Ajagratha Movie Launch: టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న బాలీవుడ్ హీరో.. అజాగ్రత్త సినిమాతో అరంగేట్రం
13 May 2023, 17:20 IST
- Ajagratha Movie Launch: తెలుగు హీరోలు బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడం రోటీనే.. కానీ బాలీవుడ్ నటుడు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుండటం ఇప్పుడు సరికొత్త ట్రెండ్. హిందీ, మరాఠీ చిత్రాల నటుడు శ్రేయాస్ తల్పడే అజాగ్రత్త సినిమాతో తెలుగులో ఏంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా శనివారం ఘనంగా లాంచ్ అయింది.
అజాగ్రత్త మూవీ లాంచ్
Ajagratha Movie Launch: టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం, అక్కడ గుర్తింపు కోసం పాకులాడటం తెలిసిన విషయమే.. కానీ సీన్ కట్ చేస్తే బాలీవుడ్ హీరోలు..తెలుగులో నటిస్తే వినేందుకు కొత్తగా ఉంది కదూ.. అవును ప్రముక హిందీ, మరాఠీ చిత్రాల నటుడు శ్రేయాస్ తల్పడే తెలగులో అరంగేట్రం చేయబోతున్నారు. బాలీవుడ్‌లో కామెడీ, సీరియస్ రోల్స్‌లో తన గుర్తింపు పొందిన శ్రేయాస్.. అజాగ్రత్త అనే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నేడు ఈ సినిమా టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది.
రాధికా కుమారస్వామి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఎం శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం క్లాప్ కొట్టగా.. నిర్మాత ఠాగుర్ మధు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో వస్తోన్న అజాగ్రత్త సినిమాలో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు. రావు రమేష్, సునీల్, ఆదిత్య మీనన్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించనున్నారు.
ఈ సందర్భంగా హీరో శ్రేయాస్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం.. అజాగ్రత్త టీమ్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ రెండు పదాలే తెలుగులో నేర్చుకున్నాను. త్వరలో తెలుగు నేర్చుకుంటాను. ఈ టీమ్‌తో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. కరోనా టైమ్‌లో ఇండస్ట్రీ ఎంతో మారిపోయింది." అని శ్రేయాస్ అన్నారు.
ఈ చిత్రానికి ఎం శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రవి రాజ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సందీప్ వల్లూరి సినిమాటోగ్రాఫర్ వర్క్ చేస్తున్నారు. శ్రీహరి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రాధిక కుమారస్వామి హీరోయిన్‌గా చేస్తుంది.
శ్రేయాస్ తల్పడే అనగానే గుర్తుకొచ్చేది అల్లు అర్జున్ పుష్ప సినిమానే. ఈ చిత్రంలో అతడు నటించకపోయినప్పటికీ నార్త్ ఆడియెన్స్‌కు మన అల్లు అర్జున్ తన గొంతుకతో బాగా చేరువ చేశారు. పుష్ప హిందీ వెర్షన్‌లో మన ఐకాన్ స్టార్‌కు శ్రేయాస్ తల్పడే డబ్బింగ్ చెప్పారు. తన వాయిస్‌తో హిందీ డైలాగులను అద్బుతంగా చెప్పి నార్త్ ఆడియెన్స్‌ను ఆకర్షించారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాతో అల్లు అర్జున్‌కు ఉత్తారాదిన ఎంతైతో గుర్తింపు వచ్చిందో.. డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్‌కు అంతే గుర్తింపు లభించింది.