తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna: 1116 రోజులు ఆడిన ఏకైక సౌత్ ఇండియన్ మూవీ.. రికార్డులపై బాలకృష్ణ కామెంట్స్

Balakrishna: 1116 రోజులు ఆడిన ఏకైక సౌత్ ఇండియన్ మూవీ.. రికార్డులపై బాలకృష్ణ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

29 March 2024, 14:21 IST

  • Balakrishna In Legend 10 Years Event: నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా తన సినిమా రికార్డులపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ ఈవెంట్‌లో బాలకృష్ణ రికార్టులు సృష్టించాలన్న, వాటిని తిరిగిరాయాలన్న తానే అని తెలిపారు.

1116 రోజులు ఆడిన ఏకైక సౌత్ ఇండియన్ మూవీ.. రికార్డులపై బాలకృష్ణ కామెంట్స్
1116 రోజులు ఆడిన ఏకైక సౌత్ ఇండియన్ మూవీ.. రికార్డులపై బాలకృష్ణ కామెంట్స్

1116 రోజులు ఆడిన ఏకైక సౌత్ ఇండియన్ మూవీ.. రికార్డులపై బాలకృష్ణ కామెంట్స్

Balakrishna Legend 10 Years Event: గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహ నందమూరి బాలకృష్ణ-బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి ఇప్పటికీ మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. వాటిలో ఒకటే లెజెండ్ మూవీ. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా 2014 మార్చి 28న విడుదలై ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Balakrishna: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. స్క్రిప్ట్, టైటిల్ ఫిక్స్ అయినా పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకున్న సందర్భంగా మార్చి 30న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లెజెండ్ బ్లాక్ బస్టర్ 10 ఇయర్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"నాకు ధన్యమైన జన్మనిచ్చి.. నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, కారణజన్ముడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నా గురువు, నా దైవం, నా కన్నతండ్రికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ వేడుక సినిమా విడుదలకు ముందు జరుపుకునే పండగలాంటి అనుభూతిని ఇస్తుంది. మార్చి 30న ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంది. మళ్లీ వందరోజుల పండగ జరుపుకుంటాం" అని బాలకృష్ణ అన్నారు.

"నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గారికి శుభాకాంక్షలు. అభిమానులకు, తోటికళాకారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంచి ఉద్దేశంతో సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతో గొప్పగా ఆదరిస్తారు. వెన్నుతట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు చేయాలని ప్రోత్సహిస్తారు. తెలుగు సినిమాల ప్రభావం యావత్ దేశానికి పాకిందంటే దాని ప్రభావం ఎంత ఉందో కళ్లముందు కనిపిస్తోంది" అని బాలకృష్ణ తెలిపారు.

"సినిమా రికార్డులు నాకు కొత్త కాదు. రికార్డులు సృష్టించాలన్నా నేనే. వాటిని తిరగరాయాలన్నా నేనే. నా దర్శకులు, కథ ఎంపిక, తోటి నటులు, సాంకేతిక నిపుణులు మీద నాకు గట్టి నమ్మకం. సమరసింహా రెడ్డి 30 కేంద్రాలలో సిల్వర్ జుబ్లీ చేసుకుని దేశంలో కొత్త రికార్డులు సృష్టించింది. 105 కేంద్రాలలో వందరోజులు ఆడిన సినిమా నరసింహ నాయుడు. 400 రోజులు నాలుగు ఆటలతో రెండు కేంద్రాలలో ఆడి ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ గా నిలిచిన సినిమా లెజెండ్. అలాగే 4 ఆటలతో 1116 రోజులు ఆడి 4 అంకెల రోజులని దాటిన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా లెజెండ్" అని బాలయ్య చెప్పుకొచ్చారు.

"సినిమా కేవలం వినోదానికే కాదు సినిమా అంటే ఒక బాధ్యత. నా ప్రతి సినిమాలో ఆ బాధ్యత తీసుకుంటాను. సినిమా అంటే సమాజం పట్ల స్పృహ, ఒక చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథలు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. లెజెండ్‌లో మహిళలు ఉద్దేశించి ఇచ్చిన అద్భుతమైన సందేశం ఉంది.. ఇటివలే వచ్చిన నేలకొండ భగవంత్ కేసరిలో కూడా చాలా చక్కని సందేశం ఇచ్చాం. కళామతల్లి, నా తల్లిదండ్రుల, అభిమానుల ఆశీస్సులు ఉండబట్టే ఇలాంటి మంచి సినిమాలు చేయగలుతున్నానని భావిస్తున్నాను" అని బాలకృష్ణ పేర్కొన్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం