తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhakshak Ott: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. విలన్‌గా సీఐడీ యాక్టర్.. బాలికలపై లైంగిక వేధింపులతో భక్షక్

Bhakshak OTT: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. విలన్‌గా సీఐడీ యాక్టర్.. బాలికలపై లైంగిక వేధింపులతో భక్షక్

Sanjiv Kumar HT Telugu

31 January 2024, 13:57 IST

  • OTT Movie Bhakshak Trailer: బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ భూమి పెడ్నెకర్ నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ మూవీ భక్షక్. తాజాగా బుధవారం (జనవరి 31) భక్షక్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో సీఐడీ సీరియల్‌లో పోలీస్ ఆఫీసర్‌గా పాపులర్ అయిన ఆదిత్య శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. విలన్‌గా సీఐడీ యాక్టర్.. బాలికలపై లైంగిక వేధింపులతో భక్షక్
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. విలన్‌గా సీఐడీ యాక్టర్.. బాలికలపై లైంగిక వేధింపులతో భక్షక్

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్.. విలన్‌గా సీఐడీ యాక్టర్.. బాలికలపై లైంగిక వేధింపులతో భక్షక్

Bhumi Pednekar Bhakshak Trailer: బాలీవుడ్ ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన కొత్త సినిమా భక్షక్. ఇన్వెస్టిగేటివ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన భక్షక్ సినిమాను పులకిత్ తెరకెక్కించారు. భక్షక్ సినిమాను బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై భక్షక్ సినిమాను గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ నిర్మించారు. దీంతో భక్షక్ సినిమాపై హిందీ చిత్ర పరిశ్రమలో మంచి బజ్ క్రియేట్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Hari Om OTT: దేశంలోనే తొలి భక్తి ఓటీటీ హరి ఓం.. ప్రారంభిస్తున్న అడల్ట్ కంటెంట్ ఓటీటీ ఉల్లు.. పాపం నుంచి పుణ్యం!

Eesha Rebba: ఆ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నన్ను హీరోయిన్ అని చెప్పి మోసం చేశారు: ఈషా రెబ్బ

Madgaon Express OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Yuvaraj OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన కాంతార‌ హీరోయిన్ యాక్ష‌న్ డ్రామా మూవీ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

భక్షక్ చిత్రంలో భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంటే.. ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమ్‌హంకర్, రాజ్‌పాల్ యాదవ్, సూర్య శర్మ, సంజయ్ మిశ్రా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. వీరిలో ఆదిత్య శ్రీవాస్తవ హిందీ టీవీ షోలలో సూపర్ సక్సెస్ అయిన సీఐడీలో కీలక పాత్ర పోషించారు. సీఐడీ సీరియల్‌లో అభిజీత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర చాలా మందికి ఫెవరెట్‌గా ఉంటుంది. ఆ అభిజీత్ పాత్రను ఆదిత్య శ్రీవాస్తవ భక్షక్ మూవీలో విలన్‌గా చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా బుధవారం (జనవరి 31) భక్షక్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేశారు. "ఇది అందరికీ చెప్పాల్సిన కథ. భక్షక్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు" అని షారుక్ ఖాన్ ట్రైలర్ వీడియో షేర్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చారు. భక్షక్ ట్రైలర్ విషయానికొస్తే.. వసతి గృహాల్లో ఉండే అనాధ బాలికలు, అమ్మాయిలు అత్యాచారానికి గురవుతుంటారు. ఈ మాఫియాను అక్కడున్న లోకల్ రౌడీ బన్సీ సాహు (ఆదిత్య శ్రీవాస్తవ) నడిపిస్తుంటాడు.

ఈ మాఫియాను బయటపెట్టే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వైశాలి పాత్రలో భూమి పెడ్నేకర్ నటించింది. బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారం, నేరాలను వైశాలి ఎలా గుర్తించింది? ఎలాంటి ఆధారాలతో మీడియా ముందు ప్రవేశపెట్టింది? ఆమెకు ఎవరెవరు సహాయం చేశారు? ఈ క్రమంలో వైశాలి ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటీ? వైశాలిని బన్సీ సాహు ఏం చేయాలనుకున్నాడు? వంటి విషయాలతో సినిమా ఉత్కంఠంగా ఉండనుందని భక్షక్ ట్రైలర్ ద్వారా చూపించారు.

భక్షక్ ట్రైలర్‌లో విలన్‌గా ఆదిత్య శ్రీవాస్తవ పర్ఫామెన్స్ చాలా బాగుంది. పాత్రకు పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యాడు. సీఐడీ పలు సీరియళ్లలో పాజిటివ్ క్యారెక్టర్స్ చేసిన ఆదిత్య ఇందులో బాలికలతో వ్యాపారం చేసే బన్సీ సాహుగా నటనతో ఆకట్టునేలా ఉన్నాడని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక జర్నలిస్టుగా భూమి కూడా చాలా బాగా చేసింది. ట్రైలర్ కట్ సీన్స్ బాగున్నాయి. డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. "ఇతరులు కష్టాల్లో ఉంటే బాధపడని వాళ్లు మనుషులు ఎలా అవుతారు. భక్షక్‌లు అవుతారు" అంటూ ట్రైలర్ చివరిలో భూమి చెప్పే డైలాగ్ హైలెట్‌గా నిలిచింది.

ఇన్వెస్టిగేటివ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన భక్షక్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. భక్షక్ గ్రిప్పింగ్ సీన్స్, ఆకట్టుకునే టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లేతో అలరించనుందని తెలుస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం