తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu Winner: బిగ్ బాస్ విన్నర్‌పై షాకింగ్ ట్విస్ట్.. ఆరుగురు నామినేట్.. అర్జున్ పరిస్థితి ఏంటంటే?

Bigg Boss Telugu Winner: బిగ్ బాస్ విన్నర్‌పై షాకింగ్ ట్విస్ట్.. ఆరుగురు నామినేట్.. అర్జున్ పరిస్థితి ఏంటంటే?

Sanjiv Kumar HT Telugu

05 December 2023, 8:52 IST

google News
  • Bigg Boss 7 Telugu Winner Voting: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ చివరి అంకానికి వచ్చేసింది. హౌజ్‌లో ఆఖరి నామినేషన్స్ అంటే 14వ వారం నామినేషన్స్ జరిగాయి. అందులో ఆరుగురు నామినేట్ కాగా.. బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విన్నర్ విషయంలో సూపర్ ట్విస్ట్ ఇచ్చారు.

బిగ్ బాస్ 7 తెలుగు 14వ వారం నామినేషన్లలో ఆరుగురు.. బిగ్ బాస్ విన్నర్‌పై సూపర్ ట్విస్ట్
బిగ్ బాస్ 7 తెలుగు 14వ వారం నామినేషన్లలో ఆరుగురు.. బిగ్ బాస్ విన్నర్‌పై సూపర్ ట్విస్ట్

బిగ్ బాస్ 7 తెలుగు 14వ వారం నామినేషన్లలో ఆరుగురు.. బిగ్ బాస్ విన్నర్‌పై సూపర్ ట్విస్ట్

Bigg Boss 7 Telugu 14th Week Nominations: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. మహా అయితే మరో రెండు వారాల పాటు సీజన్ కొనసాగనుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఏడుగురు ఉన్నారు. 13వ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ కాగా హౌజ్‌లో స్పై గ్రూప్ శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, స్పా గ్రూప్ శోభా శెట్టి, ప్రియాంక, అమర్ దీప్‌తో పాటు అర్జున్ అంబటి ఉన్నారు. వీరికి నామినేషన్స్ నిర్వహించారు.

కంట్రోల్ చేసేందుకు

బిగ్ బాస్ 7 తెలుగు 14వ వారం నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. శోభా, ప్రియాంకతో యావర్ గొడవ పెట్టుకోగా.. అర్జున్ ప్రిన్స్ మధ్య వాగ్వాదం పీక్స్‌లోకి వెళ్లింది. ఇక అమర్, ప్రశాంత్ మధ్య ఘోరంగా గొడవ జరిగింది. ఇద్దరూ ఏమాత్రం తగ్గలేదు. యావర్‌ను అమర్ నామినేట్ చేసే సమయంలో కూడా ప్రశాంత్ గొడవకు దిగాడు. శివాజా చాలా వరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. అయినా వారి మధ్య గొడవ జరుగుతూనే వచ్చింది.

టైటిల్ విన్నర్

అలా హోరా హోరీగా జరిగిన చివరి నామినేషన్లలో ఆరుగురు శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంక, అమర్ దీప్‌ నామినేట్ అయ్యారు. టికెట్ ఫినాలేలో భాగంగా ఫినాలే ఆస్త్రను గెలిచిన అర్జున్ అంబటి మాత్రం నామినేషన్లలో లేడు. అతన్ని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదని బిగ్ బాస్ చెప్పాడు. నామినేషన్ తర్వాత బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరు అనేది తెలిసేందుకు ఈవారం నుంచే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవుతాయని అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు పెద్దయ్య.

టాప్‌లో ఐదుగురు

అంటే, ఈ వారం ఎలిమినేషన్ కోసం ఓటింగ్ పోల్స్ కాకుండా నేరుగా టైటిల్ విన్నర్ కోసం ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు వారాలు ఈ ఓటింగ్ జరుగుతుంది. అందులో ఇతరులకంటే తక్కువ ఓట్స్ వచ్చినవారు 14వ వారం ఎలిమినేట్ అవుతారు. అనంతరం మిడ్ వీక్‌లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. దాంతో 16వ వారానికి ఐదుగురు సభ్యులు టాప్ 5లో ఉంటారు.

అడ్డుకట్ట వేసేందుకు

ఈ రెండు వారాల్లో అత్యధికంగా ఓట్స్ సాధించిన కంటెస్టెంట్ బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విన్నర్ అవుతారు. అయితే, పీఆర్ ద్వారా కంటెస్టెంట్స్ ఎక్కువ ఓట్స్ తెచ్చుకునే అవకాశం ఉండటంతో దానికి అడ్డు కట్ట వేసేందుకు ఈవారం నుంచే విన్నర్ ఓటింగ్ పోల్ స్టార్ట్ చేసి నిర్వాహకులు సూపర్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ విన్నర్ ఓటింగ్ పోల్‌లో అర్జున్ అంబటి పేరు కూడా ఉంది. 14వ వారం మాత్రం అతనికి తక్కువ ఓట్స్ వచ్చిన ఎలిమినేట్ కాడు. కానీ, ఆ తర్వాతి వారం మాత్రం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం