Jaya Janaki Nayaka: యూట్యూబ్‌లో బోయపాటి మూవీ రికార్డు - జయజానకినాయక హిందీ వెర్షన్‌కు 800 మిలియన్ల వ్యూస్
22 February 2024, 6:11 IST
Jaya Janaki Nayaka: హీరో బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన జయజానకి నాయక హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ యాక్షన్ మూవీకి 800 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
జయజానకి నాయక
Jaya Janaki Nayaka: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన జయజానకి నాయక హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో కొత్త రికార్డును నెలకొల్పింది. 800 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. యూట్యూబ్‌లో 800 మిలియన్ల వ్యూస్ రాబట్టిన ఏకైన తెలుగు డబ్బింగ్ మూవీగా జయజానకి నాయక నిలిచింది. అంతే కాకుండా అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ఇండియన్ మూవీస్‌లో ఒకటిగా బోయపాటి మూవీ రికార్డు సృష్టించింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా 800 మిలియన్ల వ్యూస్ రాలేదు. వారెవరికి సాధ్యం కానీ రికార్డును జయజానకి నాయకతో బెల్లంకొండ శ్రీనివాస్ నెలకొల్పాడు.
థియేటర్లలో డిజాస్టర్.…
యూట్యూబ్‌లో 800 మిలియన్ల వ్యూస్ రాబట్టిన జయజానకి నాయక థియేటర్లలో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. 2017లో తెలుగులో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించింది. ప్రగ్యాజైస్వాల్ గెస్ట్ రోల్‌లో నటించగా, కేథరిన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. తొలుత జయజానకి నాయకలో హీరోయిన్‌గా తమన్నాను ఫిక్స్ చేశారు. కానీ బాహుబలి షూటింగ్ కారణంగా డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో తమన్నా ఈ సినిమా నుంచి తప్పుకున్నది. ఆమె స్థానంలో రకుల్‌ను తీసుకున్నారు. జగపతిబాబు, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు.
యాక్షన్ అంశాలతో...
టిపికల్ బోయపాటి స్టైల్ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో జయజానకి నాయక మూవీ తెరకెక్కింది. గగన్ (బెల్లంకొండ శ్రీనివాస్), స్వీటీ (రకుల్ ప్రీత్‌సింగ్) ప్రేమించుకుంటారు. అనుకోని కారణాల వల్ల స్విటీకి వేరే అబ్బాయితో పెళ్లైపోతుంది. కొద్ది రోజులకే ఆమె భర్తను కొందరు చంపేస్తారు. స్వీటీని కూడా చంపాలని ప్రయత్నిస్తారు. వారు ఎవరు? స్వీటీని గగన్ ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ. జయజాయనిక నాయకలో కథ అన్నది లేకుండా కేవలం భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకుల్ని మెప్పించడానికి డైరెక్టర్ బోయపాటి ప్రయత్నించారు. యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయనే పేరొచ్చిన కమర్షియల్ విజయానికి మాత్రం అవి పెద్దగా ఉపయోగపడలేదు. జయ జానకి నాయక సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
స్కంద డిజాస్టర్...
గత ఏడాది స్కంద మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బోయపాటి శ్రీను. రామ్ పోతినేని హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. యాభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నిర్మాతకు భారీగా నష్టాలను మిగిల్చింది. స్కంద రిజల్ట్‌తో సంబంధం బోయపాటి శ్రీను భారీ అవకాశాలతో దూసుకుపోతున్నాడు. తన నెక్స్ట్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ భారీ బడ్జెట్ మూవీలో సూర్య హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఛత్రపతి హిందీ రీమేక్...
మరోవైపు వరుస పరాజయాలతో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ సాగుతోంది. ఛత్రపతి రీమేక్‌తో గత ఏడాది బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వీవీవీనాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఫస్ట్ వీకెండ్‌లోనే థియేటర్లలో కనిపించకుండాపోయింది. తెలుగులో అల్లుడు అదుర్స్ పరాజయం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు సినిమా చేస్తున్నాడు. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి భీమ్లానాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.