Bigg Boss 6 Telugu 75th Episode: రెండోసారి కెప్టెన్ అయిన రేవంత్ - ఇనాయా కల తీరలేదు
18 November 2022, 8:41 IST
Bigg Boss 6 Telugu 75th Episode: బిగ్‌బాస్ సీజన్ 6లో రెండోసారి కెప్టెన్ అయిన ఫస్ట్ హౌజ్‌మేట్‌గా రేవంత్ నిలిచాడు. గురువారం జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో అతడు విజయం సాధించాడు. శ్రీహాన్ సపోర్ట్‌తో గెలిచాడు.
రేవంత్
బిగ్‌బాస్ సీజన్ 6లో రెండోసారి కెప్టెన్‌గా రేవంత్ ఎంపికయ్యాడు. కెప్టెన్సీ టాస్క్ అనేక మలుపులు తిరుగుతూ సాగింది. ఈ టాస్క్‌లో రేవంత్ విజయాన్ని సాధించి మరోసారి కెప్టెన్ బాధ్యతల్ని చేపట్టాడు. నవంబర్ 29న తమ వెడ్డింగ్ యానివర్సరీని హౌజ్‌లో జరుపుకోవాలని ఉందని మరీనా బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్ చేసింది. తాము లవ్‌బర్డ్స్‌మని, విడదీయవద్దని కోరింది
కెప్టెన్సీ పోటీదారుల కోసం కెప్టెన్సీ ఈజ్ యువర్ గోల్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో ఆదిరెడ్డి, రోహిత్, రేవంత్, శ్రీహాన్‌తో పాటు ఇనాయా పోటీపడ్డారు. గేమ్ ఆడటానికి వెళ్లేముందు రేవంత్ చెవిలో గుసగుసగా శ్రీసత్య ఏదో చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది. ఆ తర్వాత గేమ్ ఎలా ఆడాలో రేవంత్‌కు సలహాలు ఇచ్చింది శ్రీసత్య. ఈ గేమ్‌కు ఫైమా సంచాలక్‌గా వ్యవహరించింది.
రోహిత్ ఔట్
ఈ గేమ్‌లో తొలుత రోహిత్ ఔటయ్యాడు. శ్రీహాన్, రేవంత్ కలిసికట్టుగా గేమ్ ఆడి ఆదిరెడ్డిని టార్గెట్ చేశారు. అయినా ఆదిరెడ్డి వారికి గట్టిపోటీ ఇచ్చాడు. ఆదిరెడ్డిని శ్రీహాన్ గట్టిగా పట్టుకోవడంతో బాల్‌ను రేవంత్ గోల్‌గా మలిచాడు. కానీ బాల్ గాల్లో నుంచి రావడంతో ఆదిరెడ్డి ఔట్ కాలేదు. ఇద్దరు కలిసి ఆడటంపై ఆదిరెడ్డి ఫైర్ అయ్యాడు. రోహిత్ రూల్స్ మార్చడంపై శ్రీహాన్, రేవంత్ సీరియస్ అయ్యారు.
ఏకాభిప్రాయంతో బలి
సెకండ్ రౌండ్‌లో ఎవరూ ఔట్ కాకపోవడంతో ఏకాభిప్రాయంతో ఔట్ అయ్యే సభ్యుడు ఎవరో తేల్చుకోమని సభ్యులను బిగ్‌బాస్ కోరాడు. ఆదిరెడ్డి గేమ్ నుంచి వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్లు శ్రీహాన్, రేవంత్ అన్నారు. అదిరెడ్డి...రేవంత్ పేరుచెప్పాడు. ఇనాయా .. శ్రీహాన్ పేరు చెప్పింది. తాను గేమ్ నుంచి వెళ్లిపోతే ఇనాయాపై ఈజీగా గెలవాలని రేవంత్, శ్రీహాన్ ప్లాన్ చేసుకున్నట్లుగా ఆదిరెడ్డి ఆరోపించాడు. రెండు ఓట్లు వచ్చిన ఆదిరెడ్డి గేమ్ నుంచి ఔటయ్యాడు.
రేవంత్ మాస్టర్ ప్లాన్...
ఈ గేమ్‌లో చివరి వరకు రేవంత్, శ్రీహాన్‌లకు ఇనాయా గట్టిపోటీ ఇచ్చింది. అగ్రెసివ్‌గా ఆడిన రేవంత్ ఆమెను ఔట్ చేశాడు. కెప్టెన్‌కావాలనే కల మరోసారి తీరకపోవడంతో ఇనాయా కన్నీళ్లు పెట్టుకున్నది. బెడ్ రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేసింది.
చివరకు ఈ గేమ్‌లో రేవంత్ విజేతగా నిలిచి మరోసారి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తాను గెలవగానే శ్రీహాన్‌కు సారీ చెప్పాడు. ఇద్దరిలో ఎవరు గెలిచిన హ్యాపీనే అంటూ శ్రీహాన్ అన్నాడు. రెండోసారి కెప్టెన్ కావడంతోనే రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ఇనాయాకు దగ్గరకు వెళ్లి సారీ చెప్పాడు ఇనాయా. ఆమె తోసేయడం తప్పు అని ఒప్పుకున్నాడు.