తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Independence Day Special: దేశభక్తిని చాటిచెప్పే తెలుగు సినిమాలు ఇవే

independence day special: దేశభక్తిని చాటిచెప్పే తెలుగు సినిమాలు ఇవే

HT Telugu Desk HT Telugu

15 August 2022, 7:30 IST

google News
  • దేశభక్తి ప్రధాన కథాంశాలతో(Patriotic movies) తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ వరకు పలువురు స్టార్స్ సినిమాలు చేశారు. ఆ సినిమాలు ఏవంటే...

అడివిశేష్
అడివిశేష్ (twitter)

అడివిశేష్

దేశభక్తి ప్రధాన కథాంశాల పట్ల ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ ఆసక్తి ఉంటుంది. ఈ సినిమాలకు భాషాభేదాలు, మాస్, క్లాస్ విభజనలతో సంబంధం ఉండదు. దేశభక్తి అనే ఎమోషన్ కు అందరిని థియేటర్లకు రప్పించే శక్తి ఉంది. దేశ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చాటిచెబుతూ తెరకెక్కిన సినిమాల్లో హిట్టు శాతం ఎక్కువే. అందుకే ఈ కథల్లో భాగమయ్యేందుకు హీరోలు ఎదురుచూస్తుంటారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమర వీరుల పాత్రల్లో తమను తాము చూసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. దేశభక్తి ప్రధాన ఇతివృత్తాలతో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలు ఇవే...

ఆర్ఆర్ఆర్ (RRR)

ఎన్టీఆర్‌,రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన చారిత్ర‌క చిత్రం ఆర్ఆర్ఆర్. ఆంగ్లేయుల‌పై తిరుగుబాటు చేసిన తొలిత‌రం స్వాతంత్ర్య‌స‌మ‌ర‌యోధుడు అల్లూరి సీతారామ‌రాజుతో పాటు నిజాం పాలకుల అకృత్యాలను ఎదురించిన కొమురం భీమ్ జీవితాలకు ఫిక్ష‌న‌ల్ అంశాల‌ను జోడించి రాజ‌మౌళి ఈ సినిమాను రూపొందించారు.

ఇద్ద‌రు పోరాట‌యోధులు క‌లిసి బ్రిటీష్ వారిపై చేసిన పోరాటాన్ని హీరోయిజం, ఎమోష‌న్స్ మేళ‌వించి శక్తివంతంగా సినిమాను తెరకెక్కించారు. భార‌తీయుల్ని బానిస‌లుగా భావిస్తూ బ్రిటీష్ పాలకులు ఎలా వివ‌క్ష‌కు గురిచేసేవారో ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి చూపించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు.

<p>ఆర్ఆర్ఆర్</p>

మేజ‌ర్(Major)

2022లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్‌ను సాధించిన సినిమాల్లో ఒక‌టిగా మేజ‌ర్ నిలిచింది. ముంబై ఉగ్ర‌దాడుల్లో క‌న్నుమూసిన ఎన్ఎస్‌జీ క‌మాండో మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవితం ఆధారంగా దేశ‌భ‌క్తి ప్ర‌ధాన క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. దేశం కోసం ప్రాణాల‌కు ప‌ణంగా పెట్టింది సైన్యం,ఎన్ఎస్‌జీ క‌మాండోలో చేసే పోరాటాన్ని స్ఫూర్తిదాయ‌కంగా ఆవిష్కరించిన సినిమా ఇది. అడివిశేష్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి శ‌శికిర‌ణ్ తిక్కా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు

సైరా నరసింహారెడ్డి(Sye Raa Narasimha Reddy)

బ్రిటీష్ పాలకుల అన్యాయాలపై తిరుగుబాటు రాయలసీమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి టైటిల్ పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తన అనుచరులు, చుట్టుపక్కల రాజ్యాలతో కలిసి బ్రిటీషర్లను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎదురించి పోరాటాన్ని సాగించిన తీరును వాస్తవిక కోణంలో చాటిన సినిమా ఇది. సైరా నరసింహారెడ్డిలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

రానా ప్రధాన పాత్రలో నటించిన ఘాజీ చక్కటి దేశభక్తి సినిమాగా ప్రేక్షకుల్ని మెప్పించింది. 1971 లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా సబ్ మెరైన్ వార్ బ్యాక్ డ్రాప్ రూపొందిన ఘాజీ సినిమాలో భారత నావికా దళం పోరాటపఠిమను చాటిచెప్పింది. అలాగే ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన రానా 1945 కూడా దేశభక్తి ప్రధాన కథాంశంతోనే తెరకెక్కింది. కానీ ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.

కృష్ణవంశీ ఖడ్గం, మహాత్మ సినిమాలు దేశభక్తిని ప్రభోదిస్తాయి. కృష్ణ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ సర్ధార్ పాపారాయుడు సినిమాలు దేశం కోసం పోరాడిన అమర వీరుల చరిత్రను, త్యాగాలను గుర్తుచేస్తాయి. శంకర్ భారతీయుడు, వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ సినిమాలు దేశభక్తి కథాంశాలతోనే రూపొందా

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం