తెలుగు న్యూస్  /  Entertainment  /  Balakrishna Veera Simha Reddy Day 2 Collection Huge Drop On Second Day

Veera Simha Reddy Day 2 Collection: రెండో రోజు భారీగా త‌గ్గిన వీర‌సింహారెడ్డి క‌లెక్ష‌న్స్ - కార‌ణం ఇదేనా

HT Telugu Desk HT Telugu

14 January 2023, 23:01 IST

  • Veera Simha Reddy Day 2 Collection: బాల‌కృష్ణ హీరోగా న‌టించిన వీర‌సింహారెడ్డి క‌లెక్ష‌న్స్ రెండో రోజు భారీగా త‌గ్గాయి. తొలి రోజు యాభై నాలుగు కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న ఈ సినిమాకు రెండో రోజు వ‌చ్చిన వ‌సూళ్లు ఎంతంటే...

వీర‌సింహారెడ్డి
వీర‌సింహారెడ్డి

వీర‌సింహారెడ్డి

Veera Simha Reddy Day 2 Collection: బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి క‌లెక్ష‌న్స్ రెండో రోజు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. తొలి రోజు యాభై నాలుగు కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు కేవ‌లం 11 కోట్ల వ‌సూళ్ల‌తో స‌రిపెట్టుకున్న‌ది.

శుక్రవారం సీడెడ్‌లో అత్య‌ధికంగా రెండు కోట్ల ఇర‌వై ఐదు ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్‌ను వీర‌సింహారెడ్డి సినిమా ద‌క్కించుకున్న‌ది. నైజాంలో కోటి అర‌వై ఐదు ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర‌లో 45 ల‌క్ష‌లు, ఈస్ట్‌లో న‌ల‌భై ల‌క్ష‌ల వ‌సూళ్లు మాత్ర‌మే వ‌చ్చిన‌ట్లు తెలిసింది.

మొత్తంగా సెకండ్ డే ప‌ద‌కొండున్న‌ర కోట్ల గ్రాస్‌, ఆరు కోట్ల ఇర‌వై ఐదు ల‌క్ష‌ల షేర్‌ను ఈ సినిమా సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. రెండు రోజుల్లో ఓవ‌ర్‌సీస్‌లో ఈ సినిమాకు నాలుగున్న‌ర కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు తెలిసింది.

రెండో రోజు వ‌సూళ్ల త‌గ్గ‌డానికి క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో ఉన్న‌ నెగెటివ్ టాక్ కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అలాగే శుక్ర‌వారం రోజు చిరంజీవి వాల్తేర్ వీర‌య్య సినిమా రిలీజ్ కావ‌డంతో వీర‌సింహారెడ్డి థియేట‌ర్ల సంఖ్య త‌గ్గ‌డం కూడా వ‌సూళ్లు ప‌డిపోవ‌డానికి మ‌రో కార‌ణంగా చెబుతున్నారు.

వ‌ర‌ల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లో వీర‌సింహారెడ్డి సినిమాకు 65 కోట్ల గ్రాస్‌, 39 కోట్ల షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. రాయ‌ల‌సీమ నేప‌థ్యానికి అన్నాచెల్లెలి అనుబంధాన్ని జోడించి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని వీర‌సింహారెడ్డి సినిమాను తెర‌కెక్కించారు.

బాల‌కృష్ణ యాక్టింగ్‌, ఆయ‌న‌పై తెర‌కెక్కించిన యాక్ష‌న్ సీక్వెన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో శృతిహాస‌న్‌, హ‌నీ రోజ్ హీరోయిన్లుగా న‌టించారు. బాల‌కృష్ణ సోద‌రిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ న‌టించింది. దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.