తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Srihan - Siri Hanmanth Web Series: లవర్ సిరితో శ్రీహాన్ వెబ్ సిరీస్ - శేఖ‌ర్ మాస్ట‌ర్ ప్రొడ్యూస‌ర్‌

Srihan - Siri Hanmanth Web Series: లవర్ సిరితో శ్రీహాన్ వెబ్ సిరీస్ - శేఖ‌ర్ మాస్ట‌ర్ ప్రొడ్యూస‌ర్‌

25 December 2022, 10:17 IST

  • Srihan - Siri Hanmanth Web Series: బిగ్‌బాస్ ర‌న్న‌ర‌ప్ శ్రీహాన్ త‌న ల‌వ‌ర్ సిరితో క‌లిసి ఓ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సిరీస్‌కు ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అత‌డు ఎవ‌రంటే...

శ్రీహాన్‌, సిరి హ‌నుమంత్‌
శ్రీహాన్‌, సిరి హ‌నుమంత్‌

శ్రీహాన్‌, సిరి హ‌నుమంత్‌

Srihan - Siri Hanmanth Web Series: బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 ర‌న్న‌ర‌ప్‌గా శ్రీహాన్ నిలిచిన సంగ‌తి తెలిసింది. విన్న‌ర్ రేవంత్ కంటే శ్రీహాన్ ఎక్కువ ప్రైజ్‌మ‌నీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ టైటిల్ గెలిచే అవ‌కాశం శ్రీహాన్‌కే ఎక్కువ‌గా ఉండ‌గా నాగార్జున ఇచ్చిన ప్రైమ్‌మ‌నీని తీసుకొని ర‌న్న‌ర‌ప్ టైటిల్‌తో స‌రిపెట్టుకున్నాడు. ఈ బిగ్‌బాస్ రియాలిటీ షోలో త‌న కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్న శ్రీహాన్‌కు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌లో మంచి అవ‌కాశాలు వ‌స్తోన్న‌ట్లు స‌మాచారం.

ట్రెండింగ్ వార్తలు

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

తాజాగా త‌న ల‌వ‌ర్ సిరి హ‌నుమంత్‌తో శ్రీహాన్ ఓ వెబ్ సిరీస్ చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని శ్రీహాన్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. బిగ్‌బాస్ హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత శ్రీహాన్ అంగీక‌రించిన తొలి ప్రాజెక్ట్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ సిరీస్‌కు ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడు. సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు శ్రీహాన్ పేర్కొన్నాడు. శేఖ‌ర్ మాస్ట‌ర్‌, సిరి, డైరెక్ట‌ర్‌ల‌తో క‌లిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు శ్రీహాన్‌. ఫుల్ ఫ‌న్‌తో ఈ వెబ్‌సిరీస్ సాగ‌నున్న‌ట్లు శ్రీహాన్ పేర్కొన్నాడు.

త్వ‌ర‌లోనే ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన వివ‌రాల్ని రివీల్ చేయ‌బోతున్న‌ట్లు తెలిపాడు. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ సిరీస్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ వెబ్ సిరీస్ తో శ్రీహాన్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సిరితో చాలా కాలంగా ప్రేమ‌లో ఉన్నాడు శ్రీహాన్‌. బిగ్‌బాస్ సీజ‌న్ 6 లో అత‌డి కోసం హౌజ్‌కు వ‌చ్చింది సిరి హ‌నుమంత్‌. ఫ్యామిలీ ఎపిసోడ్‌లో సిరి, శ్రీహాన్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. గ‌తంలో కొన్ని వెబ్‌సిరీస్‌ల‌లో సిరి, శ్రీహాన్ క‌లిసి న‌టించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.