Brahmamudi September 30th Episode: బ్రహ్మముడి సీరియల్.. కావ్యకు తెలియనున్న రాజ్ ప్రేమ నాటకం.. ధాన్యలక్ష్మికి డౌట్
30 September 2023, 7:45 IST
Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‍లో పంతులు కనకేశ్వరి గెటప్ వేసి తన కూతురిని కాపాడుకుంటుంది కనకం. ఇలా ఆసక్తిగా సాగుతున్న బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 30వ తేది ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే?
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 30వ తేది ఎపిసోడ్ హైలెట్స్
కనకం పంపిన లొకేషన్‌కు కారులో బయలుదేరుతుంటారు కావ్య, రాజ్. నాకు చాలా కంగారుగా ఉందని కావ్ అంటే.. నువ్వేం భయపడకు. మీ అక్కకు ఏం కాదు అని రాజ్ ధైర్యం చెబుతాడు. మరోవైపు ఆస్పత్రిలో రాహుల్‌ను డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెబుతాడు. ఇందాకే కళ్లు తిరిగిపోయాడు కదా. అప్పుడే డిశ్చార్జ్ అంటున్నారు అని రుద్రాణి అంటుంది. ఇందాక అంటే ఎమోషనల్ అయి అలా పడిపోయాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడు అని డాక్టర్ చెబుతాడు.
బెండకాయతో పెళ్లి
ఇంతలో నర్స్ వచ్చి సార్ రాహుల్ ఇంజక్షన్ తీసుకోవట్లేదు అని చెబుతుంది. దీంతో కంగారుగా రాహుల్ దగ్గరికి వెళ్తారు. నాకు ఇంజెక్షన్ వద్దు. నాకు ఎలాంటి మెడిసిన్ వద్దు. స్వప్న లేని జీవితం వద్దు అంటూ డ్రామా చేస్తాడు రాహుల్. చెబుతున్నాం కదా. నీకోసమే కదా ఇంజక్షన్ వేసుకోమ్మని చెబుతుంది అని సుభాష సీరియస్ అవుతాడు. మరోవైపు మైఖేల్‌కు బెండకాయతో పెళ్లి చేయాలని చెబుతుంది కనకం. ఎందుకు అంటే.. నీకు అమ్మాయికి చాలా వయసు తేడా ఉందని కనకం చెబుతుంది.
నీకు 37 ఏళ్లు అంటున్నావ్, ఆ అమ్మాయికి పాతిక కూడా నిండవు. సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావ్. కానీ, వయసు తేడాతో దోషం నీ నెత్తిన డ్యాన్స్ చేస్తుంది అని కనకం అంటుంది. అందుకే బెండకాయతో పెళ్లి చేయాలని, వెళ్లి బెండకాయ తీసుకురమ్మని చెబుతుంది. రౌడీలు వెళ్లి బెండకాయ తీసుకొస్తారు. బెండకాయకు తాళి కట్టమంటుంది. మైఖేల్ అలాగే చేస్తాడు. అంతా అక్షింతలు వేస్తాడు. ఇప్పుడు స్వప్నకు తాళి కట్టనా అని మైఖేల్ అంటాడు.
కీళ్ల నొప్పులు, వాతం
ఇంతలో అక్కడికి రాజ్, కావ్య వస్తారు. వాళ్లను చూసి కనకం, స్వప్న సంతోషిస్తారు. స్వప్నకు మైఖేల్ తాళి కట్టడానికి వెళ్తుంటే ఆపుతుంది కనకం. ఎవరు ఆపడానికి లేరని నవ్వే అరుస్తున్నావా ముసలి అని మైఖేల్ అంటే.. అటు చూడురా. నా అల్లుడు కూతురు వస్తున్నారు అని కనకం చెబుతుంది. దీంతో రాజ్, కావ్యను చూసి షాక్ అవుతాడు మైఖేల్. నిన్ను ఏం చేయాల్రా అని రాజ్ అంటాడు. ఏం వద్దు సార్. నాకు కీళ్ల నొప్పులు, వాతం లాఠీ దెబ్బలు పడవు అని మైఖేల్ అంటాడు.
మేము పట్టిస్తాంరా అని పోలీసులు ఎంట్రీ ఇస్తారు. దీంతో మరింత షాక్ అవుతాడు మైఖేల్. అసలు ఎలా దొరికాను అని మైఖేల్ అంటే.. కనకం గెటప్ తీసేసరికి పూల దండలు కొన్న విషయం గుర్తుకు వస్తుంది. స్వప్న నా కూతురు అని చెబుతుంది కనకం. వీడి వెనుక ఎవరో ఉన్నారు సార్ అని కావ్య అనుమానిస్తుంది. డౌట్ ఉంటే వాళ్లు ఊరుకుంటారా అని మైఖేల్ అంటాడు. మేము కనుక్కుంటాం మేడమ్ అని పోలీసులు మైఖేల్‌ను తీసుకెళ్తారు.
ధాన్యలక్ష్మికి డౌట్
ఇంట్లో స్వప్న పోవడంతో చాలా బాధగా ఉందని రాహుల్ డ్రామా చేస్తాడు. దానికి వంతపాడుతుంది రుద్రాణి. అదంతా నీ చాతకానీ తనం వల్లే, బాధ్యత లేదు అని ఇంట్లో వాళ్లందరు రాహుల్‌ను అంటారు. రాహుల్, రాజ్‌ను ఒకేలా చూస్తున్నారా అని రుద్రాణి అంటే.. రాజ్ నా మనవడు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తీసుకురాడు అని సీతారామయ్య అంటాడు. మళ్లీ రాహుల్ బాధపడినట్లు మాట్లాడితే.. ఇన్నాళ్లు స్వప్నపై కోపం చూపించాడు. ఇప్పుడేమో ప్రాణం పోతుందని అంటున్నాడు, ఏంటో అని ధాన్యలక్ష్మి అనుమానంగా అంటుంది.
అవును, అత్తయ్య.. దూరం అయినప్పుడే మనిషి విలువ తెలుస్తుంది అని రాహుల్ అంటాడు. నువ్ ఇలాగే ఉంటావని స్వప్న మాట తీసుకుంది అత్తయ్య. కానీ, ఇప్పుడు మాట తీసుకున్న మనిషే దూరం అయింది అని రాహుల్ అంటాడు. దూరం అవ్వలేదు అని స్వప్నతో ఎంట్రీ ఇస్తాడు రాజ్. దీంతో అంతా ఆనందిస్తుంటే.. రాహుల్, రుద్రాణికి షాక్ కొట్టినట్లు ఉంటుంది. రాహుల్‍ను గమనించిన రుద్రాణి.. ఇప్పటిదాకా ఏడ్చావ్.. ఇప్పుడు అలా కొయ్యబారిపోయావ్ అని ధాన్యలక్షి అంటుంది.
పోలీసులకు అప్పజెప్పాం
స్వప్న అంటూ రాహుల్ దగ్గరికి వెళ్తాడు. ఒకరి క్షేమం మరొకరు అడుగుతారు. అసలు ఏమైంది రాజ్. స్వప్ను ఎవరు, ఎందుకు తీసుకెళ్లారో తెలిసిందా అని సీతారామయ్య అడుగుతాడు. తెలిసింది తాతయ్య. ఇంతకుముందు కిడ్నాప్ చేసిన మైఖేలే పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్లాడు అని రాజ్ చెబుతాడు. దీంతో రాహుల్ ఆవేశంతో ఊగిపోతాడు. వాన్ని ఊరికే వదిలేయొద్దు. ఎక్కడున్నాడో చెప్పు రాజ్ అని రాహుల్ అంటాడు. అవసరం లేదు. వాడిని పోలీసులకు అప్పజెప్పాం అని కావ్య అంటుంది.
తర్వాతి ఎపిసోడ్‍లో వినాయక చవితి పండుగ సందర్భంగా గణేషుడిని ప్రతిష్టిస్తారు. మనసులో ఉన్న కోరికలను చీటిపై రాయండి. అది జరుగుతుంది అని ఇందిరా దేవి చెబుతుంది. తాతయ్య కోసం మూడు కావ్యతో ప్రేమగా ఉంటానని 3 నెలల టైమ్ అడిగాను. ఈ ఆటకు ముగింపు పలుకు అని రాజ్ రాస్తే.. ఆయన కోరుకున్నది నెరవేర్చుమని కావ్య రాస్తుంది. అయితే ఈ చీటీలు కనుక చూస్తే కావ్యకు భర్త రాజ్ గురించి నిజం తెలిసే అవకాశం ఉంది.