తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Voting: ఈవారం దిమ్మతిరిగేలా ఓటింగ్.. దిగజారిన హీరో శివాజీ.. ఆ ఇద్దరు ఎలిమినేట్ పక్కా!

Bigg Boss Voting: ఈవారం దిమ్మతిరిగేలా ఓటింగ్.. దిగజారిన హీరో శివాజీ.. ఆ ఇద్దరు ఎలిమినేట్ పక్కా!

Sanjiv Kumar HT Telugu

23 November 2023, 8:11 IST

google News
  • Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ 7 తెలుగు 12వ వారం ఓటింగ్‌ దిమ్మ తిరిగిలే ఉంది. టాప్‌లో వచ్చే హీరో శివాజీ అనూహ్యంగా దిగజారిపోయాడు. అతన్ని మించి ఇద్దరు టాప్‌లో ఉండగా.. ఈవారం కచ్చితంగా మరో ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు.

ఈవారం దిమ్మతిరిగేలా ఓటింగ్.. దిగజారిన హీరో శివాజీ.. ఆ ఇద్దరు ఎలిమినేట్ పక్కా!
ఈవారం దిమ్మతిరిగేలా ఓటింగ్.. దిగజారిన హీరో శివాజీ.. ఆ ఇద్దరు ఎలిమినేట్ పక్కా!

ఈవారం దిమ్మతిరిగేలా ఓటింగ్.. దిగజారిన హీరో శివాజీ.. ఆ ఇద్దరు ఎలిమినేట్ పక్కా!

Bigg Boss 7 Telugu 12th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో 12వ వారం నామినేషన్లలో శివాజీ, రతిక, యావర్, పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటి, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, అశ్విని ఇలా 8 మంది ఉన్నారు. కెప్టెన్ ప్రియాంక, ఎవరు నామినేట్ చేయకపోవడంతో శోభా శెట్టి నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు.

ఇక నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్స్‌కి మంగళవారం నుంచి ఓటింగ్ నిర్వహించారు. అయితే, ఈవారం ఓటింగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఓటింగ్‌లో ఎప్పుడు టాప్‌లో వచ్చే హీరో శివాజీ ఈసారి మాత్రం అనూహ్యంగా మూడో ప్లేస్‌కు దిగజారిపోయాడు. బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన లీక్ ప్రకారం హీరో శివాజీ మూడో స్థానంలో ఉన్నాడు. అతనికంటే ముందు వరుసలో అమర్ దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్ ఉన్నారు.

అంటే, బిగ్ బాస్ 7 తెలుగు 12వ వారం ఓటింగ్‌లో మొదటి స్థానంలో అమర్ దీప్ ఉంటే రెండో స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. ఇక ఈసారి మూడో స్థానంతో శివాజీ సరిపెట్టుకున్నాడు. ఇక నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్, ఐదో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఆరో స్థానంలో అర్జున్ అంబటి ఉన్నట్లు సమాచారం. ఇక చివరి రెండు స్థానాల్లో రతిక రోజ్, అశ్విని శ్రీ ఉన్నారు.

రతిక రోజ్ ఏడో స్థానంలో ఉంటే.. సెల్ఫ్ నామినేట్ చేసుకున్న అశ్విని శ్రీ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. అంటే, ఇప్పటికీ వీరిద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుదని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. 11వ వారం ఎవరినీ ఎలిమినేట్ చేయని కారణంగా 12వ వారం మాత్రం కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే.. రతిక, అశ్విని ఎలిమినేట్ కావడం పక్కా అని సమాచారం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం