తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu7: షాకింగ్ ట్విస్ట్.. మారిన బిగ్ బాస్ తెలుగు 7 ఓటింగ్.. ఇక వాళ్లకు కష్టమే

Bigg Boss Telugu7: షాకింగ్ ట్విస్ట్.. మారిన బిగ్ బాస్ తెలుగు 7 ఓటింగ్.. ఇక వాళ్లకు కష్టమే

Sanjiv Kumar HT Telugu

04 September 2023, 7:54 IST

google News
  • Bigg Boss 7 Telugu Voting: సెప్టెంబర్ 3న గ్రాండ్‍గా బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రారంభమైంది. ఒక్కో కంటెస్టెంట్ విభిన్నంగా మొత్తం 14 మంది ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎప్పుడూ చూడని విధంగా ఈ సీజన్‍లో ఊహించని మెలిక పెట్టారు. అది కొంతమందికి కష్టం కానుంది. అదేంటనే వివరాల్లోకి వెళితే..

మారిన బిగ్ బాస్ తెలుగు 7 ఓటింగ్
మారిన బిగ్ బాస్ తెలుగు 7 ఓటింగ్

మారిన బిగ్ బాస్ తెలుగు 7 ఓటింగ్

ఊరించి.. ఊరించి.. ఉత్సాహం పెంచిన బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఆదివారం నాడు ప్రారంభమైంది. ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో పర్ఫామెన్స్ తో బిగ్ బాస్ హౌజ్‍లోకి అడుగుపెట్టారు. అయితే ఆదివారం నాడు కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌజ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో మొదటి కంటెస్టెంట్‍గా జానకి కలగనలేదు సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ ప్రవేశించింది. తర్వాత రెండో కంటెస్టెంట్‍గా హీరో శివాజీ, సింగర్ దామిని భట్ల, మోడల్, నటుడు ప్రిన్స్ యావర్ వరసుగా అడుగు పెట్టారు.

అనంతరం ఐదో కంటెస్టెంట్‍గా నటి, లాయర్ శుభ శ్రీ రాయ్ గురు, షకీల, ఆట సందీప్, కార్తీక దీపం శోభా శెట్టి, జబర్దస్త్ కమెడియన్, ఫుడ్ బ్లాగర్ టేస్టీ తేజ, నేను స్టూడెంట్ సర్ ఫేమ్ రతిక రోజ్, ఆకాశ వీధుల్లో హీరో, డాక్టర్ గౌతమ్ కృష్ణ, సీనియర్ హీరోయిన్ కిరణ్ రాథోడ్, రైతు, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్, జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి వరుసగా 14 మంది బిగ్ బాస్‍లోకి అడుగుపెట్టారు. సోమవారం రోజున మరికొంతమంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే, ఏ సీజన్‍లో లేనటువంటి ఊహించని ట్విస్ట్ నాగార్జున ఎపిసోడ్ ఎండింగ్‍లో ఇచ్చారు.

ఇది ఎవరి ఊహకందని సీజన్ ఉల్టా పుల్టా అని నాగార్జున చెప్పినట్లుగానే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. గత ఆరు సీజన్లలో ప్రేక్షకులు 10 ఓట్లు వేసే అవకాశం ఇచ్చేవారు. ఈ పది ఓట్లను మనకు నచ్చినట్లుగా కంటెస్టెంట్లకు షేర్ చేసే అవకాశం ఉండేది. అంటే అన్నీ ఓట్లు ఒక కంటెస్టెంట్‍కు మాత్రమే వేయకుండా నచ్చిన వారందరికీ పంచే ఛాన్స్ ఉండేది. అలాగే 10 మిస్డ్ కాల్స్ కూడా నచ్చిన విధంగా షేర్ చేసే సర్దుబాటు ఉండేది. ఇప్పుడు ఆ విధానాన్ని బిగ్ బాస్ మేకర్స్ మార్చేశారు.

బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‍లో కేవలం ఒక్క ఓటు మాత్రమే వేసే అవకాశం ఇచ్చారు నిర్వాహకులు. అంటే తనకు నచ్చిన ఒకే ఒక్క సభ్యుడికి మాత్రమే ఓటు వేయాలి. అది కూడా హాట్ స్టార్ యాప్ నుంచే మాత్రమే వేయాలి. మిస్ట్ కాల్ కూడా ఒకటి మాత్రమే ఇవ్వాలి. దీంతో ఫేక్ అకౌంట్లతో ఓట్లు వేసే వారికి అవకాశం లేకుండా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 6వ సీజన్‍తో బిగ్ బాస్‍పై ప్రేక్షకులకు నమ్మకం పోవడంతో ఈ విధానం తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఇలా అయితే పీఆర్ టీమ్ పెట్టుకుని ఫేక్ అకౌంట్స్ ద్వారా ఓట్లు వేయించుకునే కంటెస్టెంట్స్ కు పెద్ద షాక్ తగిలినట్లే.

 

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం