తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu Gossips : బిగ్ బాస్‍ హౌజులో ఎఫైర్స్.. గాసిప్స్ చెప్పిన షకిలా!

Bigg Boss 7 Telugu Gossips : బిగ్ బాస్‍ హౌజులో ఎఫైర్స్.. గాసిప్స్ చెప్పిన షకిలా!

Anand Sai HT Telugu

08 September 2023, 7:30 IST

google News
    • Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌజులో గాసిప్స్ మెుదలయ్యాయి. గాసిప్స్ ఏమున్నాయో చెప్పాలంటూ స్వయంగా బిగ్ బాస్ అడిగేశాడు. దీంతో కంటెస్టెంట్లు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 
బిగ్ బాస్ 7 తెలుగు
బిగ్ బాస్ 7 తెలుగు

బిగ్ బాస్ 7 తెలుగు

బిగ్ బాస్‌ రియాలిటీ షో ప్రతి సీజన్లో ఎవరి మధ్యనైనా లవ్ ట్రాక్ నడవటం అనేది కామన్. అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. బిగ్ బాస్ స్వయంగా హౌజులో గాసిప్స్ ఏంటో తెలుసుకుంటున్నాడు. కంటెస్టెంట్లు కూడా తాము పరిశీలించిన విషయాలను బిగ్ బాస్‍కు చెబుతున్నారు. తాజా ఎపిసోడ్లో షకిలా నిద్రపోతూ ఉంటుంది. బిగ్ బాస్ ఆమెను పిలుస్తాడు. రెండు నిమిషాలు నిద్రపోయానని చెబుతుంది. కన్ఫెషన్ రూములోకి పిలుస్తాడు.

ప్రశాంత్ మీకు ఎలా అనిపిస్తున్నాడని బిగ్ బాస్ అడుగుతాడు. ఆయన విన్ చేయాలని మోటివ్‍తో వచ్చాడని చెబుతుంది షకిలా. అందరూ అందుకే వచ్చారని, తను చాలా కంటెస్టెంట్ అని, దీనికోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు ట్రై చేస్తున్నాడని వివరిస్తుంది. చిన్న ఫెయిల్యూర్ వచ్చినా.. తట్టుకోలేకపోతున్నాడని అంటుంది.

ఈ ఇంట్లో ఫేక్ అని ఎవరు అనిపిస్తుందని ప్రశ్నిస్తాడు బిగ్ బాస్. ప్రశాంత్ ఫేక్ అని, ఫేక్ నవ్వు అని, ప్రిన్స్ మంచొడు అని, కానీ ఫేక్ అని వెల్లడిస్తుంది. అందరితో కలిసేందుకు ట్రై చేస్తున్నాడని అంటుంది. కంటెస్టెంట్ల గురించి గాసిప్ చెప్పమని బిగ్ బాస్ ప్రశ్నించగా.. ప్రశాంత్‍ను రతిక ఇన్‍ఫ్లూయెన్స్ చేస్తుందని, ఎవరైనా ముట్టుకుంటే కోపం వచ్చినట్టుగా యాక్టింగ్ చేస్తుందని, ఈ విషయాన్ని ప్రశాంత్ సీరియస్ గా తీసుకోవచ్చని తన అభిప్రాయాన్ని చెప్పింది. గౌతమ్, సుభా శ్రీ కూడా లేట్ నైట్ వరకూ మాట్లాడుకుంటున్నారని, అది కూడా నా మనసులో వచ్చిన పాయింట్ అని వివరించింది. ఎవరైనా ఫేక్ రిలేషన్ షిప్ మెయింటెన్ చేస్తున్నారా అని అడగ్గా.. అందరూ ఫేక్ రిలేషన్‍షిప్ అని, నాది కూడా అంతేనని తెలుపుతుంది. నెక్ట్స్ టైమ్ మీకు చాలా గాసిప్స్ ఉంటాయని ఆశిస్తున్నట్టుగా వెళ్లమని అంటాడు.

తర్వాత టేస్టీ తేజను పిలిచాడు బిగ్ బాస్. ఇంట్లోనే స్పైసీ గాసిప్ చెప్పమని అడిగాడు. గౌతమ్, సుభాకు కనెక్ట్ అవుతున్నానని చెప్పాడని వివరించాడు. పాజిటివ్ అప్రోచ్ ఉందని తెలిపాడు. ఫేక్ ఎవరైనా ఉన్నారా అని అడగ్గా.. ప్రశాంత్ అనిపిస్తున్నట్టుగా తెలిపాడు. అన్నం తినేప్పుడు కాళ్ల దగ్గర.. కూర్చొంటున్నాడని, పడుకునేప్పుడు కింద పడుకుంటున్నాడని వెల్లడించాడు. అలా తినే ప్లేటు కాళ్ల దగ్గర ఉండటం కరెక్ట్ కాదని చెప్పాడు.

తర్వాత బయటకు వచ్చాక.. టేస్టీ తేజ.. సుభాతో మాట్లాడాడు. బిగ్ బాస్ అడిగితే.. గాసిప్ చెప్పానని, నీకు గౌతమ్ మధ్య పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని తెలిపాడు. ఏం చెప్పావ్ అని సుభా ప్రశ్నించింది. అటు నుంచి పాజిటివ్ ఉందని, ఇటు నుంచి ఎలా ఉందో తెలియదని చెప్పినట్టుగా వివరించాడు తేజ. దీంతో ఇక బిగ్ బాస్ హౌజులో లవ్ ట్రాక్స్ షురూ అవుతాయని ఆడియెన్స్ చూస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం