Boys Hostel OTT: మరో ఓటీటీలోకి స్టూడెంట్స్ కామెడీ మూవీ బాయ్స్ హాస్టల్: స్ట్రీమింగ్ వివరాలివే
01 January 2024, 16:53 IST
- Boys Hostel OTT: బాయ్స్ హాస్టల్ సినిమా మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనూ అడుగుపెట్టేందుకు రెడీ అయింది. స్ట్రీమింగ్ డేట్‍కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.
Boys Hostel OTT: మరో ఓటీటీలోకి వస్తున్న స్టూడెంట్స్ కామెడీ మూవీ బాయ్స్ హాస్టల్
Boys Hostel OTT: కన్నడ సినిమా ‘హాస్టల్ హడుగారు బేకగిద్దరే’ సూపర్ హిట్ అయింది. గతేడాది (2023) ఆగస్టు 26న తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో ఈ స్టూడెంట్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ రిలీజ్ అయింది. ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. విభిన్నమైన నరేషన్‍తో నవ్వులను పంచింది ఈ సినిమా. ఇప్పటికే బాయ్స్ హాస్టల్ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి కూడా బాయ్స్ హాస్టల్ సినిమా అడుగుపెట్టనుంది.
బాయ్స్ హాస్టల్ సినిమా ఆహా ఓటీటీలో ప్లాట్‍ఫామ్‍లో జనవరి 5వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. “2024 సంవత్సరాన్ని బ్యాంగ్‍తో స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ 2023 ‘బాయ్స్ హాస్టల్’ జనవరి 5 (2024) నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కాస్త రచ్చ చేయండి” అని ఆహా ట్వీట్ చేసింది.
బాయ్స్ హాస్టల్ చిత్రానికి నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ప్రజ్వల్, మంజునాథ్ నాయక, రాకేశ్ రాజ్‍కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించగా.. తరుణ్ భాస్కర్, రష్మి గౌతమ్ క్యామియో రోల్స్ చేశారు. ఇంజినీరింగ్ హాస్టల్‍లో వార్డెన్ ఆత్మహత్య చుట్టూ కామెడీ థ్రిల్లర్ డ్రామాగా బాయ్స్ హాస్టల్ వచ్చింది.
వరుణ్ గౌడ, ప్రజ్వల్, అరవింద్ కశ్యప్, నితిన్ కృష్ణమూర్తి నిర్మించిన బాయ్స్ హాస్టల్ చిత్రాన్ని.. పవర్ వాహ్ పిక్చర్స్ బ్యానర్‌పై కన్నడ హీరో రక్షిత్ శెట్టి సమర్పించారు. అజ్నీశ్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఎంతో స్ట్రిక్ట్‌గా ఉండే హాస్టల్ వార్డెన్ రమేశ్ కుమార్ (మంజునాథ్ నాయక) ఒక రోజు సూసైడ్ నోట్‍లో కొందరి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో ఆ స్టూడెంట్స్.. వార్డెన్ మృతదేహాన్ని మాయం చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఆ శవాన్ని స్టూడెంట్స్ మాయం చేశారా? వారికి ఎదురైన సమస్యలు ఏంటి? వారి పేర్లను వార్డెన్ ఎందుకు రాశారు? అన్నదే బాయ్స్ హాస్టల్ కథగా ఉంది.
బాయ్స్ హాస్టల్ మూవీ కన్నడ వెర్షన్ హాస్టల్ హడుగారు బేకగిద్దరే జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.