Brahmamudi: రాజ్‌లో కావ్యపై డౌట్స్ పెంచిన శ్వేత.. రాజీవ్ పనికి శైలేంద్ర షాక్.. ఆదర్శ్ చనిపోతాడని భయపడిన మురారి
03 March 2024, 7:06 IST
Brahmamudi Serial Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ పాపులర్ తెలుగు సీరియల్స్ గుప్పెడంత మనసు, బ్రహ్మముడి, కృష్ణ ముకుంద మురారి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ మార్చి 4వ తేది ఎపిసోడ్స్‌లలో ఏం జరిగిందని ప్రోమోల్లో చూస్తే..
రాజ్‌లో కావ్యపై డౌట్స్ పెంచిన శ్వేత.. రాజీవ్ పనికి శైలేంద్ర షాక్.. ఆదర్శ్ చనిపోతాడని భయపడిన మురారి
Brahmamudi Serial Promo: బ్రహ్మముడి సీరియల్ మార్చి 4వ తేది ఎపిసోడ్ ప్రోమోలో కావ్య పుట్టింటికి రాజ్, భాస్కర్ (కావ్య బావ) ముగ్గురు కలిసి వెళ్తారు. అక్కడ రాజ్‌ను కాదని కావ్య, భాస్కర్‌కు హారతి ఇస్తుంది కనకం. దాంతో అలా ఎలా ఇస్తారు అని ఫైర్ అవుతాడు రాజ్. దాంతో ముందు కావ్య రాజ్‌కు హారతి ఇస్తుంది కనకం. తర్వాత భాస్కర్‌కు హారతి ఇవ్వబోతుంటే దాన్ని ఆర్పేస్తాడు రాజ్. అది చూసి కనకం, భాస్కర్ నవ్వుకుంటారు. తర్వాత భాస్కర్ లగేజ్‌ను రాజ్ తీసుకొస్తుంటే అదేంటీ మీరు తీసుకొస్తున్నారు అని కనకం అంటుంది.
అనుమానించిన శ్వేత
ఇక కావ్య, భాస్కర్‌పై శ్వేత అనుమాన పడుతుంది. ఇంతకాలం లేని బావ ఇప్పుడెందుకు వచ్చాడన్నట్లుగా అనుమానిస్తుంది. రాజ్‌కు కాల్ చేసిన శ్వేత ఫోన్‌లో మాట్లాడుతుంది. అసలు ఇన్ని రోజుల తర్వాత కావ్య బావ ఇక్కడికి ఎందుకు వచ్చాడు. పని మీద వచ్చాడా లేకా కావ్య పిలిస్తే వచ్చాడా. గతంలో కావ్యను ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడని చెప్పావ్. మరి ఇప్పుడు కోల్పోయిన తన ప్రేమను దక్కించుకోవడానికి వచ్చాడా అని రాజ్‌కు అనుమానం పెరిగేలా ఫోన్‌లో అడుగుతుంది శ్వేత.
కావ్య నిన్ను వదిలి వెళ్లకూడదు అనుకుంటే తెలుసుకో అని రాజ్‌కు శ్వేత సలహా ఇస్తుంది. దాంతో ఆలోచనలో పడిపోతాడు రాజ్. అలా ఆలోచిస్తూ కాల్ కట్ చేసి బయటకు వస్తాడు. అప్పుడే అక్కడ కావ్య, తన బావ భాస్కర్ సరదాగా, ముచ్చట్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ కనిపిస్తారు. అది చూసి కోపంతో రగిలిపోతాడు రాజ్. తర్వాత మరి ఇండియాకు రావడంపై భాస్కర్‌ను రాజ్ నిలదీస్తాడా. కావ్య, ఇందిరాదేవి వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా అనేది ముందు ముందు చూడాలి.
సంతోషించిన ఏంజెల్
Guppedantha Manasu Serial Promo: గుప్పెడంత మనసు సీరియల్‌లో మను మంచితనాన్ని అర్థం చేసుకున్న వసుధార అతనికి క్షమాపణలు చెబుతుంది. కాలేజీతోపాటు వసుధారకు తోడుగా ఉంటానని మనును కోరుతాడు మహేంద్ర. దానికి మను అంగీకరిస్తాడు. మరోవైపు కాలేజీకి ఏంజెల్ వస్తుంది. రిషి చనిపోలేదని తనకు అనిపిస్తుందని చెబుతుంది. అనంతరం వసుధారకు మను హెల్ప్ చేస్తున్నాడని తెలిసి సంతోషిస్తుంది.
అనుపమను ఏంజెల్ అత్తయ్య్ అని పిలవడంతో వీళ్ల రిలేషన్ ఏంటని ఆలోచిస్తుంటాడు మను. తర్వాత రిషి, వసుధార లవ్ స్టోరీ గురించి మనుకు ఏంజెల్ చెబుతుంది. వాళ్లు సరదాగా మాట్లాడుకుంటుంటే అనుపమ చూసి షాక్ అవుతుంది. వీళ్లు ఏంటీ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని అనుపమ కంగారు పడుతుంది. ఏంజెల్ తన తాతయ్య పేరు చెప్పబోతుంటే అనుపమ పిలుస్తుంది. అప్పటివరకు అనుపమను చూసిన వసుధార ఎందుకు వాళ్లు మాట్లాడుకోవడం చూసి టెన్షన్ అవుతున్నారు అని అనుమాన పడుతుంది.
భార్యను చంపేశాను
మరోవైపు మను తన ఇద్దరికీ అడ్డంగా, శనిలా దాపరించాడు అని మాట్లాడుకుంటారు శైలేంద్ర, రాజీవ్. వసుధార కోసం తన భార్యనే చంపేశానని రాజీవ్ చెబితే శైలేంద్ర షాక్ అవుతాడు. తర్వాత ఇద్దరూ చేసిన ఒక్కో దారుణం గురించి చెప్పుకుంటారు. అనంతరం వసుధార కారు రిపేర్‌కు వస్తే.. మను వచ్చి రిపేర్ చేస్తానని చెబుతాడు.
Krishna Mukunda Murari Promo: కృష్ణ ముకుంద మురారి మార్చి 4వ తేది ఎపిసోడ్ ప్రోమోలో గుడిలో ముకుందకు పెద్ద షాక్ ఇస్తుంది కృష్ణ. దాంతో మధు, ఆదర్శ్ సంతోషంగా చూస్తారు. కానీ ముకుంద మాత్రం ఏదో ఆలోచిస్తూ భయపడిపోతుంది. కృష్ణ కూడా తెగ సంతోషపడుతుంది. అనంతరం రెస్టారెంట్‌లోకి వెళతారు కృష్ణ, మురారి. అక్కడ వెయిటర్‌కు పెళ్లి శోభనం అయినట్లు చెప్పినట్లు ఉన్నాడు. దాంతో వావ్ మొన్న పెళ్లి.. నిన్న శోభనం.. ఇక కొందరికి అయితే పెళ్లి అయి రెండేళ్లు అయిన ఆ ఊసే ఉండదు అని మురారి అంటాడు.
షాక్ అయిన కృష్ణ
నిన్న రాత్రి శోభనం గదిలో నుంచి నా భార్య వెళ్లిపోయింది అని అక్కడున్న వెయిటర్ చెబుతాడు. దాంతో ఎందుకు అని కృష్ణ అడుగుతుంది. నేను అంటే తనకు ఇష్టం లేదట. నేను అసలు నచ్చనేలేదంట. మొహం మీద చెప్పేసి వెళ్లిపోయింది అని వెయిటర్ చెబుతాడు. దాంతో నోరు పెద్దగా తెరిచి షాక్ అవుతుంది కృష్ణ. ఏం చేస్తాం లే అన్నట్లుగా తల ఆడిస్తాడు మురారి. తర్వాత ముకుంద కూడా శోభనం గదిలో ఆదర్శ్‌కి ఇలాగే చెప్పేస్తే అని మురారి అంటాడు.
తట్టుకోలేడు ఏసీపీ సార్ అని షాకింగ్‌గా కృష్ణ అంటుంది. వీడికి చెల్లి ఉంది. తనను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇంత బాధను తట్టుకుని ప్రాణాలతో ఉన్నాడు. కానీ, ఆదర్శ్‌కి అని మురారి చెప్పబోతుంటే.. ఆ ఏసీపీ సార్.. అని మధ్యలోనే ఆపేస్తుంది కృష్ణ. ఆదర్శ్‌కి ఏం కాదు. కాకుండా ఏదో ఒకటి చేయాలి అని కృష్ణ అంటుంది. శోభనం గదిలో ఆదర్శ్‌కు ముకుందకు తను ఇష్టం లేడని చెబితే ఎలా రియాక్ట్ అవుతాడు.. మురారి ఆలోచించినట్లు ప్రాణాలు తీసుకుంటాడా.. లేదా అలా జరగకుండా ఉండేందుకు కృష్ణ ఏమైనా ప్లాన్ చేస్తుందా అనేది పూర్తి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.
టాపిక్