తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijayendra Prasad: రాజమౌళి తండ్రిపై సల్మాన్ ఖాన్ బావమరిది కామెంట్స్.. ఆయనే నాపై మొదటిసారి నమ్మకం ఉంచారంటూ!

Vijayendra Prasad: రాజమౌళి తండ్రిపై సల్మాన్ ఖాన్ బావమరిది కామెంట్స్.. ఆయనే నాపై మొదటిసారి నమ్మకం ఉంచారంటూ!

Sanjiv Kumar HT Telugu

20 April 2024, 6:36 IST

  • Aayush Sharma About Vijayendra Prasad: ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌పై బాలీవుడ్ హీరో, సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ ప్రశంసలు కురిపించారు. ఆయుష్ శర్మ నటించిన లేటెస్ట్ సినిమా రుస్లాన్ గ్రాండ్ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రాజమౌళి తండ్రిపై సల్మాన్ ఖాన్ బావమరిది కామెంట్స్.. ఆయనే నాపై మొదటిసారి నమ్మకం ఉంచారంటూ!
రాజమౌళి తండ్రిపై సల్మాన్ ఖాన్ బావమరిది కామెంట్స్.. ఆయనే నాపై మొదటిసారి నమ్మకం ఉంచారంటూ!

రాజమౌళి తండ్రిపై సల్మాన్ ఖాన్ బావమరిది కామెంట్స్.. ఆయనే నాపై మొదటిసారి నమ్మకం ఉంచారంటూ!

Vijayendra Prasad About Ruslaan Movie: బాలీవుడ్ యంగ్ టాలెంటెడ్, సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ హీరోగా నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం 'రుస్లాన్'. కరణ్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుశ్రీ మిశ్రా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Vidya Vasula Aham OTT Release Date: నేరుగా ఓటీటీలోకి విద్యా వాసుల అహం మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

The Goat Life OTT: పృథ్విరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’ ఓటీటీ రిలీజ్ ఆలస్యం.. స్ట్రీమింగ్‍కు వచ్చేది అప్పుడేనా?

OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న జర హట్కే జర బచ్కే మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్.. తెలుగులో కూడా..

Payal Rajput Rakshana: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో వస్తోన్న బోల్డ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌ని నిర్వహించింది. ప్రముఖ తెలుగు రచయిత, దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. "శివకి కథపై చాలా పాషన్ ఉంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పలేకపోతున్నాను. అంత అద్భుతంగా ఉంటుంది" అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

"రుస్లాన్ టీజర్ చాలా సార్లు చూశాను. చూసిన ప్రతిసారి కొత్త కోణం కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ గారితో సినిమా జరుగుతున్నపుడు ఆయుష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పని చేసేవారు. తనని చూసినప్పుడే హీరోలా కనిపించారు. ఇందులో ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. తనకి చాలా మంచి భవిష్యత్ ఉంది" అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

"రాధామోహన్ గారు చాలా పాషన్ ఉన్న నిర్మాత. ఈ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. జగపతి బాబు గారు ఎన్నో హిట్స్ చూశారు. ఈ సినిమాలో ఆయన ప్రజెన్స్ సినిమాని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్" అని రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

"ఈ వేడుకకు విజయేంద్ర ప్రసాద్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయనే మొదటిసారి నాపై నమ్మకం ఉంచారు. సుల్తాన్ సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేశాను. ఆ సమయంలో విజయేంద్ర ప్రసాద్ గారే నన్ను నటుడిగా లాంచ్ చేస్తే బావుంటుందని చెప్పారు. అలా నా జర్నీ మొదలైయింది" అని హీరో ఆయుష్ శర్మ తెలిపాడు.

"కెకె రాధమోహన్ గారు బ్రేవ్ హార్ట్ ప్రొడ్యూసర్. ప్యాషన్‌కి మారు పేరు. చాలా అంకిత భావంతో ఈ సినిమాని నిర్మించారు. ఆయన బ్యానర్‌లో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా మా అందరికీ గొప్ప విజయాన్ని చేకూర్చుతుందని నమ్ముతున్నాను. మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. తప్పకుండా సినిమాని థియేటర్స్‌లో చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు" అని ఆయుష్ శర్మ అన్నాడు.

హీరోయిన్ సుశ్రీ మిశ్రా మాట్లాడుతూ.. "రుస్లాన్ చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఏప్రిల్ 26న సినిమాని మీ అందరికీ చూపించడానికి ఎదురుచూస్తున్నాం. హైదరాబాద్‌లోనే ఈ సినిమా మొదటి షెడ్యుల్ చేశాం. ఇప్పుడు ఈ వేడుకలో మీ అందరినీ ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది'' అని తెలిపింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం