేసేందుకు పనులన్నీ త్వరగా చేసేస్తుంటుంది. చివరికీ విగ్రహాలన్నీ రెడీ అవుతాయి. కానీ, విగ్రహాలు ఉన్న ప్లేసులోకి కొంతమంది రౌడీలు వస్తారు. విగ్రహాలు ఎత్తుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. దాన్ని అడ్డుకునేందుకు కృష్ణమూర్తి ప్రయత్నింస్తుంటాడు. అయ్యా.. అయ్యా.. మీ కాళ్లు పట్టుకుంటానయ్యా.. విగ్రహాలు తీసుకెళ్లకండి అయ్యా. మీకు దండం పెడతాను అయ్యా. తీసుకెళ్లకండకయ్యా అని ప్రాధేయపడతాడు కృష్ణమూర్తి.
గాయాలతో కృష్ణమూర్తి
కృష్ణమూర్తి ఎంత బతిమిలాడిన ఆ రౌడీలో విగ్రహాలన్నింటిని లారీల్లో ఎక్కిస్తారు. అడ్డుగా వచ్చిన కృష్ణమూర్తిన కర్రతో చితకబాదుతారు. దీంతో కింద పడిపోయిన కృష్ణమూర్తి తల పట్టుకుంటాడు. అయినా కూడా కృష్ణమూర్తి తలపై ఓ రౌడీ గట్టిగా కొడతాడు. దీంతో గాయాలతో, చావు బతుకుల్లో కృష్ణమూర్తి స్పృహ తప్పిపోతాడు. తర్వాత రౌడీలు విగ్రహాలన్నింటిని లారీల్లో తీసుకెళ్లిపోతారు. తర్వాత మరుసటి రోజు రాజ్ కారులో కావ్య, తల్లి కనకం వస్తారు.
గాయాలతో, రక్తంతో కిందపడి ఉన్న కృష్ణుమూర్తిని చూసి కావ్య, కనకం కంగారు పడతారు. నాన్నా అంటూ లేపుతారు కావ్య, అప్పు. స్పృహలోకి వచ్చిన కృష్ణమూర్తి.. మనం కష్టపడి చేసిన విగ్రహాలన్నింటిని ఎత్తుకెళ్లిపోయారు అని చాలా బాధగా ఏడుస్తూ చెబుతాడు. దీంతో కనకం కూడా ఏడుస్తుంది. నాన్నా అంటూ తండ్రి కృష్ణమూర్తిని కావ్య హత్తుకుని ఏడుస్తుంటుంది. ఇదంతా చూసి రాజ్ ఆలోచనలో పడిపోతాడు. ఇలా బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 21వ ఎపిసోడ్ ఆసక్తిగా సాగనుంది.
కొత్తగా ఏంటీ
ఇక బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 20వ ఎపిసోడ్లో పుట్టింటికి వెళ్తానని అత్త అపర్ణకు చెబుతుంది కావ్య. ఇంట్లో పనలు అన్నీ పూర్తి చేశావా అని ఒక్కొక్క పని గురించి అడుగుతుంది. దానికి అన్నీ చేసేశాని చెబుతుంది కావ్య. మా వదిన ఒక పిచ్చిమాలోకం అని రుద్రాణి అనుకుంటుంది. తాతయ్య మీ ఆశీర్వాదం కావాలి అని కావ్య అడుగుతుంది. రోజు చేసే పనే కదా. ఈరోజు కొత్తంగా ఏంటీ అని రుద్రాణి అంటుంది. నేను తీసుకున్న పెద్ద కాంట్రాక్ట్ ఈరోజు పని పూర్తి అవుతుంది. పెద్ద కాంట్రాక్ట్ నేను ఎప్పుడు తీసుకోలేదు. అందుకే అని కావ్య అంటుంది.
పెద్ద పెద్ద కాంట్రాక్ట్ ఎలా వస్తుంది. ఇప్పుడు దుగ్గిరాల కోడలివిగా. పెద్ద కాంట్రాక్ట్ అలాగే వస్తుంది అని రుద్రాణి అంటే.. అది తన టాలెంట్ వల్ల వచ్చింది అని రాజ్ అంటాడు. దీంతో రాజ్, అపర్ణకు మధ్య పుల్ల పెడుతుంది రుద్రాణి. అనంతరం ఎందుకింతా ఎగ్జయిట్ అవుతున్నావ్ అని కావ్యను ధాన్యలక్ష్మి అడిగితే.. దీంతో మా అప్పులన్నీ తీరతాయి అని చెబుతుంది. మరోవైపు అనామిక కోసం కల్యాణ్ కారులో వెళ్తుంటాడు. అప్పు కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. అనామిక కాల్ చేసి ఎంతసేపు అని అడుగుతుంది. పది నిమిషాల్లో ఉంటానని కళ్యాణ్ చెబుతాడు.
కల్యాణ్‌కు ప్రపోజ్
అనామికను కళ్యాణ్ కలుస్తాడు. ఏంటీ సర్ప్రైజ్ అని కల్యాణ్ అడిగితే.. వెడ్డింగ్ కార్డ్ తీసి చూపిస్తుంది. నా పెళ్లి. వెడ్డింగ్ కార్డ్ నిన్ననే సెలెక్ట్ చేశారు అని ఇస్తుంది. దీంతో పెళ్లా అని డిసప్పాయింట్ అవుతాడు కల్యాణ్. తర్వాత కార్డ్ చదవమని ఫోర్స్ చేస్తుంది అనామిక. లోపల గుణుక్కుంటూ.. అయిష్టంగా వెడ్డింగ్ కార్డ్ చదువుతాడు కల్యాణ్. అనామిక పెళ్లి దుగ్గిరాల కల్యాణ్ అని ఉండటంతో చాలా సంతోషిస్తాడు. అనామికను హగ్ చేసుకుని.. తెగ సంబరపడిపోతాడు.
మరోవైపు రాహుల్‌కు రుద్రాణి కాల్ చేసి కావ్య కాంట్రాక్ట్ పూర్తి కావొద్దు. ఆ విగ్రహాలన్ని మాయం అయిపోవాలి. దీంతో ఆ కావ్య కుటుంబం అప్పు కట్టలేక రోడ్డు మీదకు వస్తుంది. చాలా జాగ్రత్తగా చేయు అని రుద్రాణి అంటుంది. నిలబెట్టాలి అంటే కష్టం కానీ, పడగొట్టాలంటే ఎంత సేప్ మామ్ అని రాహుల్ అంటాడు. కృష్ణమూర్తి విగ్రహాలకు కలర్స్ వేస్తుంటే కావ్య వెళ్తుంది.
నీ భార్యను పట్టించుకో
ఇవాళ చాలా పని ఉందని, అన్నీ పూర్తయ్యాకే ఇంటికి వెళ్లాలని చెబుతుంది కావ్య. మరోవైపు ట్యాబ్లెట్స్ గురించి తాతయ్యకు కాల్ చేస్తాడు రాజ్. నాకు చేసినట్లే నీ భార్యను పట్టించుకోమ్మని చెబుతాడు సీతారామయ్య. దీంతో కావ్య ఇంటికి రాజ్ వెళ్తాడు. అది చూసి కావ్య సంతోషిస్తుంది.