తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Elimination: ఓటింగ్‌లో వెనుకపడ్డ శివాజీ.. అతనికంటే తక్కువగా.. ఈవారం స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ ఎలిమినేట్

Bigg Boss Elimination: ఓటింగ్‌లో వెనుకపడ్డ శివాజీ.. అతనికంటే తక్కువగా.. ఈవారం స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ ఎలిమినేట్

Sanjiv Kumar HT Telugu

02 December 2023, 8:44 IST

google News
  • Bigg Boss 7 Telugu Elimination: బిగ్ బాస్ 7 తెలుగు 13వ వారం ఓటింగ్‌‌లో టాప్ ప్లేస్‌లో పెద్దగా మార్పులు లేకున్నా ఎలిమినేషన్ విషయంలో ఊహించనివి జరిగే అవకాశం ఉంది. ఈవారం ఆ స్ట్రాంగ్ ప్లేయర్స్‌లో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

బిగ్ బాస్ తెలుగు ఎలిమినేషన్: శివాజీని దాటేసిన ఆ కంటెస్టెంట్.. ఈవారం అతనే ఎలిమినేట్.. కానీ!
బిగ్ బాస్ తెలుగు ఎలిమినేషన్: శివాజీని దాటేసిన ఆ కంటెస్టెంట్.. ఈవారం అతనే ఎలిమినేట్.. కానీ!

బిగ్ బాస్ తెలుగు ఎలిమినేషన్: శివాజీని దాటేసిన ఆ కంటెస్టెంట్.. ఈవారం అతనే ఎలిమినేట్.. కానీ!

Bigg Boss 7 Telugu 13th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఎనిమిది ఇంటి సభ్యులు ఉన్నారు. వారిలో 13వ వారం అమర్ దీప్ చౌదరి తప్పా మిగతా కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్‌లో ఉన్నారు. దీంతో సోమవారం రాత్రి నుంచే వీరికి ఓటింగ్ పోల్ నిర్వహించడం మొదలైంది.

బిగ్ బాస్ 7 తెలుగు 13వ వారం నామినేషన్స్‌లలో పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, శోభా శెట్టి, గౌతమ్, ప్రిన్స్ యావర్ ఏడుగురు ఉన్నారు. వీరిలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ 27.66 శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. 2.43 శాతం ఓటింగ్‌తో హీరో శివాజీ రెండో స్థానంలో నిలిచాడు. దీంతో ఓటింగ్‌లో శివాజీని రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ దాటేసి ముందంజంలో దూసుకుపోతున్నాడు.

ఇక స్పై బ్యాచ్‌లోని ప్రిన్స్ యావర్ 13.1 శాతంతో మూడో స్థానంలో నిలిచాడు. 11.92 శాతంతో గౌతమ్ నాలుగు, 10.05 శాతంతో అర్జున్ ఐదు, 7.9 శాతంతో ప్రియాంక ఆరు, 6.93 శాతం ఓట్లతో శోభా శెట్టి ఏడో స్థానంలో ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. కానీ, నిజానికి డేంజర్ జోన్‌లో అర్జున్ అండ్ గౌతమ్ ఉన్నారు. ఒకవేళ శోభా శెట్టి డేంజర్ జోన్‌లో ఉన్నా.. ఆమెను బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడు.

అలాగే బిగ్ బాస్ అధికారిక ఓటింగ్‌‌లో గౌతమ్, అర్జున్ చివరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఎలా చూసుకున్న అర్జున్, గౌతమ్ ఓటింగ్ ఎలా ఉన్నా డేంజర్ జోన్‌లో ఉండేది వీరిద్దరే. ఇందులో అర్జున్‌కు టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనల్స్‌కి చేరుకున్నాడు. ఈ ఇద్దరిలో ఎలిమినేషన్ ప్రాసెస్ జరగనుంది. కానీ, ఇక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వనున్నాడు. ఈ ఇద్దరిలో ఒకరి కోసం ప్రీ ఎవిక్షన్ పాస్ ఉపయోగించాలని ప్రశాంత్‌కు చెబుతాడు.

టికెట్ టు ఫినాలే గెలిచిన అర్జున్‌కు ఆ పాస్‌ను ప్రశాంత్ ఉపయోగించే అవకాశం ఉంది. శివాజీతో గౌతమ్ ఎప్పుడు గొడవ పడటం కారణంగా అతనికి ఉపయోగించకపోవచ్చు. అలా బిగ్ బాస్ 13వ వారం స్ట్రాంగ్ ప్లేయర్ అయినా గౌతమ్ ఎలిమినేట్ కాకా తప్పేలా లేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం