తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu: ఫైనల్ రేస్ నుంచి ఐదుగురు ఔట్.. అతడికే ఫినాలే ఆస్త్ర.. టాప్ కంటెస్టెంట్‌కు తగ్గుతున్న గ్రాఫ్

Bigg Boss Telugu: ఫైనల్ రేస్ నుంచి ఐదుగురు ఔట్.. అతడికే ఫినాలే ఆస్త్ర.. టాప్ కంటెస్టెంట్‌కు తగ్గుతున్న గ్రాఫ్

Sanjiv Kumar HT Telugu

01 December 2023, 6:05 IST

google News
  • Bigg Boss Telugu Ticket To Finale: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ రేస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ ఔట్ అయ్యారు. దీంతో ఫినాలే ఆస్త్ర చేజిక్కుంచుకునేందుకు ముగ్గురు పోటీ పడుతున్నారు.

బిగ్ బాస్ 7 తెలుగు టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఐదుగురు ఔట్.. అతడికే ఫినాలే ఆస్త్ర.. టాప్ కంటెస్టెంట్‌కు తగ్గుతున్న గ్రాఫ్
బిగ్ బాస్ 7 తెలుగు టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఐదుగురు ఔట్.. అతడికే ఫినాలే ఆస్త్ర.. టాప్ కంటెస్టెంట్‌కు తగ్గుతున్న గ్రాఫ్

బిగ్ బాస్ 7 తెలుగు టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఐదుగురు ఔట్.. అతడికే ఫినాలే ఆస్త్ర.. టాప్ కంటెస్టెంట్‌కు తగ్గుతున్న గ్రాఫ్

Bigg Boss 7 Telugu Finale Astra Winner: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో ప్రస్తుతం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో 13వ వారం నామినేషన్లలో అమర్ దీప్ తప్పా మిగతా వారంతా నామినేట్ అయ్యారు. ఇక నామినేషన్ల తర్వాత పెద్దయ్య హౌజ్ మేట్స్‌కి టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చాడు. ఇందులో గేమ్స్ ఆడి గెలిచినవారు నేరుగా ఫైనల్‌లోకి వెళ్తారు.

టికెట్ టు ఫినాలే టాస్క్‌కు ఫినాలే ఆస్త్ర అని పేరు పెట్టారు. ఈ ఫినాలే ఆస్త్ర టాస్క్‌లో భాగంగా టిక్ టిక్ టిక్, ఎత్తరజెండా, గెస్ చేయ్, ముట్టుకో కనిపెట్టు, తప్పించుకో రాజా వంటి అనేక గేమ్స్ ఆడారు హౌజ్ మేట్స్. ఈ టాస్క్‌ల్లో మొదట శివాజీ, శోభా శెట్టి ఔట్ అయ్యారు. వారి ఇద్దరి పాయింట్స్ అమర్ దీప్‌కు ఇచ్చారు. అనంతరం తక్కువ పాయింట్స్ కారణంగా ప్రియాంక ఔట్ అయింది. ఆమె తన పాయింట్లను గౌతమ్‌కి ఇచ్చింది.

ప్రియాంక తర్వాత ప్రిన్స్ యావర్ ఔట్ అయ్యాడు. తప్పించుకో రాజా గేమ్ తర్వాత అతని పాయింట్స్ చూసుకుంటే మిగతా నలుగురి కంటే తక్కువ ఉన్నాయి. దీంతో అతను ఔట్ అయిపోయాడు. ప్రిన్స్ యావర్ తన పాయింట్లను ప్రశాంత్‌కి ఇచ్చాడు. దీంతో ప్రశాంత్ రెండో స్థానంలోకి వచ్చాడు. అయితే, టాస్కుల్లో అద్భుతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ప్రిన్స్ యావర్ గ్రాఫ్ రోజురోజుకీ తగ్గుతోంది.

రతిక రీ ఎంట్రీ తర్వాత టాప్ కంటెస్టెంట్‌ అయిన యావర్ గేమ్‌లో తేడా వచ్చింది. ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత కూడా ప్రిన్స్ యావర్ గేమ్‌లో మార్పు రాలేదు. దీంతో టాప్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ గ్రాఫ్ తగ్గుతోంది. యావర్ తర్వాత గౌతమ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. ఇక టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ఐదుగురు ఔట్ అయ్యారు. ప్రస్తుతం ఫినాలే ఆస్త్ర కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు.

ఇప్పటివరకు ప్రశాంత్ నాలుగు టాస్క్‌లు గెలిచి 720 పాయింట్లతో లీడింగ్‌లో ఉన్నాడు. మూడు టాస్కులు గెలిచిన అర్జున్ 710 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 2 టాస్క్‌లు విన్ అయి 680 పాయింట్లతో మూడో స్థానంలో అమర్ ఉన్నాడు. ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న అమర్ ఫినాలే అస్త్ర గెలుస్తాడని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా టాప్ ప్లేస్‌కు వెళ్లిన ప్రశాంత్‌కు ఫినాలే అస్త్ర దక్కి టికెట్ టు ఫినాలే గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం