తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Inaya Sulthana: సినిమా క‌ష్టాల‌పై బిగ్ బాస్ ఇన‌యా సుల్తానా మూవీ - న‌ట‌ర‌త్నాలు రిలీజ్ ఎప్పుడంటే?

Bigg Boss Inaya Sulthana: సినిమా క‌ష్టాల‌పై బిగ్ బాస్ ఇన‌యా సుల్తానా మూవీ - న‌ట‌ర‌త్నాలు రిలీజ్ ఎప్పుడంటే?

22 January 2024, 10:33 IST

  • Bigg Boss Inaya Sulthana: బిగ్‌బాస్ ఫేమ్ ఇన‌యా సుల్తానా హీరోయిన్‌గా న‌టిస్తోన్న న‌ట‌ర‌త్నాలు మూవీ ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. సినిమా ఇండ‌స్ట్రీ క‌ష్టాల‌పై తెర‌కెక్కించిన ఈ మూవీకి శివ‌నాగు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇన‌యా సుల్తానా
ఇన‌యా సుల్తానా

ఇన‌యా సుల్తానా

Bigg Boss Inaya Sulthana: బిగ్‌బాస్ సీజ‌న్ 6లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది ఇన‌యా సుల్తానా. ఒక‌నొక‌ద‌శ‌లో టైటిల్ ఫేవ‌రేట్‌గా నిలిచింది. చివ‌రి వ‌ర‌కు పోరాడిన క‌ప్పు మాత్రం గెల‌వ‌లేక‌పోయింది. సీజ‌న్ 6తో పాపుల‌ర్ అయిన ఇన‌యా సుల్తానా న‌ట‌ర‌త్నాలు పేరుతో సినిమా చేస్తోంది. క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి శివ‌నాగు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Madgaon Express OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Yuvaraj OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన కాంతార హీరోయిన్ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

న‌ట‌ర‌త్నాలు ట్రైల‌ర్‌ను తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ రిలీజ్ చేశాడు. సినిమా రంగం గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మన కష్టాలు ఎక్కువ హైలైట్ అవుతుంటాయ‌ని ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో దామోద‌ర్‌ప్ర‌సాద్ చెప్పాడు. అవన్నీ అధిగమించి ఇండ‌స్ట్రీలో నిలబడ్డమే అస‌లైన‌ కళఅని చెప్పాడు. 'నటరత్నలు' జాతి రత్నాలు లా పెద్ద‌ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాన‌ని తెలిపాడు.

సినిమా క‌ష్టాల‌తో...

ఇండ‌స్ట్రీ క‌ష్టాల‌తో క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా న‌ట‌ర‌త్నాలు మూవీని తెర‌కెక్కిస్తోన్న‌ట్లు ద‌ర్శ‌కుడు శివ‌నాగు చెప్పాడు. సినిమా తీయాల‌నే సంక‌ల్పంతో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన వాళ్లు ఎలా విజ‌యాల్ని అందుకున్నారు? ఈ ప్ర‌య‌త్నంలో చాలా మంది ఎందుకు ఓడిపోతున్నార‌నే పాయింట్‌తో న‌ట‌ర‌త్నాలు మూవీ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంద‌ని శివ‌నాగు అన్నాడు. ఇన‌యా సుల్తానా రోల్ డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని చెప్పాడు. ఫిబ్ర‌వ‌రిలో న‌ట‌ర‌త్నాలు మూవీని రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని, త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గాఅనౌన్స్‌చేస్తామ‌ని శివ‌నాగు అన్నాడు.

ద‌ర్శ‌కులు న‌టులుగా...

న‌ట‌ర‌త్నాలు సిన‌మాలో సూర్య‌కిర‌ణ్‌, ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రితో పాటు ప‌లువురు ద‌ర్శ‌కులు న‌టులుగా క‌నిపిస్తార‌ని నిర్మాత చెప్పాడు. 2002లో సినిమా తీయాల‌ని ప్ర‌య‌త్నించి న‌ష్ట‌పోయాన‌ని, ఈ సారి మాత్రం హిట్ కొట్టాల‌నే క‌సితో న‌ట‌ర‌త్నాలు సినిమా చేస్తున్నాన‌ని నిర్మాత చంటి అన్నాడు.న‌ట‌ర‌త్నాలు ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్ట‌ర్ ఏఎస్ ర‌వికుమార్ పాల్గొన్నాడు.

రాజ‌మౌళి, ప్ర‌శాంత్ నీల్‌...

ఈ ట్రైల‌ర్ కామెడీతో పాటు థ్రిల్లింగ్‌గా సాగింది. వ‌చ్చి ఆరేళ్లు అయినా ఒక్క సినిమా చేయ‌లేక‌పోయాన‌ని సుద‌ర్శ‌న్ బాధ‌ప‌డ‌టం న‌వ్విస్తూనే సినిమా క‌ష్టాల‌ను చాటిచెబుతుంది. రాజ‌మౌళి, శంక‌ర్‌, ప్ర‌శాంత్ నీల్ టీమ్ వ‌ర్క్‌తోనే స‌క్సెస్ అయ్యార‌ని వ‌స్తోన్న డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

సినిమా తీయాల‌ని అనుకున్న ముగ్గురు యువ‌కులు ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఎలా చిక్కుకున్నార‌న్న‌ది ట్రైల‌ర్‌లో చూపించారు. న‌ట‌ర‌త్నాలు మూవీలో తాగుబోతు ర‌మేష్‌, సుద‌ర్శ‌న్‌, అర్చ‌న కీల‌క పాత్ర‌లు పోషించారు. శంక‌ర్ మ‌హ‌దేవ్ సంగీతాన్ని అందించాడు. బిగ్‌బాస్ ద్వారా వ‌చ్చిన పేరుతో వాలెంటైన్స్ నైట్‌, ఏవం జ‌గ‌త్‌, బుజ్జి ఇలా రా సినిమాలు చేసింది ఇన‌యా సుల్తానా. మ‌రికొన్ని సినిమాలు సిరీస్‌ల‌లో కీల‌క పాత్ర‌లు పోషిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం