Bigg Boss 7 Telugu: హౌజ్‌లో సింగర్ వికృత చేష్టలు.. బుగ్గలు పట్టుకోవడంతో ఏడ్చేసిన సీరియల్ నటి
13 October 2023, 8:33 IST
Bigg Boss 7 Telugu Singer Bhole: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్లో ముందుగా ఎంట్రీ ఇచ్చిన 14 మందిలో సింగర్ దామిని వచ్చి ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. గ్రాండ్ లాంచ్‌లో మరొకరు సింగర్ భోలే షావలి అడుగు పెట్టాడు. అయితే, ఆయన హౌజ్‌లో ప్రవర్తించే తీరు వికృతంగా ఉంది.
బిగ్ బాస్ 7 తెలుగు అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్ హైలెట్స్
Bigg Boss 7 Telugu Day 39 Highlights: తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ 2.0 అంటూ మరింత జోరుగా మొదలు అయింది. ముందుగా సెప్టెంబర్ 3న ప్రారంభమైన ఈ హౌజ్‌లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారి నుంచి ఒక్కోవారం కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక, శుభ శ్రీ రాయగురు వరుసగా ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. అయితే బ్యూటిఫుల్ శుభ శ్రీ ఎలిమినేషన్ రోజునే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరొ ఐదుగురు హౌజ్‌లోకి అడుగుపెట్టారు.
పాలు అవసరం లేదు
బిగ్ బాస్ 7 తెలుగు 2.0లోకి అంబటి అర్జున్, నయని పావని, పూజా మూర్తి, అశ్విని శ్రీతోపాటు సింగర్ భోలే షావలి అడుగుపెట్టారు. పాట బిడ్డగా పరిచయం చేసుకుని ఎంట్రీ ఇచ్చిన భోలే హౌజ్‌లో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అశ్వినితో పులిహార కలపడం మొదలు పెట్టాడు. ఆమె చాలా బాగుందని, పాల బుగ్గలు చూస్తే.. ఉదయం పాలు అవసరం లేదని, ఆకలి వేస్తే ఆమెను చూస్తే చాలు అంటూ నానా రచ్చ చేశాడు. అలాగే నయని పావనితో కూడా కాస్తా అటు ఇటుగా బిహేవ్ చేశాడు.
మిస్టేక్ చేశారంటూ
ఇక అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్లో అయితే మరింత హద్దు దాటాడు. హౌజ్‌లో ఎవరు స్మార్టెస్ట్ అని టాస్క్ నిర్వహించారు. అందులో సినిమాకు సంబంధించి డైలాగ్స్, సాంగ్స్ ప్లే చేస్తుంటే గెస్ చేసి వాటి ఫొటోలోను స్టిక్ చేయాలి. ఈ టాస్క్ జరుగుతుండగా.. ఆటగాళ్లు టీమ్ మిస్టేక్ చేశారంటూ పోటుగాళ్లు టీమ్ అయిన పూజా మూర్తి (గుండమ్మ కథ సీరియల్ నటి) బిగ్ బాస్ కు మైక్‌లో చెప్పింది. ఆమె పక్కనే కూర్చున్న సరదాగా చేస్తున్నారు. పర్లేదు అని భోలే అన్నాడు.
గొడవ అనుకున్నావ్
ఇది బిగ్ బాస్ షో అండి. పర్లేదు ఏంటీ. నేను జస్ట్ బిగ్ బాస్ కి చెబుతున్నాను అని పూజా అంది. ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావ్ అని భోలే అన్నాడు. నేను గొడవ పెట్టుకోవడం ఏంటండి అని పక్కనుంచి వెళ్లిపోయింది. పూజాను ఇమిటేట్ చేస్తూ ఆమె గొంతులాగా మాట్లాడాడు భోలే. అతని పక్కకు గౌతమ్ వచ్చి కూర్చుని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. టాస్క్ జరిగిన తర్వాత నేను జస్ట్ మాట్లాడుతున్నాను. గొడవ అనుకున్నావ్. ఇక్కడికి మంచిగా వచ్చాం. మంచిగా వెళ్లాలి అనేదే నా గోల్ అని పూజాతో భోలే చెప్పాడు.
భుజాలపై చేయి వేసి
పూజా సైలెంట్‌గా వింటూ ఉంది. భోలే మాట్లాడుతూనే సడెన్‌గా పూజా బుగ్గలు పట్టుకుని ఏం కాదురా.. అంటూ వెళ్లిపోయాడు. దానికి కాస్తా పూజా ఫీల్ అయింది. అక్కడే ఉన్న నయనిని చూసి ఏడవడం మొదలుపెట్టింది. పూజా ఏడవడం చూసిన భోలే.. ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ ఆమె భుజాలపై చేయి వేశాడు. దీంతో ఆమె అసౌకర్యకరంగా ఫీల్ అయింది. ఏం కాలేదు.. బాగానే ఉందంటూ నయని అతన్ని పంపించేందుకు ప్రయత్నం చేసింది. ఇలా ఎదుటి వాళ్ల ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా భోలే ఇష్టమొచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నాడు.