Bigg Boss 7 Telugu : అర్థరాత్రి దెయ్యంలా ఊగిపోయిన షకీల.. నిద్ర లేకుండా చేసిన హీరో
09 September 2023, 5:57 IST
Bigg Boss 7 Telugu Shakeela: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ హౌజ్‍లో షకీల ప్రవర్తించిన తీరు మిగతా కంటెస్టెంట్లనే కాదు షో చూస్తున్న ప్రేక్షకులు సైతం భయపడేలా చేసింది. అసలు కొంత సమయం వరకు ఏం జరుగుతుందనేది తెలియరాలేదు. ఇంతకీ హౌజ్‍లో సెప్టెంబర్ 8వ తేది ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే?
అర్థరాత్రి దెయ్యంలా ఊగిపోయిన షకీల
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ సెప్టెంబర్ 9, డే 6 ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‍గా సాగింది. ఓవైపు శుభశ్రీ, గౌతమ్ కృష్ణ మనస్ఫర్థలు, రతిక రోజ్-పల్లవి ప్రశాంత్ ఒకరినొకరు ఆట పట్టించుకోవడాలు, పవరాస్త్ర కంటెండర్స్ మధ్య నామినేషన్స్, గొడవలతో జోరుగా ఉంది. ఇక హౌజ్‍లో రచ్చ మొదలైనట్లే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే షకీల 500 సినిమాలు చేసిన అనుభవాన్ని చూపించేసింది. అర్ధరాత్రి దాదాపు దెయ్యం తరహాలో ఊగిపోయింది. అది చూసి మిగతా కంటెస్టెంట్స్ అంతా తెగ వణికిపోయారు. నిజానికి హౌజ్‍లో ఉన్నవాళ్లలో ఆమెనే సీనియర్. శివాజీ, కిరణ్ రాథోడ్ కంటే ఎక్కువ సినిమాలు చేసిన అనుభవం ఆమెకు ఉంది. అందుకే అంతా హడలిపోయేంతలా చేశారు.
ఊపిరి వదలకుండా
ముందు షకీల, శివాజీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో గౌతమ్‍ను పిలుచుకుని వచ్చారు. గౌతమ్ డాక్టర్ కావడంతో అతన్ని పిలిచి షకీల బీపీ, కండిషన్ చూడమన్నారు. షకీలను తాను నెంబర్స్ కౌంట్ చేస్తుంటే.. శ్వాస తీసుకుని వదలమన్నాడు గౌతమ్. అప్పుడు షకీల అలానే చేశారు. కానీ, శ్వాస తీసుకున్న ఆమె కళ్లు మూసుకుని కొద్దిసేపు వరకు ఊపిరి వదల్లేదు. దీంతో గౌతమ్, శివాజీ, టేస్టీ తేజ కంగారు పడ్డారు. శ్వాస ఆడుతుందో లేదో గౌతమ్ చెక్ చేశారు. కొంచెం యాంగ్జయిటీగా ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్పిన గౌతమ్.. దేని గురించి ఆలోచించకండి. ప్రశాంతంగా పడుకోండి అని షకీలతో అన్నాడు.
కళ్లు పెద్దవిగా చేసి
తర్వాత షకీలను తీసుకెళ్లి తన బెడ్‍పై పడుకోబెట్టి వచ్చారు. ఏదో ఆలోచిస్తూ ఉంది. దిగులుపడుతుంది అని టేస్టీ తేజ అన్నాడు. షకీల కండిషన్ చూసి ఆమెకు హెల్త్ బాలేదని, మెడిసిన్ కోసం బిగ్ బాస్‍తో మాట్లాడింది శుభ శ్రీ. అనంతరం అర్ధరాత్రి లేచి ఊగిపోతూ విచిత్రంగా ప్రవర్తించింది షకీల. సీరియస్‍గా ఫేస్ పెట్టి, లేచి కూర్చుని కళ్లు పెద్దవిగా చేసింది. ఆమెను చూసిన హౌజ్ కంటెస్టెంట్స్ అంతా హడలిపోయారు. దామిని అయితే దగ్గరకు వెళ్లేందుకు కూడా భయపడి దూరంగా ఉండే పలకరించింది. శోభా శెట్టి బిత్తర చూపులు చూసింది.
భయపడుతూ, ఏడుస్తూ..
షకీలాను చూసి టేస్టీ తేజ బెదిరిపోయాడు. ఇదేందన్నా ఇలా చేస్తుంది అని భయపడిపోయాడు తేజ. తర్వాత షకీల అర్థరాత్రి లేచి భయపడుతున్నట్లు, ఏడుస్తున్నట్లుగా చేసింది. శివాజీ కొంతసేపు, టేస్టీ తేజ కొంతసేపు పక్కనే ఉండి ఓదార్చారు. తేజ పక్కనే ఉండగా షకీల ఒక్కసారిగా లేవడంతో తెగ హడలిపోయాడు. అది చూసి హౌజ్ మేట్స్ కూడా వచ్చారు. తర్వాత అంతా వెళ్లిపోయారు. అసలు ఏమైందో అని అంతా కంగారు పడిపోయారు.
అయితే ఇదంతా ప్రాంక్ చేస్తున్నామని బిగ్ బాస్‍కు శివాజీ తెలిపాడు. ఏం కంగారు పడకు. ఇదంతా ప్రాంక్ అని మైక్‍లో శివాజీ చెప్పాడు. షకీలాతో హీరో శివాజీ చేసిన పనికి హౌజ్ దాదాపు నిద్ర లేకుండా ఉన్నారు. ఇక శోభాకు శివాజీ, దామినికి షకీల అసలు విషయం చెప్పింది. అలా చేయకూడదు అని దామిని అంది. ఆమెకు సపోర్టుగా కిరణ్ రాథోడ్ ఉంది. మొత్తానికి శివాజీ ప్రాంక్, షకీల పర్ఫామెన్సుతో హౌజ్ అంతా బెదిరిపోయారు.