తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 7: రైతు బిడ్డకే అత్యధిక ఓట్లు.. సీరియల్ బ్యాచ్‍కు పెద్ద దెబ్బ.. ఎలిమినేట్ అయ్యేది వాళ్లే!

Bigg Boss Telugu 7: రైతు బిడ్డకే అత్యధిక ఓట్లు.. సీరియల్ బ్యాచ్‍కు పెద్ద దెబ్బ.. ఎలిమినేట్ అయ్యేది వాళ్లే!

Sanjiv Kumar HT Telugu

14 September 2023, 5:53 IST

google News
  • Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ హౌజ్‍ చాలా రసవత్తరంగా సాగుతోంది. రెండో వారం నామినేషన్స్ లో ఏకంగా తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి వారిలో ఎవరెవరికీ ఎంత వరకు ఓటింగ్ నమోదు అయిందని చూస్తే..

బిగ్ బాస్ తెలుగు 7 రెండో వారం ఓటింగ్ ఫలితాలు
బిగ్ బాస్ తెలుగు 7 రెండో వారం ఓటింగ్ ఫలితాలు

బిగ్ బాస్ తెలుగు 7 రెండో వారం ఓటింగ్ ఫలితాలు

బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‍లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. వారిలో మొదటి వారం సీనియర్ హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. నామినేషన్స్ లో ఉన్న ఆమెకు తొలి రోజు నుంచే తక్కువ ఓటింగ్స్ రావడంతో ఆదివారం వచ్చేసరికి ఎలిమినేట్ అయిపోయింది. ఇక సోమవారం (సెప్టెంబర్ 11) నుంచి మంగళవారం (సెప్టెంబర్ 12) వరకు నామినేషన్లు హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే. ఇలా బిగ్ బాస్ 7 తెలుగు రెండోవారం 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.

సీరియల్ బ్యాచ్

బిగ్ బాస్ 7 తెలుగు రెండో వారం అత్యధిక ఓట్లతో పల్లవి ప్రశాంత్, హీరో శివాజీ, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, , అమర్ దీప్ చౌదరి, రతిక రోజ్, షకీల, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ నామినేట్ అయ్యారు. వీరిలో అందరితో పల్లవి ప్రశాంత్ ఎక్కువగా టార్గెట్ అయ్యాడు. అతన్ని తొమ్మిది మంది నామినేట్ చేశారు. ప్రశాంత్‍పై స్టార్ మా సీరియల్ బ్యాచ్ అయినా అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి విరుచుకుపడ్డారు. వాళ్లకు ఆట సందీప్, రతిక రోజ్ సపోర్ట్ కూడా చేశారు.

ఎవరికీ ఎంత ఓటింగ్

అయితే నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లలో ఉన్న ప్రశాంత్‍కే మళ్లీ ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు పడ్డాయి. పల్లవి ప్రశాంత్‍ 39.56 శాతంతో టాప్‍లో ఉండగా రెండో స్థానంలో శివాజీ 20.93 శాతం ఓట్లతో ఉన్నాడు. ఇక అమర్ దీప్ చౌదరికి 17.94 శాతం, రతికకు 8.18 శాతం, గౌతమ్ కృష్ణకు 3.21 శాతం, ప్రిన్స్ యావర్ 3.06 శాతం, శోభా శెట్టి 2.51 శాతం, షకీలకు 2.34 శాతం, టేస్టీ తేజ 2.28 శాతం ఓట్లు నమోదు అయ్యాయి. నామినేషన్లలో పల్లవి ప్రశాంత్‍ను అందరూ కలిసి జీరోను చేయాలని చూశారు. కానీ, అదే అతనికి ప్లస్ అయి హీరోలా నిలిచాడు.

ఎలిమినేట్ అయ్యే ఛాన్స్

ఇలానే ఓటింగ్ ఫ్లో కొనసాగితే చివరి రెండు స్థానాల్లో ఉన్న షకీల లేదా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. టేస్టీ తేజ తన కామెడీతో బాగానే అలరిస్తున్నాడు. కాబట్టి, అతను వెళ్లే ఛాన్సెస్ తక్కువగానే కనిపిస్తున్నాయి. టేస్టీ తేజ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటే.. షకీల, శోభా శెట్టిలో ఒకరు హౌజ్ నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం