Brahmamudi January 16th Episode:కావ్యను తప్పు పట్టిన అనామిక -వదినకు కళ్యాణ్ సపోర్ట్ -రుద్రాణిపై స్వప్న డామినేషన్
16 January 2024, 8:29 IST
Brahmamudi January 16th Episode: ధాన్యలక్ష్మి మాటలతో కావ్య బాధపడుతుంది. కళ్యాణ్, అనామికల శోభనం గదిని డెకరేట్ చేసే పనులకు దూరంగా ఉంటుంది. ఆ తర్వాత నేటి బ్రహ్మముడి సీరియల్‌లో ఏం జరిగిందంటే?
బ్రహ్మముడి సీరియల్
Brahmamudi January 16th Episode: స్వప్న డామినేషన్‌ను తట్టుకోలేకపోతారు రుద్రాణి, రాహుల్. ఇద్దరిని ముప్పుతిప్పలు పెడుతుంది. నాకు పాయసం కావాలి అంటూ రుద్రాణికి ఆర్డర్ వేస్తుంది స్వప్న. తనకు ఓపిక లేదని రుద్రాణి చెప్పిన స్వప్న వినదు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు ఫోన్ చేస్తానని బెదిరిస్తుంది.
స్వప్న మాటలతో భయపడి పాయసం తీసుకురావడానికి వెళుతుంది రుద్రాణి. స్వప్న నోటిదురుసుకు భయపడి ఆమె చెప్పినట్లు చేయమని తల్లికి సలహా ఇస్తాడు రాహుల్. వారిద్దరు సీక్రెట్‌గా మాట్లాడుకోవడం చూసి వార్నింగ్ ఇస్తుంది స్వప్న. ఆమె మాట వినగానే రాహుల్ భయంతో పారిపోతాడు.
కావ్య కన్నీళ్లు...
కళ్యాణ్, అనామిక శోభనం గదిని డెకరేట్ చేస్తానని చెప్పిన కావ్య ఆ రూమ్‌లో కనిపించకపోవడంతో రాజ్ ఆమె కోసం ఇళ్లంతా వెతుకుంటాడు. ధాన్యలక్ష్మి మాటలను గుర్తుచేసుకుంటూ బాల్కానీలో కన్నీళ్లు పెట్టుకుంటూ కావ్య కనిపిస్తుంది. శోభనం గదిని ఎందుకు డేకరేట్ చేయడం లేదని, ఏమైందని కావ్యను అడుగుతాడు రాజ్. ఇంట్లో ఏ పనైనా నువ్వు లేకుండా జరగదు కదా అని కావ్యతో అంటాడు రాజ్. నా చేయి అందరికి కలిసి రాదని కావ్య బదులిస్తుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన అనామిక. నాకు, కళ్యాణ్‌కు సంబంధించిన పని కదా...చేయడం ఇష్టం లేనట్లుగా ఉందని కావ్యతో అంటుంది. అలాంటిది ఏం లేదు. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని రాజ్ వారిస్తున్నా వినకుండా కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నేను ఏం పాపం చేశాను. కావ్యకు నా మీద ఎప్పుడు కోపం తగ్గుతుందో ఏమిటో అని రాజ్‌ను అడుగుతుంది అనామిక. భార్య మాటలను కళ్యాణ్ వింటాడు.
కళ్యాణ్‌పై కోపం...
కిచెన్‌లో ఉన్న కావ్య దగ్గరకు కళ్యాణ్ వస్తాడు. అతడితో మాట్లాడటం ఇష్టం లేక నాకు చాలా పనుందని అంటుంది కావ్య. కూరగాయలు కట్ చేస్తూ చాలా బిజీగా ఉన్నట్లు నటిస్తుంది. కావ్య కన్నీళ్లకు కారణమేమిటని అడుగుతాడు కళ్యాణ్. నేను చూడకపోయినా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేనంతా అమాయకుడిని కాదని అంటాడు. ఎవరో ఏదో అన్నారని ఆ కోపం నా మీద చూపిస్తారా అని కావ్యను అడుగుతాడు కళ్యాణ్.
మీ ఆనందం కోసమే...
నా వల్లే మీకు మంచి జరగడం లేదంటే నేను మీకు దూరంగా ఉండటమే మేలని కళ్యాణ్‌తో అంటుంది కావ్య. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అంటుంది. నేను ఆనందంగా ఉండాలంటే మీరు ముందులా ఉండాలి, నా ప్రతి విషయంలో మీ జోక్యం ఉండాలని కావ్యతో అంటాడు కళ్యాణ్. మూడనమ్మకాలు, కట్టుబాట్లు ఓ ఆడపిల్ల కన్నీటికి కారణం అయితే ఆ ఇళ్లు పతనం అయినట్లేనని అంటాడు. ఈ రోజు మిమ్మల్ని తప్పుపట్టిన వాళ్లే రేపు తప్పయిందని అనుకునేలా చేయమని కావ్యతో చెబుతాడు కళ్యాణ్.
మాటిచ్చిన కావ్య...
ఈ ఇంటికి వచ్చిన రోజు మొదట పలకరించి ధైర్యం చెప్పిన మనిషి మీరు...కష్టం వచ్చిన ప్రతిసారి నేనున్నానని గుర్తుచేస్తున్నారని కళ్యాణ్ మాటలతో కావ్య ఎమోషనల్ అవుతుంది. మీరు నాకు అలాగే అండగా ఉండాలని కావ్యను రిక్వెస్ట్ చేస్తాడు కళ్యాణ్. సరే అని కావ్య మాటిస్తుంది. ఎవరు ఎన్ని అన్నా నేను మీవైపే ఉంటానని అంటుంది.
రాజ్‌పై సెటైర్స్...
రాజ్ తన రూమ్‌లో ఆఫీస్ వర్క్ చేస్తూ బిజీగా ఉంటాడు. అతడి దగ్గరకు వచ్చిన కావ్య శోభనానికి రమ్మని పిలుస్తుంది. ఆమె మాటలతో కళ్యాణ్ షాకవుతాడు. ఏం మాట్లాడుతున్నావని కావ్యతో అంటాడు. పెళ్లై చాలా రోజులైనా ఒక అచ్చట ముచ్చట లేదంటూ రాజ్‌పై సెటైర్స్ వేస్తుంది కావ్య.
మన్మథుడు పూలబాణాలు పట్టుకొని తిరుగుతోన్న మీరు ఉక్కు కవచాలు తొడుక్కొని తిరుగుతున్నారంటూ ఆటపట్టిస్తుంది. చివరకు అతడిని మాటలతో తికమకపెట్టి శోభనం గదిని డెకరేట్ చేయడానికి తీసుకొస్తుంది. ఇద్దరు కలిసి గదిని డెకరేట్ చేస్తారు. ఇందాక గదిని డేకరేట్ చేయనని అన్న నీవు ఎప్పుడు ఎందుకు వచ్చావని అంటుంది. రాజ్ ప్రశ్నకు తిక్కతిక్కగా సమాధానం చెబుతుంది కావ్య. ఇద్దరు కలిసి రూమ్‌ను అందంగా డెకరేట్ చేస్తారు.
రుద్రాణి భయం...
స్వప్నకు దొరక్కుండా చాప తీసుకొని హాల్‌లో పడుకోవడానికి సిద్ధమవుతుంది రుద్రాణి. అయినా ఫోన్ చేసి అత్తకు క్లాస్ ఇస్తుంది స్వప్న. తనకు వెజిటేబుల్ సలాడ్ కావాలని డిమాండ్ చేస్తుంది. రాహుల్‌ను చెడామడా వాయిస్తుంది. ఆమె మాటలకు భయపడిన రాహుల్ రూమ్‌లోకి రావడానికి భయపడిపారిపోతాడు.
కళ్యాణ్‌కు షాక్...
శోభనం గదిలో అడుగుపెట్టిన కళ్యాణ్‌కు తన మాటలతో షాకిస్తుంది అనామిక. పాల వాసన తనకు పడదని, సగ సగం తానే కాన్సెప్ట్‌పై తనకు నమ్మకం లేదని అంటుంది. కళ్యాణ్ కవితాత్మకంగా శోభనం గది అలంకరణ గురించి మాట్లాడుతాడు. ఇప్పుడు ఈ కవిత్వం అవసరమా అంటూ కళ్యాణ్ మాటలను అడ్డుకుంటుంది. నా కవిత్వం నచ్చే కదా నన్ను ఇష్టపడ్డావని అనామికను అడుగుతాడు కళ్యాణ్. ఇప్పుడు కవితం టాపిక్ అవసరమా అంటూ మాట దాటేస్తుంది కావ్య.