Bindu Madhavi on Relationship: త్రిష బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేశా.. పబ్లిక్‌గా ఒప్పేసుకున్న బిందు మాధవి..!
07 May 2023, 22:24 IST
- Bindu Madhavi on Relationship: బిందు మాధవి తను గతంలో త్రిష బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేసినట్లు ఒప్పుకుంది. అయితే త్రిషతో అతడు విడిపోయిన తర్వాత తను డేటింగ్ చేసినట్లు స్పష్టం చేసింది. న్యూసెన్స్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాలను తెలిపింది.
త్రిష బాయ్ ఫ్రెండ్‌తో బిందు మాధవి డేటింగ్
Bindu Madhavi on Relationship: బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ బిందు మాధవి న్యూసెన్స్ వెబ్ సిరీస్ అనే సంగతి తెలిసిందే. ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రమోషన్ల కోసం ఈ ముద్దుగుమ్మ విరివిగా పాల్గొంటుంది. నవ్‌దీప్‌తో కలిసి పలు ఇంటర్వ్యూలో హాజరవుతోంది. ఇందులో భాగంగా తన రిలేషన్షిప్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది బిందు. త్రిష బాయ్‌ఫ్రెండ్‌తో తాను డేటింగ్ చేసినట్లు స్పష్టం చేసింది. ఆ విషయం నిజమేనని, అయితే త్రిషతో అతడు విడిపోయిన తర్వాత తను రిలేషన్‌షిప్‌ను కొనసాగించానని తెలిపింది.
అసలు విషయానికొస్తే త్రిష 2015లో వరుణ్ మానియన్ అనే వ్యాపారవేత్త, కోలీవుడ్ నిర్మాతతో రిలేషన్లో ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 2015 జనవరిలో వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమే కానీ ఆ తర్వాత వివాహం రద్దు చేసుకుని విడిపోయారు.
అనంతరం 2017 ప్రారంభంలో వరుణ్‌తో బిందు మాధవి ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ కొన్ని రోజుల పాటు డేటింగ్ చేశారు. అంతేకాకుండా మాల్దీవుల వెకేషన్‌కు కూడా వెళ్లారు. అయితే ఆ తర్వాత వీరిద్దరూ కూడా విడిపోయారు. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా బిందు చెప్పింది. అయితే వరుణ్ మాత్రం బిందు తనకు స్నేహితురాలు మాత్రమేనని, ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని బదులివ్వడం గమనార్హం. కానీ బిందు మాత్రం పబ్లిక్‌గా వారి రిలేషన్ గురించి బయటకు చెప్పింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ న్యూసెన్స్ వెబ్ సిరీస్ నిర్మించారు. శ్రీ ప్రవణ్ కుమార్ దర్శకత్వం వహించారు. నవదీప్, బిందుమాధవి ప్రధాన పాత్రల్లో కలిసి నటించారు. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సామాజిక అంశాలను కూడా ఇందులో స్పృశించినట్లు తెలుస్తోంది.
టాపిక్