తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 22nd Episode: బ్రహ్మముడి- రెండో భార్యతో రాజ్ పెళ్లికి ముహుర్తం- నిలదీసిన కావ్య- రుద్రాణి ముసల్ది అంటూ!

Brahmamudi April 22nd Episode: బ్రహ్మముడి- రెండో భార్యతో రాజ్ పెళ్లికి ముహుర్తం- నిలదీసిన కావ్య- రుద్రాణి ముసల్ది అంటూ!

Sanjiv Kumar HT Telugu

22 April 2024, 8:12 IST

  • Brahmamudi Serial April 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 22వ తేది ఎపిసోడ్‌లో కావ్యకు సమాధానం చెప్పకుండా సుభాష్ తప్పించుకుంటాడు. రుద్రాణి, రాహుల్‌ను ఏ తప్పు చేశారంటూ స్వప్న నిలదీస్తుంది. తల్లిని ముసల్దానివే అని రాహుల్ అంటాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 22వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 22వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 22వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో వడ్డీ వ్యాపారి వద్ద కోటి రూపాయలు తీసుకుని కోటి 25 లక్షలు రాసుకోమ్మని చెబుతాడు రాహుల్. స్వప్నకు రాసిచ్చిన ఆస్తి పేపర్స్ తాకట్టు పెడతాడు రాహుల్. మరోవైపు సుభాష్ అన్న మాటలు గుర్తు తెచ్చుకున్న కావ్య ఇన్నాళ్లు ఎందుకు నిజం చెప్పలేదు. ఎలాగైనా మావయ్యను అడిగి నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Payal Rajput Rakshana Release Date: పాయల్ రాజ్‌పుత్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ఇదే.. వచ్చే నెలలోనే..

Pushpa 2 Anasuya First Look: పుష్ప 2 నుంచి అనసూయ ఫస్ట్ లుక్.. దాక్షాయణి మళ్లీ వచ్చింది

Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది ఆ రోజే.. ఫియర్ సాంగ్ అంటూ భయపెడుతున్న మేకర్స్

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

ఎలా కాపాడాలని

సుభాష్ దగ్గరికి వెళ్తుంది కావ్య. ఆయన గురించి ఆలోచిస్తున్నారా. ఆయన తప్పించుకోవాలని అనుకుంటున్నారు. మీరు అనుకుంటే ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కాపాడగలరు. మీరు బాబును తీసుకెళ్లడం, ఆయన వచ్చి మీతో మాట్లాడటం అంతా నేను విన్నాను అని కావ్య చెబుతుంది. దాంతో సుభాష్ షాక్ అవుతాడు. ఆయన్ను ఎలా కాపాడాల అని నేను ఆలోచిస్తుంటే మీరు నిజం తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతుంది కావ్య.

ఇంకో దారి కనిపించక అని సుభాష్ అంటే.. నిజమేంటో నాకు చెప్పండి. నేను దారి చూపిస్తానని కావ్య అంటుంది. చెప్పలేనమ్మ. నిజం చెప్పేదే అయితే రాజే చెప్పేవాడు కదా అని సుభాష్ అంటాడు. దాంతో తన చేయి తీసుకుని తలపై పెట్టుకున్న కావ్య మీరు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని అంటుంది. దాంతో షాక్ అయిన సుభాష్.. నువ్ నిజం చెప్పమని ఒట్టు వేయించుకున్నావ్. రాజ్ కూడా చెప్పొద్దని మాట తీసుకున్నాడు. నేను ఏది చేయాలి అని సుభాష్ అంటాడు.

పెద్ద గొడవ చేసేది

అందరా వాన్ని అంటున్న ఏం చేయలేకపోతున్నాను. వాడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని సుభాష్ అంటాడు. ఆయన బయటకు వెళ్లాలనే ఆలోచిస్తారు తప్పా నిజం చెప్పాలనుకోరు అని కావ్య అంటుంది. ఈలోపు అపర్ణ మనసు మారాలని కోరుకుంటున్నాను. నిన్ను ఒకటి అడుగుతాను చెబుతావ. అందరూ రాజ్‌ను అంటున్నారు. నీ స్థానంలో మరో స్త్రీ ఉంటే పెద్ద గొడవ చేసేది. రాజ్ విషయంలో నువ్ ఏమనుకుంటున్నావ్ అని సుభాష్ అడుగుతాడు.

ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు మావయ్య. ఆయన తప్పు చేశానని చెబుతున్నా. నా మనసు మాత్రం నమ్మడం లేదు. ఆడదానిలో అమ్మ తనాన్ని చూస్తారు. సాయం అడిగిన వారిలో కష్టాన్ని చూస్తారు. అలాంటి మనిషి తప్పు చేస్తారా అని కావ్య చెబుతుంది. నీ నమ్మకం ఒమ్ము కాకుడదమ్మా అని సుభాష్ అంటే.. మీరు ఇలా చెప్పి నిజం దాచేస్తే నేను వదిలిపెట్టను మావయ్య. ఎలాగైనా నిజం తెలుసుకుంటాను అని కావ్య అంటుంది.

కోరికలో నిజాయతీ ఉంది

నువ్ నమ్మిందాన్నే నిజం అనుకోని ముందుకు వెళ్లు. నీ కోరికలో నిజాయితీ ఉంది. నువ్వే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి వెళ్లిపోతాడు సుభాష్. తర్వాత రాత్రి అపర్ణ మాటలు గుర్తు చేసుకుంటాడు రాజ్. అంతలో కావ్య వస్తుంది. ఏం ఆలోచిస్తున్నారు. ఇంట్లో ఉండాల వద్దా అని ఆలోచిస్తున్నారా. ఏ నిర్ణయం తీసుకున్నారు అని కావ్య అంటుంది. తెలీదు అని రాజ్ అంటాడు. నన్ను ఏం చేయమంటారు అని కావ్య అడుగుతుంది.

నువ్వేం అనుకుంటున్నావ్ అని రాజ్ అంటే తెలీదు అని కావ్య బదులిస్తుంది. రాజ్ అలాగే చూస్తే నిజమే నాకు తెలీదు. నాకు ఏం తోచట్లేదు. ఏం చేయాలి నేను ఇప్పుడు. మీరు బయటకు వెళ్లిపోతే.. భర్త లేని ఇంట్లో కోడలిగా ఉండాలా. మీకే స్థానం లేనప్పుడు నాకు ఏం స్థానం ఉంటుందని పుట్టింటికి వెళ్లాల. లేదా మీతో వచ్చేయాలా. ఊర్మిలలా నిద్రపోవాలా అని కావ్య అంటే.. నాకు తెలియదు అని రాజ్ అంటాడు. మీ అమ్మగారు మాట్లాడేటప్పుడు నేను గుర్తుకు రాలేదా అని కావ్య ప్రశ్నిస్తుంది.

నిజంగా తప్పు చేశారా

మీ అమ్మ గారు శిక్ష వేస్తారు. మీరు భరిస్తారు. మరి ఏ తప్పు చేయని నాకు ఎవరు శిక్ష వేస్తున్నారు. నన్ను ఏం చేయమంటారు అని కావ్య అంటే.. అది నువ్వే ఆలోచించుకో అని రాజ్ అంటాడు. ఏం చేసిన బూడిద అయ్యేది నా బతుకే. ఒక్కటి అడుగుతాను చెబుతారా అని కావ్య అంటుంది. నువ్ చాలా ప్రశ్నలకు సమాధానం అడుగుతున్నావ్. ఒక్కదానికి జవాబు లేదు అని రాజ్ అంటాడు. మీకు తెలిసిందే అడుగుతాను. మీరు నిజంగా తప్పు చేశారా. నా మనసాక్షికి తెలుసు మీరు ఏ తప్పు చేయలేదని. అందుకే నేను మీ వెంటే ఉన్నాను. అందరిలా దోషిలా చూడలేదు అని కావ్య అంటుంది.

ఎందుకు మీరు ఇంతపెద్ద నింద వేసుకున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోవాలన్న శాసనానికి ఎందుకు తలవంచారు. హక్కుల్ని, అర్హతల్ని, వారసత్వాన్ని వదులుకుని వెళ్లేందుకు ఎందుకు పూనుకున్నారు. తెలీదు అనేది జవాబు కాదు. ఎందుకు జవాబు చెప్పకుండా తప్పించుకుంటున్నారు అని కావ్య అంటుంది. ఎందుకంటే నేను మంచివాన్ని కాదు కాబట్టి. నిజంగానే తప్పు చేశాను కాబట్టి. బాబుని ఎదురుగా పెట్టుకుని నిర్దోషినని వాదించలేను కాబట్టి అని రాజ్ అంటాడు.

ఇంట్లోనుంచి గెంటేస్తాను

నీ మనసాక్షికి అందరని రహస్యం నా జీవితం కాబట్టి. బాబు కోసం నా సర్వస్వం వదులుకోడానికి సిద్ధపడ్డాను అని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు కోటి రూపాయలు చూస్తూ సంబరపడిపోతారు రాహుల్, రుద్రాణి. డబ్బు మనకు అప్పు స్వప్నకు అని రాహుల్ అంటాడు. ఇప్పుడు స్వప్న పూర్తిగా ఇరుక్కుపోయిందని రుద్రాణి అంటుండగా.. స్వప్న పైకి వస్తుంది. నన్ను పెట్టిన టార్చర్‌కు ఇంట్లో నుంచి గెంటేస్తాను అని రుద్రాణి అంటుండగా.. స్వప్న రూమ్‌లోకి వస్తుంది.

కానీ, వంగుకుంటూ స్వప్న వస్తుంది. అది చూసి సూట్ కేస్ మూసేసి దానిపై రుద్రాణి కూర్చుంటుంది. వాళ్లు నవ్వుతారు. అది చూసి వచ్చిన స్వప్న ఏ తప్పు చేశారని నిలదీస్తుంది. దాంతో షాక్ అయిన రాహుల్, రుద్రాణి తప్పేంటీ అని అంటారు. లేకుంటే నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని స్వప్న అంటుంది. నీ పెళ్లాం మాములు కంచు కాదు అని రుద్రాణి అంటుంది. దొంగలు ఎలా ఉన్న అనుమానం వస్తుందని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది అని స్వప్న అంటుంది.

45 ఏళ్ల మీ అమ్మ

జోక్ చేసింది అని చెప్పిన రాహుల్ ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. లిప్ స్టిక్ ఇందాక కింద పడిపోయినట్లుంది అని స్వప్న అంటుంది. హే.. ఇక్కడ లేదని ఇద్దరూ అంటారు. మీకెలా తెలుసు. వెతకండి అని స్వప్న అంటుంది. రూమంతా వెతికిన స్వప్న రుద్రాణిని పైకి లెవ్వమంటుంది. కానీ రుద్రాణి లేవదు. బలవంతంగా రుద్రాణి లేపుతుంటే రాహుల్ ఆపి లిప్ స్టిక్ వెతికిస్తాడు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను. 45 ఏళ్ల మీ అమ్మ వేసుకునే లిప్ స్టిక్ నాకు ఇస్తావేంటీ అని స్వప్న ఫైర్ అవుతుంది.

నీకు నేను ముసలిదానిలా కనిపిస్తున్నానా అని స్వప్న అంటే.. హేయ్.. నన్ను ముసలిదానివి అంటావా అని కోపంగా లేవబోతుంది రుద్రాణి. కానీ తల్లిని రాహుల్ ఆపి.. అవును నువ్వు ముసలిదానివే. ఆవేశపడకు. నువ్వు ముసలిదానివే అని రాహుల్ అంటాడు. అవును, నేను ముసలిదానినే. ఈ వయసులో నేను ఎలా లేస్తాను అని రుద్రాణి అంటే.. లిప్ స్టిక్ చూసిన స్వప్న దొరికింది అంటుంది. నా గుండే ఆగింది అని రుద్రాణి అంటుంది.

కడుపు తీపి చేదుగా

ఇదిగో నా లిప్ స్టిక్ దొరికింది అని స్వప్న వెళ్లిపోతుంది. దాంతో ఊపిరి పీల్చుకున్న తల్లీ కొడుకులు కొంచెం ఉంటే దొరికిపోయేవాళ్లం కదరా అని రుద్రాణి అంటుంది. దొరకలేదు కదా సంతోషించు అని రాహుల్ అంటాడు. మరుసటి రోజు ఉదయం హాల్లో ఉన్నందరికీ కావ్య కాఫీ ఇస్తుంది. రాజ్ కిందకు వస్తాడు. రాజ్‌ను చూసి కాఫీ తాగదు అపర్ణ. ఏమైందని సుభాష్ అడిగితే.. చేదు అయిందని అపర్ణ అంటుంది. కడుపు తీపిని కూడా చేదుగా మార్చుకుంది నువ్వు అని ఇందిరాదేవి అంటుంది.

ఇంతలో పంతులు ఇంటికి వస్తాడు. పంతులు గారు ఎందుకు వచ్చినట్లు అని ధాన్యలక్ష్మీ అంటే.. ఏమో.. బిడ్డ తల్లితో పెళ్లికి ముహుర్తం పెట్టమంటాడేమో అని రుద్రాణి అంటుంది. ఏదైనా విశేషమా అని ఇందిరాదేవి అడిగితే.. అవును, మీ చేతుల మీదుగా జరపాల్సిన కల్యాణం గురించి మాట్లాడటానికి వచ్చాను అని పంతులు అంటే.. అంతా షాక్ అవుతారు. కంగారుపడతారు. నేను చెప్పాను కదా అని రుద్రాణి అంటుంది.

సీతారాముల కల్యాణం

ప్రతి యేటా జరిగినట్లే ఈ ఏడు కూడా సీతారాముల కల్యాణం దుగ్గిరాల వారే జరిపించాలి కదా. దాని గురించే గుర్తు చేద్దామని వచ్చాను అని పంతులు అంటాడు. దాంతో అంతా ఊపిరి తీసుకుంటారు. ఈ ఏడాది మీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోయేసరికి కంగారు పడి ఇలా వచ్చాను అని పంతులు చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో సీతారాముల కల్యాణికి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వెళ్తుంది. వాళ్లను మీడియా ప్రశ్నలు వేస్తుంది. పోయినసారి లాగే ఈ ఏడాది కూడా మీ చేతులమీదుగానే కల్యాణం జరిపించబోతున్నారా అని జర్నలిస్ట్ అడుగుతుంది. ఈ సంవత్సరం కల్యాణం నా మనవడు రాజ్, మనవరాలు కావ్య చేతులమీదుగా జరిపిస్తున్నాం అని ఇందిరాదేవి అంటుంది. దాంతో అపర్ణతోపాటు రాజ్, కావ్య షాక్ అవుతారు. ఎవరు సార్ ఈ బాబు ఇంత క్యూట్‌గా ఉన్నాడు అని జర్నలిస్ట్ అడుగుతుంది. దానికి అంతా షాక్ అవుతారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం