తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu: బిగ్ బాస్ నిర్వాహకుల షాకింగ్ నిర్ణయం.. అది ఇకనుంచి రద్దు.. పల్లవి ప్రశాంతే కారణం

Bigg Boss Telugu: బిగ్ బాస్ నిర్వాహకుల షాకింగ్ నిర్ణయం.. అది ఇకనుంచి రద్దు.. పల్లవి ప్రశాంతే కారణం

Sanjiv Kumar HT Telugu

27 December 2023, 15:38 IST

google News
  • Bigg Boss Telugu Organisers New Condition: బిగ్ బాస్ 7 తెలుగు విజేత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ పెద్ద దుమారం సృష్టించింది ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలగు నిర్వాహకులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ నిర్వాహకుల షాకింగ్ నిర్ణయం.. అది ఇకనుంచి రద్దు.. పల్లవి ప్రశాంతే కారణం
బిగ్ బాస్ నిర్వాహకుల షాకింగ్ నిర్ణయం.. అది ఇకనుంచి రద్దు.. పల్లవి ప్రశాంతే కారణం

బిగ్ బాస్ నిర్వాహకుల షాకింగ్ నిర్ణయం.. అది ఇకనుంచి రద్దు.. పల్లవి ప్రశాంతే కారణం

Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్‌. డిసెంబర్ 17న జరిగిన గ్రాండ్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా వచ్చి చేరుకున్నారు. మరోవైపు రన్నరప్ అమర్ దీప్ చౌదరి ఫ్యాన్స్ కూడా అక్కడే గుమిగూడారు. ఈ క్రమంలో అమర్ దీప్‌ని ఒక గేట్ నుంచి, ప్రశాంత్‌ను మరో గేట్ నుంచి పంపించారు పోలీసులు.

అమర్ దీప్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. కానీ అతని కుటుంబం పయనిస్తున్న కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. మరోవైపు శాంతి భద్రల నేపథ్యంలో ప్రశాంత్‌ను వెళ్లిపోమ్మంటే.. నేను దొంగతనం చేసిన్నా.. నేనేందుకు వెళ్లాలి. రైతుబిడ్డకు గౌరవం ఇవ్వట్లేదు అని పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా వెళ్లిన ప్రశాంత్ మళ్లీ ఓపెన్ టాప్ జీప్‌లో వచ్చి ర్యాలీ తీశాడు.

దాంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇలా శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేసిన పల్లవి ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 14 రోజులు రిమాండ్‌ కూడా విధించారు. నాలుగు రోజులు చంచల్ గూడా జైలులో గడిపిన ప్రశాంత్ ఇటీవలే బెయిల్ మీద బయటకొచ్చాడు. ఈ కేసు విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులకు సైతం పోలీసులు నోటీసులు పంపించారు. ఇప్పటికే బిగ్ బాస్‌పై వ్యతిరేకత వస్తుండగా తాజాగా పోలీసుల నోటీసులు తలనొప్పిగా మారింది.

ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు షో నిర్వాహకులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇకపై షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ర్యాలీలు వంటివి చేయకూడదని నిర్ణయించారట. ఈ విషయాన్ని అగ్రిమెంట్‌లో కూడా పొందుపరచనున్నారని టాక్. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ అవుతోంది. మొత్తానికి పల్లవి ప్రశాంత్ వల్ల బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ఎప్పుడూ తీసుకోని డెసిషియన్ తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం