తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu Grand Finale: ప్రిన్స్ యావర్ 15లక్షల సూట్‍కేస్ తీసుకున్నాడా? ఐదు, ఆరు ప్లేస్‍ల్లో ఆ ఇద్దరు ఎలిమినేట్!

Bigg Boss Telugu Grand Finale: ప్రిన్స్ యావర్ 15లక్షల సూట్‍కేస్ తీసుకున్నాడా? ఐదు, ఆరు ప్లేస్‍ల్లో ఆ ఇద్దరు ఎలిమినేట్!

16 December 2023, 20:51 IST

google News
    • Bigg Boss Telugu Grand Finale: బిగ్‍బాస్ గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన కొన్ని లీక్స్ బయటికి వచ్చాయి. షూటింగ్ జరగడంతో కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. ప్రిన్స్ యావర్, ప్రియాంక, అంబటి అర్జున్‍కు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి.
బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ఫైనలిస్టులు
బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ఫైనలిస్టులు

బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ఫైనలిస్టులు

Bigg Boss Telugu Grand Finale: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ ఫినాలేకు రంగం సిద్ధమైంది. ఈ ఆదివారం (డిసెంబర్ 17) గ్రాండ్ ఫినాలే జరగనుంది. సెలెబ్రెటీల ఎంట్రీలు, డ్యాన్స్ పర్ఫార్మెన్సులతో గ్రాండ్ ఫినాలేను భారీగా ప్లాన్ చేసింది స్టార్ మా ఛానెల్. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం టెలికాస్ట్ కానుంది. అయితే, శనివారమే షూటింగ్ జరుగుతుండటంతో హౌస్‍లో నుంచి కొన్ని విషయాలు లీక్‍ల ద్వారా బయటికి వస్తున్నాయి.

బిగ్‍బాస్ హౌస్‍లో ప్రస్తుతం చివరిదైన 15వ వారంలో ఫైనలిస్టులుగా పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరి, శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్ ఉన్నారు. అయితే, గ్రాండ్ ఫినాలేలో ముందుగా ఆరో స్థానంలో అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యారని లీకులు వచ్చేశాయి.

ఆరుగురిలో అందరి కంటే తక్కువగా ఓట్లు వచ్చిన అర్జున్.. ఆరో స్థానంలో నిలిచి గ్రాండ్ ఫినాలేలో ముందుగా ఎలిమినేట్ అయినట్టు లీక్స్ వచ్చాయి. ఈ సీజన్‍లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‍బాస్‍లో అడుగుపెట్టిన సీరియల్ యాక్టర్ అర్జున్.. ఫినాలే అస్త్ర ద్వారా ఫైనల్‍లో అడుగుపెట్టాడు. మొత్తంగా ఫైనల్‍లో అతడు ముందుగా ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.

ఆ తర్వాత ప్రియాంక

బిగ్‍బాస్ 7వ సీజన్‍లో ఐదో స్థానంలో నిలిచి సీరియల్ నటి ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయ్యారని సమాచారం బయటికి వచ్చింది. ఈగల్ సినిమా ప్రమోషన్ల కోసం బిగ్‍బాస్ హౌస్‍లోకి వెళ్లిన మాస్ మహారాజ హీరో రవితేజ.. ప్రియాంక ఎలిమినేషన్‍ను ప్రకటించారట. హౌస్ నుంచి ప్రియాంకను ఆయనే బయటికి తీసుకొచ్చారని టాక్.

యావర్ సూట్‍కేస్ తీసుకున్నాడా?

ఫినాలేలో పోటీ నుంచి తప్పుకునేందుకు రూ.15లక్షల సూట్‍కేస్‍ను ప్రిన్స్ యావర్‌కు బిగ్‍బాస్ ఆఫర్ చేశారట. అయితే, తాను గెలవడం కష్టమేనని ఆలోచించిన యావర్ ఆ సూట్‍కేస్ తీసుకొని డబ్బుతో ఎలిమినేట్ అయ్యేందుకు నిర్ణయించుకున్నాడని లీక్‍ల ద్వారా బయటికి వచ్చింది. రూ.15లక్షలను తీసుకొని పోటీ నుంచి యావర్ తప్పుకొని.. నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది.

దీంతో, ప్రస్తుతం బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ రేసులో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ ఉన్నారని తెలుస్తోంది. ఈ ముగ్గురికి ఓట్లు పోటాపోటీగా వచ్చాయని ఓటింగ్ ట్రెండ్ ద్వారా తెలుస్తోంది. గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్టుల ఎలిమినేషన్, ఎవరు టైటిల్ దక్కించుకోనున్నారో రేపు (డిసెంబర్ 17) గ్రాండ్ ఫినాలేలో తెలియనుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం