తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bipasha Maternity Photoshoot: మాతృత్వపు అందాన్ని పంచిన బిపాసా.. నిండు గర్భంతో ఫొటోషూట్

Bipasha Maternity Photoshoot: మాతృత్వపు అందాన్ని పంచిన బిపాసా.. నిండు గర్భంతో ఫొటోషూట్

08 January 2024, 22:17 IST

google News
    • Bipasha Maternity Photoshoot: బాలీవుడ్ నటి బిపాసా బసు నిండు గర్భంతో ఇప్పటికే చాలా సార్లు ఫొటోషూట్ చేసింది. అయితే తాజాగా ఆమె మరోసారి మాతృత్వపు అందాలను పంచుకుంది. తన బేబీ బంప్‌తో దిగిన ఫొటోను షేర్ చేసింది.
బిపాసా బసు
బిపాసా బసు

బిపాసా బసు

Bipasha Maternity Photoshoot: బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు ప్రస్తుతం గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే. తన బేబీ బంప్‌తో ఇప్పటికే చాలా సార్లు ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. తన భర్త కరణ్ గ్రోవర్‌తో కలిసి తన బేబీ బంప్ చూపిస్తూ నికార్సైన అందమేంటో నిరూపించింది. గర్భంతో ఉంటే అందంగా ఉండరు, పొట్ట ఎత్తుగా కనిపిస్తూ.. ఆకర్షణీయంగా కనిపించరు అనుకునే నేటితరం యువతలో చాలా మందికి స్ఫూర్తినింపే ప్రయత్నం చేసింది. తాజాగా మరోసారి తన మాతృత్వపు అందాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌లో బిపాసా బ్రాంజ్ క్లాత్‌ను ధరించింది. వీటికి తగినట్లు మ్యాచింగ్ అయ్యే ఇయర్ రింగ్స్ తొడుక్కుని తన అందాలను ప్రదర్శించింది. అంతేకాకుండా ఈ ఫొటోకు ఓ క్యాప్షన్ కూడా జోడించింది. "అన్ని వేళలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీకున్న శరీరాన్ని ప్రేమించండి." అంటూ రెడ్ హార్ట్ ఎమోజీలను జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా బిపాసా షేర్ చేసిన ఈ ఫొటోపై విశేషంగా స్పందిస్తున్నారు.

నెటిజన్లు బిపాసా మెటర్నిటీ ఫొటోపై హార్ట్ ఎమోజీల వర్షాన్ని కురిపిస్తున్నారు. అద్భుతమైన అమ్మ అంటూ ఓ వ్యక్తి స్పందించగా.. సూపర్ మామ్ ఆఫ్ బాలీవుడ్ అంటూ మరో యూజర్ తన కామెంట్ పోస్ట్ చేశారు. గర్భవతిగా మీ కళ మరింత పెరిగింది అంటూ ఇంకో యూజర్ స్పందించాడు. చాలా మంది అభిమానులు బిపాసా గర్భిణీ రూపాన్ని ప్రశంసించారు. హార్ట్ ఎమోజీలతో విషెస్ తెలిపారు.

బిపాసా 2016లో తన సహచర నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకుంది. 2015లో వచ్చిన అలోన్ మూవీ షూటింగ్ సమయంలో కలుసుకున్న వీరిద్దరూ ప్రేమించుకున్న పెళ్లిచేసుకున్నారు. బెంగాలీ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఈ చిత్రం తర్వాత డేంజరస్ అనే వెబ్‌సిరీస్‌లోనూ వీరిద్దరూ కలిసి కనిపించారు. ఇటీవల హిందూస్థాన్ టైమ్స్‌తో మాట్లాడిన బిపాసా.. తన గర్భం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇది చాలా భావోద్వేగమైన సమయం. "నాకు ఇప్పటికీ గుర్తుంది.. నేను, కరణ్ ఉన్న పళంగా మా అమ్మ ఉంటున్న ఇంటికి పరుగెత్తాం. ఎందుకంటే మొదటగా నేను చెప్పాలనుకుంది ఆమెకే. అప్పుడు అందరూ ఎమోషనల్ అయ్యారు. నాకు, కరణ్‌కు బిడ్డ పుట్టాలనేది మా అమ్మ కల. మాకు నమ్మకం ఎప్పుడూ ఉండేది. ఆ నమ్మకం ఇప్పుడు నిజమైంది. ఇందుకు కృతజ్ఞరాలిగా ఉంటాను." అంటూ బిపాసా స్పష్టం చేసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం