తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi April 20th Episode: బ్రహ్మముడి- ఇంట్లోంచి రాజ్, కావ్య శాశ్వతంగా బయటకు.. 7 రోజులు గడువు.. రుద్రాణి శివ తాండవం

Brahmamudi April 20th Episode: బ్రహ్మముడి- ఇంట్లోంచి రాజ్, కావ్య శాశ్వతంగా బయటకు.. 7 రోజులు గడువు.. రుద్రాణి శివ తాండవం

Sanjiv Kumar HT Telugu

20 April 2024, 7:45 IST

  • Brahmamudi Serial April 20th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 20వ తేది ఎపిసోడ్‌లో రాజ్‌ను ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్లిపోమ్మని వారం రోజులు గడువు ఇస్తుంది అపర్ణ. రాజ్ వెళితే.. కావ్య కూడా వెంటే వెళ్లిపోతుందని రుద్రాణి శివుడి ముందు శివ తాండవం చేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 20వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 20వ తేది ఎపిసోడ్‌

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 20వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఆ బిడ్డకు మా కళ్లముందు ఎలాంటి అనర్థం జరగకముందే నేను ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ బిడ్డ కోసం అన్నీ వదులుకున్న నువ్వు.. సర్వస్వాన్ని దారపోసిన నువ్వు.. ఈ ఇంటిని, ఈ అమ్మని.. ఈ బంధాలను.. ఈ హక్కులను అన్నింటిని వదులుకుని శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్లిపోవాలి అని అపర్ణ బాధగా చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు.

ట్రెండింగ్ వార్తలు

Kalvan Review: కాల్వన్ రివ్యూ - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైన‌ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Jr NTR Donation: ఏపీలోని ఆలయానికి భారీ విరాళం ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్: వివరాలివే

Krishna mukunda murari serial: కృష్ణకి పట్టపగలే చుక్కలు చూపిస్తానన్న ముకుంద.. మీరా మీద డౌట్ పడిన తింగరి

Guppedantha Manasu Serial: యాక్టింగ్‌లో వ‌సుధార‌ను మించిన‌ శైలేంద్ర - మోస‌పోయిన రాజీవ్ - మ‌ను కోసం రిషి భార్య రిస్క్‌

మానవత్వం అంటారా?

అక్క నీకు మతి పోయిందా. మరి అంత పెద్ద శిక్ష వేస్తావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అది వాడే చేసుకున్నాడు అని అపర్ణ అంటుంది. దీన్నేమంటారు మానవత్వమా. కొడుకును దూరం చేసుకుంటావా అని సుభాష్ అంటే.. వాడు తల్లినే దూరం చేసుకుంటున్నాడు కదా అని అపర్ణ అంటుంది. పిచ్చి పట్టిందా అపర్ణ. వాడికి అన్ని దూరం చేసేస్తావా. కన్నతల్లివి కడుపులో దాచుకోవాలి కానీ, నువ్వే ఇలా గెంటేస్తావా అని ఇందిరాదేవి ఫైర్ అవుతుంది.

వాడు పసిబిడ్డ ప్రాణంతో చెలగాటం ఆడుతున్నాడు. వాడు బిడ్డ కన్నతల్లి దగ్గరికే వెళ్తాడో.. లేదా బిడ్డకోసం ఇంకా ఎలాంటి దుస్థితి తెచ్చుకుంటాడో తెచ్చుకోని అని అపర్ణ అంటుంది. ఆంటీ.. రాజ్ అసలు తప్పు చేయడు. రాహుల్ లాంటి వాడినే ఈ ఇల్లు భరిస్తోంది. అలాంటిది రాజ్‌కు ఇంత పెద్ద శిక్ష వేయడం ఏంటీ. కనీసం రాజ్‌కు ఆలోచించుకునేందుకు అయినా టైమ్ ఇవ్వండి. ఇప్పటికిప్పుడు వెళ్లిపోమ్మంటే ఎలా వెళ్తాడు అని స్వప్న అంటుంది.

రుద్రాణి శివ తాండవం

చిన్నదానివి అయినా కరెక్ట్‌గా మాట్లాడావ్. వారం రోజులు గడువు ఇస్తున్నాను. ఈలోపు నిజం బయటపెడితే సరి.. లేకుంటే ఇంట్లోంచి బయటకు వెళ్లాలి అని అపర్ణ ఆర్డర్ వేసి వెళ్లిపోతుంది. అంతా చూస్తుండిపోతారు. రాజ్ బిడ్డను ఎత్తుకుని పైకి వెళ్లిపోతాడు. రుద్రాణి మాత్రం సంతోషంగా లుక్ ఇస్తుంది. కట్ చేస్తే.. తన గదిలో శివుడి ఫొటో ముందు శివతాండవం చేస్తుంది రుద్రాణి. మైమరిచిపోయి శివుడికి నమస్కారం చేస్తూ ఊగిపోతుంది.

ఇంతలో వచ్చిన రాహుల్ ఫోన్‌లో శివుడి పాట ఆపేస్తాడు. ఏంటీ మామ్ పూజా కూడా చేయనిదానివి ఇలా చేస్తున్నావ్ అని రాహుల్ అంటాడు. రాక్షసులకు కూడా శివుడు వరాలు ఇస్తాడంటే నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతున్నాను. నువ్ ఎండీ కాబోతున్నావ్. మా వదిన ఇచ్చిన ట్విస్ట్‌కు రాజ్ ఇంట్లోనుంచే వెళ్లిపోతున్నాడు. తర్వాత కావ్య కూడా భర్త వెంటే వెళ్లిపోతుంది. ఇక కల్యాణ్ అంటావా మూల స్థంభమే పోయింది. పిల్ల స్థంభం ఏం చేస్తుంది అని రుద్రాణి అంటుంది.

రాజ్ కావ్య బయటకు వెళ్లిపోతారు

అప్పుడు ఎండీ పదవి నాదే. వాళ్లతోపాటు స్వప్నను కూడా వదిలించుకుంటాను అని రాహుల్ అంటాడు. సంతకం చేయించుకున్న పేపర్స్ ఏం చేశావురా అని రాహుల్ అంటాడు. దాచిపెట్టాను. వడ్డీ వ్యాపారి ఊళ్లో లేడు వచ్చాకా అప్పు తీసుకొస్తాను. ఆ స్వప్నే డబ్బు తీసుకున్నట్లు అతనికి నేను ట్రైనింగ్ ఇస్తాను అని రాహుల్ అంటాడు. రాజ్, కావ్యలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతారు. స్వప్నను డబ్బు తెచ్చుకుందని ఇంట్లోంచి గెంటేస్తాం. కల్యాణ్‌ను తొక్కి మన కంట్రోల్‌లో పెట్టుకుంటాం. అప్పుడు ఈ రుద్రాణి అంటే ఏంటో చూపిస్తాను అని రుద్రాణి అంటుంది.

ఇంటి బయట అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇందిరాదేవి కావ్య వస్తారు. అసలు ఏం చేస్తున్నావ్ అపర్ణ. రాజ్ అంటే మాకు ప్రేమ ఉంది. నీకు ప్రాణం అలాంటిది ఇలా ఎందుకు చేశావ్. వాడు లేకుండా నువ్ ఉండగలవా అని నిలదీస్తుంది ఇందిరాదేవి. అది వాడు ఆలోచించాలి అని అపర్ణ అంటుంది. దానికి నువ్ శిక్ష వేసుకుంటావా అని ఇందిరాదేవి అంటుంది. దానికి నిజం చెబితే అయిపోతుంది కదా అని అపర్ణ అంటుంది.

కారణం నువ్వే

నిజం చెప్పేదుంటే ఎప్పుడో చెప్పేవారే కదా అని కావ్య అంటే.. అసలు దీనంతటికి కారణం నువ్వే.. వాడికి అప్పుడే సపోర్ట్ చేయకుంటే వాడు ఎప్పుడో నిజం చెప్పేవాడు అని అపర్ణ ఫైర్ అవుతుంది. ఇలా బహిష్కరిస్తే.. హక్కులు లాగేసుకుంటే చెప్పరు అని కావ్య అంటుంది. మరి ఏం చేస్తే చెబుతాడో చెప్పు అని గట్టిగా నిలదీస్తుంది అపర్ణ. మీరు ఎంత బాధపడుతున్నారో అర్థం అవుతోంది. ఆయన ఏ పరిస్థితుల్లో తప్పు చేశారో నాకు తెలియదు. కానీ మీరు హక్కులు వదిలేసుకోమ్మంటే క్షణం ఆలోచించలేదు అని కావ్య అంటుంది.

ఇది పరువు కోసం కాదు. తల్లి అస్థిత్వం కోసం. నిజమే అత్తయ్య మీరు అన్నది. వాడంటే నాకు ప్రాణమే. వాడు ఇంట్లోంచి వెళ్లిపోయిన రోజు తల్లిగా నేను చచ్చిపోతాను. తల్లిగా నాకు ఆరు రోజులు మాత్రమే ఆయువు ఉంది అని అపర్ణ వెళ్లిపోతుంది. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు ఊయలలో బిడ్డ కనపడకపోయేసరికి రాజ్ కంగారుపడిపోతాడు. కళావతి తీసుకుందా అని అనుకుంటాడు.

అంతా చూసిన కావ్య

కానీ, ఎవరికీ తెలియకుండా బాబును తీసుకెళ్తాడు సుభాష్. అది పై నుంచి రాజ్ చూస్తే.. గేట్ దగ్గర నుంచి కావ్య చూస్తుంది. రాజ్ షాక్ అవుతాడు. ఏంటీ మామయ్య గారు ఎవరికీ చెప్పకుండా బాబును ఎక్కడికీ తీసుకెళ్తున్నారు అని కావ్య అనుకుంటుంది. రాజ్ వెంటనే సుభాష్‌ను మరో కారులో ఫాలో అవుతాడు. అది కావ్య చూస్తుంది. ఏదో జరుగుతుంది. అది ఇప్పుడే తెలుసుకోవాలి అని కావ్య కూడా మరో కారులో బయలుదేరుతుంది.

సుభాష్ కారుకు రాజ్ తన కారు అడ్డుపెట్టి ఆపుతాడు. ఇద్దరు కారు దిగుతారు. అప్పుడే కావ్య వచ్చి పక్కకు వెళ్లి దాక్కుంటుంది. బాబును ఎక్కడికీ తీసుకెళ్తున్నారు డాడీ అని రాజ్ అడుగుతాడు. నీకు దూరంగా ఇంటికి దూరంగా మన వంశానికి దూరంగా. నీకు న్యాయం చేయడానికి. నేను స్వార్థపరుడినిరా. నువ్ తప్పు చేసినా ఒప్పు చేసినా నాతోపాటు ఇంట్లోనే ఉండాలి. నిన్ను దూరం చేసుకోలేను. నాకు నువ్వే ముఖ్యం అంటాడు సుభాష్.

బయటకు వెళ్లాలని

నాకు మాత్రం బాబే ముఖ్యం అని రాజ్ అంటాడు. వాడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలిపెట్టి రా. కావాలంటే వాడికి ఎంత ఆస్తి అయినా రాసిస్తా.. కావాలంటే అనాథాశ్రమంలో అని సుభాష్ అంటే.. డాడ్.. వాడి కోసం ఎంతో కోల్పోడానికి సిద్ధపడ్డాను అని రాజ్ అంటాడు. నువ్ నిజం బయటపెట్టే సమయం వచ్చింది అని సుభాష్ అంటే.. అలాంటి పరిస్థితి వచ్చిందికాబట్టే నేను ఇంట్లోంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను అని రాజ్ అంటాడు.

నువ్ బయటకు వెళ్లే పరిస్థితే వస్తే.. నేనే ఆ నిజం బయట పెడతాను అని సుభాష్ అంటాడు. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు. అంటే మావయ్యకు ఆ బిడ్డ తల్లి ఎవరో తెలుసా. నిజం తెలుసా అని అనుకుంటుంది. నా కొడుకును పదమంది దోషిలా చూస్తుంటే.. ఆ నిజం ఎంత భయంకరమైనది అయినా సరే నేను నిజం బయటపెట్టక తప్పదు అని సుభాష్ అంటాడు. ఇంతకంటే నాకు ఇంకేం ఆస్తి కావాలి డాడ్. కానీ, మీకోసం కూడా నిజం బయటపెట్టను డాడ్ అని రాజ్ అంటాడు.

కోటి రూపాయలు ఇవ్వండి

మీరు కూడా నిజం చెప్పనని మాటిచ్చారు. మీరు మాట ఇస్తే తప్పరని తెలుసు అని రాజ్ అంటాడు. ఎందుకురా నా నోరు కట్టేస్తారు అని సుభాష్ అంటాడు. నేను ఆ బాబును వదులుకోను డాడ్ అని బిడ్డను తీసుకోను తన కారులో పెట్టుకుని వెళ్లిపోతాడు రాజ్. ఆ నిజమేంటనేది మామయ్య గారిని అడిగి తెలుసుకోవాలని కావ్య అనుకుంటాడు. మరోవైపు వడ్డీ వ్యాపారిని కలుస్తాడు రాహుల్. ఇది నా భార్య సంతకం పెట్టింది కోటి రూపాయలు ఇవ్వండి అని రాహుల్ అంటాడు.

కానీ, ఇంట్లో వాళ్లు చాలా పలుకుబడి ఉన్నోళ్లు. నాకు సమస్య వస్తుంది అని వడ్డీ వ్యాపారి అంటాడు. మీరు మోసం చేశారంటే సమస్య. కానీ స్వప్న చేసిందంటే కాదు. కోటి రూపాయలు ఇవ్వండి. బాండ్‌పై కోటి 25 లక్షలు రాయండి. నేను చెప్పినప్పుడు వచ్చి ఇంట్లో గొడవ చేయండి. నాలుగు రోజుల్లో 25 లక్షలు వస్తాయి. లేకుంటే ఆస్తి నీ సొంతం అవుతుంది అని రాహుల్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం