తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi November 10th Episode: బ్రహ్మముడి సీరియల్.. తండ్రితో ఆస్తి రాయించుకున్న రుద్రాణి.. వీలునామా చించేసిన రాజ్

Brahmamudi November 10th Episode: బ్రహ్మముడి సీరియల్.. తండ్రితో ఆస్తి రాయించుకున్న రుద్రాణి.. వీలునామా చించేసిన రాజ్

Sanjiv Kumar HT Telugu

10 November 2023, 9:58 IST

google News
  • Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 10వ తేది ఎపిసోడ్‌‌లో సీతారామయ్యను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. చనిపోయేలోపు తనవంతు ఆస్తులు రాయమని బ్లాంక్ స్టాంప్ పేపర్స్ ఇస్తుంది. ఇంకా బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 10వ తేది ఎపిసోడ్‌‌
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 10వ తేది ఎపిసోడ్‌‌

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 10వ తేది ఎపిసోడ్‌‌

Brahma Mudi Serial Today Episode: రుద్రాణి బ్లాంక్ స్టాంప్ పేపర్స్ పట్టుకుని సీతారామయ్య వద్దకు వెళ్తుంది. మీ ఆరోగ్యం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను. అన్నయ్యలకు దైవ భక్తి లేదు. కోడళ్లు బయటి నుంచి వచ్చిన వాళ్లు. నేను మీ కూతురునే కదా నాన్న. మీరు కనకపోయినా నేను మీ కూతురునే కదా అని రుద్రాణి అంటే.. కాదని ఎవరన్నారని సీతారామయ్య అంటాడు. అనడం కాదు. వాళ్ల చూపులు అలా ఉన్నాయి. నన్ను చీదరించుకుంటున్నారు అని రుద్రాణి చెబుతుంది.

ఆస్తి రాసి ఇవ్వండి

నన్ను మనిషిలా చూడట్లేదు. నా భర్తతో తెగదెంపులు చేసుకుని వచ్చినప్పుడు మీరు నాకు ఏం చెప్పారు. నాకు ఏ లోటు లేకుండా చూస్తాను అని అన్నారు కదా అని రుద్రాణి అంటుంది. నేను వాళ్లతో మాట్లాడతాను అని సీతారామయ్య అంటే.. మాట్లాడటం కాదు. నా వంతు ఆస్తి రాసి ఇస్తే అది నాకు ధైర్యంగా ఉంటుంది. నాకు నా కొడుకుకు దారి చూపించినట్లు అవుతుంది. అదేదో పేపర్స్ పై ఉంటే మరింత బలంగా ఉంటుంది అని రుద్రాణి చెబుతుంది.

ఆ ప్రాణాంతక వ్యాధి మీకు రాకుంటే నేను అడిగేవాన్ని కాదు. కానీ, ఒకవేళ మీకు జరగరానిది జరిగితే మా పరిస్థితి బాగుండదు. మీరున్నప్పుడు మాకు ఏదైనా చేయండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది రుద్రాణి. అలాగే ఎయిర్ పోర్ట్ వద్ద ఉన్న ఫామ్ హౌజ్, మామిడి తోట కూడా రాసి ఇస్తే బాగుంటుంది అని చెప్పి పేపర్స్ ఇచ్చేసి వెళ్తుంది రుద్రాణి. అదంతా ధాన్యలక్ష్మి చూసి షాక్ అవుతుంది. రాహుల్ దగ్గరికి వెళ్లి ఈ మంచితనం ఇంత దారుణంగా ఉందేంట్రా బాబు. నటించలేక చస్తున్నాం అని రుద్రాణి అంటుంది.

ఎంతమంది చస్తే అంత మంచిది

రాహుల్, రుద్రాణి కలిసి మందు కొడతారు. తోడేళ్ల వంటి మనం కుందేలు ముసుగు వేసుకుని బతకడం చాలా కష్టంగా ఉంది అని రుద్రాణి అంటుంది. మనకు వాటా రాసిచ్చేలా ఉన్నాడు అని రాహుల్ అడిగితే.. రాసివ్వకుండా ఎలా పోతాడు. యమ ధర్మరాజు ఎత్తుకుపోకుండా టోల్ గేట్ వేయను అని రుద్రాణి అంటే.. మనం మరి నికృష్టంగా మాట్లాడుతున్నాం మమ్మీ. ఇవన్నీ వింటే చస్తారు. ఎంతమంది చస్తే అంత లాభం మనకు, అంత వాటా వస్తుంది అని రాహుల్ అంటాడు.

మనం అనుకున్నట్లు వాటా వస్తే నా పెళ్లాన్ని వదిలించుకుని వరల్డ్ టూర్ వేయాలని ఉందని రాహుల్ అంటాడు. ఇద్దరు కలిసి మందు తాగుతారు. మరుసటి రోజు ఉదయం అంతా టిఫిన్ చేద్దామనుకుంటారు. ఇంతలో అక్కడికి లాయర్ వస్తాడు. సీతారామయ్య గారే రమ్మన్నారు. ఆయన గదికే రమ్మన్నారు. ఏది ఉన్న ఆయన్నే అడగండి అని లాయర్ సీతారామయ్య గదికి వెళ్తాడు. లాయర్ రాగానే.. ఇందిరాదేవిని తలుపు వేసి వెళ్లమని చెబుతాడు సీతారామయ్య. దీంతో ఇందిరాదేవికి కాస్తా అనుమానంగా చూస్తుంది.

వీలునామా కోసం లాయర్

హాల్లోకి ఇందిరాదేవి వెళ్లడంతో.. ఏమైందని అడుగుతారు. తెలియదు. అంతా అయోమయంగా ఉందని ఇందిరాదేవి అంటే.. ఆస్తులు పంచడానికేమో. అందరి మనసుల్లో అదే ఉంది. కానీ నేను బయటపడ్డాను అని రుద్రాణి అంటుంది. లాయర్‌కు సీతారామయ్య వీలునామా చెబుతాడు. దాంతో వీలునామా సిద్ధం చేసి తీసుకువస్తానని చెప్పి వెళ్లిపోతాడు లాయర్. తర్వాత ధాన్యలక్ష్మి తన భర్తతో మాట్లాడుతుంది. ఆస్తి పంపకాలు జరిగితే.. కల్యాణ్‌కు అన్యాయం జరగకుండా చూడండి అని ధాన్యలక్ష్మి అంటుంది.

నాకు మాట్లాడటం రాకా కాదు.. నేను అన్నయ్యను నమ్మాను. అన్నయ్య కూడా అలాగే చూసుకుంటూ వస్తున్నాడు. కల్యాణ్ కూడా రాజ్‌ను నమ్ముతున్నాడు. కల్యాణ్‌కు రాజ్ అన్యాయం చేయడు. కల్యాణ్‌కి కూడా మనకంటే రాజ్ అంటేనే ఇష్టం. నాన్నగారు వీలునామా ఎలా రాస్తే అదే ఫాలో అవుతాం. అదే కృతజ్ఞత అని చెబుతాడు. రుద్రాణి పేపర్స్ తీసుకొచ్చి వాటా అడిగిందని తెలిసిందని సీతారామయ్యతో అపర్ణ మాట్లాతుంది.

చీలికలు మొదలు

రుద్రాణి జాలి కథలు వినిపిస్తుంది. అది మీకు తెలుసు. ఇది మీ పూర్వీకుల ఆస్తి. దాన్ని మీ కొడుకులు రెట్టింపు చేస్తున్నారు. రుద్రాణికి ఆస్తి ఎంత ఇచ్చిన అపాత్ర దానమే అవుతుంది. రాహుల్ దాన్ని నిలబెట్టుకోలేడు. వాళ్లకు పోగొట్టుకోవడమే తప్పా నిలబెట్టుకోవడం తెలియదు. రాహుల్ ని రుద్రాణి అలా పెంచలేదు. వాటాలు మొదలైతే.. చీలికలు మొదలవుతాయి. తక్కువ, ఎక్కువ అని వాదనలు వినిపిస్తాయి. ఉమ్మడి ఆస్తిని అలాగే ఉంచనివ్వండి. కుటుంబం ఉమ్మడిగా ఉండేందుకు పెద్ద కోడలిగా నేను బాధ్యత తీసుకుంటాను. ఇక మీదే తుది నిర్ణయం అని చెప్పి వెళ్లిపోతుంది అపర్ణ.

కోడలి చెప్పింది న్యాయమే. మరి లాయర్ ఎందుకు వచ్చాడని ఇందిరాదేవి అంటే.. న్యాయ అన్యాయాలు నాకు తెలియవ చిట్టీ. రేపటివరకు ఆగు అని సీతారామయ్య అంటాడు. మరోవైపు డాక్టర్ కోసం రాజ్ ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. ఇంతలో కావ్య వచ్చి అవి వింటుంది. ఏంటీ సీక్రెట్‌గా వింటున్నావా అని రాజ్ అంటే వెటకారంగా సమాధానం ఇస్తుంది కావ్య. అన్నం తినమని కావ్య అంటే.. నువ్ చేసింది తినను రాజ్ అంటాడు.

వీలునామా చింపేసిన రాజ్

అన్నం మీదే అలుగుతారా అని కావ్య అంటే.. అవును, అది మాత్రం ఏం అనలేదు, చేయలేదు. నేను మాత్రం తినను అని రాజ్ చెబుతాడు. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో వీలునామా రాసుకొచ్చారా అని సీతారామయ్య అడిగితే లాయర్ చదువుతాడు. కానీ, అంతలో వచ్చిన రాజ్ ఆ వీలునామాను తీసుకుని ముక్కలు చేస్తాడు. దాంతో రుద్రాణి, రాహుల్ తెగ షాక్ అవుతారు. దయచేసి దీన్ని ఇంతటితో ఆపేయండి అని రాజ్ అంటాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం