Bigg Boss 7 Telugu Nominations : అమర్‍దీప్‍పై పోటుగాళ్ల దండయాత్ర.. పిల్లాడిని పంపించేస్తారా ఏంటి?
10 October 2023, 7:14 IST
- Bigg Boss 7 Telugu Nominations : సోమవారం అయితే బిగ్ బాస్ హౌస్‍లో నామినేషన్స్ భయం పట్టుకుంటుంది. తాజా ఎపిసోడ్‍లో అదే జరిగింది. అయితే ఎక్కువ మంది అమర్‍దీప్‍ను టార్గెట్ చేశారు.
అమర్‍దీప్
బిగ్ బాస్ హౌస్‍ను రెండు గ్రూపులుగా చేశారు. కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు పోటుగాళ్లు, పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లు అంటూ డివైడ్ చేశాడు బిగ్ బాస్. నామినేషన్స్ లోనూ ఇదే స్ట్రాటజీతో ఆట మెుదలుపెట్టాడు. ముందుగా పోటుగాళ్లను ఆటగాళ్లలో ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పాడు. దీంతో ఆట రసవత్తరంగా మారింది. ఆటగాళ్ల ఆటను ఐదు వారాలను చూసి వచ్చారని, వారిలో హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు ఎవరు అర్హులో చెప్పాలని, నామినేట్ చేసే వారి ముఖం మీద ఎక్స్ మార్క్ వేయాలని ఆదేశించాడు బిగ్ బాస్.
ఈసారి నామినేషన్స్ లో అమర్‍దీప్ మీద పోటుగాళ్లు దండయాత్ర చేశారు. అంతేకాదు.. ఆటగాళ్ల నుంచి కూడా అమర్‍దీప్‍ను నామినేట్ చేశారు. మెుత్తం ఈ వారం అతడికి 7 ఓట్లు పడ్డాయి. చాలా మంది అమర్‍దీప్ ఆట సరిగా లేదని, ఏం ఆడుతున్నావో తెలియదనే చెప్పారు. దీంతో అమర్‍దీప్ మళ్లీ అదే అమాయకమైన ముఖం పెట్టి.. నేనేం చేశానని అడిగాడు. అసలు హౌస్‍లో ఏం చేయలేదన్నట్టుగా కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు. చూసే జనాలకు పిల్లాడిని పంపించేస్తారా ఏంటి అనిపించేలా ఉంది.
కొత్తగా వచ్చిన అంబటి అర్జున్ నామినేషన్స్ లో అమర్‍దీప్‍కు ఓటు వేసి.. కొన్ని బలమైన కారణాలు చెప్పాడు. అవి ప్రేక్షకులు కూడా కన్విన్స్ అయ్యేలా ఉన్నాయి. ఎక్కడైనా అపార్థం చేసుకోవడం మెుదలుపెడితే.. అర్థం చేసుకోవడం మానేస్తారని క్లారిటీ ఇచ్చాడు. మెుదట సందీప్‍ను నామినేట్ చేశాడు. సంచాలక్‍గా ఉండి అన్ని రూల్స్ తెలిసి నువ్వే బ్రేక్ చేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడు అంబటి అర్జున్. అందుకోసమే ఈ వారం నువ్ నామినేషన్స్ లో ఉండాలని చెప్పేశాడు. సందీప్ కూడా యాక్సెప్ట్ చేశాడు.
రెండో నామినేషన్ అమర్ అని చెబుతూ.. తాను చాలా డిజప్పాయింట్ అయ్యానని తెలిపాడు. గేమ్ ఆడుతున్నావని నువ్ అనుకుంటున్నావ్, నీకు టాస్క్ అర్థం చేసుకోవడం రావట్లేదని చెప్పాడు. ఎవరైనా చెబితే నువ్ సరిగా అర్థం చేసుకోవడం లేదని వివరించాడు అర్జున్. సొంతంగా ఆలోచించడం లేదని అన్నాడు. టాస్కులో నువ్ అగ్రెషన్ అని.. అనుకుంటున్నావ్ కానీ.. అసలు మాట్లాడేది సంబంధమే లేదంటూ క్లాస్ పీకాడు. ఎవరైనా ఏదైనా చెబితే.. ఇక తర్వాత చూడండి.. తినేస్తా, పొడిచేస్తా, ఇరగదీస్తా అంటున్నావ్ అని, కానీ చేసేదేమీ లేదని అన్నాడు అర్జున్.
ప్రతీ వారం ఒక్కో మెట్టు పైకి ఎక్కాలని మేం కోరుకుంటే.. నువ్ మాత్రం.. ఇంకొక మెట్టు కిందకే వస్తున్నావని చెప్పుకొచ్చాడు. ఎవరిని నామినేట్ చేయాలో సరైన పాయింట్ తీస్తున్నావ్ కానీ, ఎందుకు నామినేట్ చేస్తున్నావో సరైన కారణం చెప్పడం లేదని వివరించాడు అంబటి అర్జున్. ఒక్కటి కూడా సరిగా ఆడలేదని చెప్పాడు. ఒకవేళ నువ్ నామినేట్ అయి వెళ్లిపోతే.. నువ్ చేసింది చూసి.. రియలైజ్ అవ్వమని తెలిపాడు. చెప్పేది సరిగా అర్థం చేసుకోమని అమర్‍దీప్‍కు హితబోధ చేశాడు అర్జున్.