Baby Movie Review: బేబీ మూవీ రివ్యూ - ఆనంద్ దేవరకొండకు ఫస్ట్ కమర్షియల్ హిట్ దక్కిందా?
14 July 2023, 10:23 IST
Baby Movie Review: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ బేబీ. సాయిరాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందంటే...
బేబీ మూవీ
Baby Movie Review: కెరీర్‌లో ఫస్ట్ కమర్షియల్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్నాడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ(Anand Deverakonada). అతడు హీరోగా నటించిన తాజా సినిమా బేబీ. వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ ఇతర నాయకానాయికలుగా నటించిన ఈ మూవీకి సాయిరాజేష్ దర్శకత్వం వహించాడు. ఎస్‌కేఎన్ నిర్మించాడు.
పాటలు, ప్రచార చిత్రాలతో రిలీజ్‌కు ముందే తెలుగు ఆడియెన్స్‌లో ఈ చిన్న సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. జూలై 14న (శుక్రవారం)రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ సక్సెస్ అందుకున్నాడా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
Baby Movie Story - ట్రాయంగిల్ లవ్ స్టోరీ...
స్కూల్ డేస్ నుంచే ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైష్ణవి(వైష్ణవి చైతన్య)ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. కుటుంబ పరిస్థితులను కారణంగా చదువును మధ్యలోనే వదిలేసిన ఆనంద్ ఆటోడ్రైవర్‌గా మారతాడు. వైష్ణవి మాత్రం ఇంజినీరింగ్‌లో జాయిన్ అవుతుంది. కాలేజీలో వైష్ణవికి విరాజ్ (విరాజ్ అశ్విన్) లవ్ ప్రపోజ్ చేస్తాడు.
ఆనంద్‌ను ప్రేమిస్తోన్న విషయాన్ని విరాజ్ దగ్గర దాచిపెట్టిన వైష్ణవి అతడితో డేటింగ్ చేస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణంగా వైష్ణవి ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నది. ఆనంద్ దగ్గర విరాజ్ లవ్‌స్టోరీని, విరాజ్ దగ్గర ఆనంద్‌ను ప్రేమిస్తోన్న విషయం వైష్ణవి ఎందుకు దాచిపెట్టింది? ఈ ఇద్దరిలో ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నది? వైష్ణవి ప్రేమ దక్కక పోవడంతో ఆనంద్ జీవితం ఎలా ముగిసింది? అన్నదే(Baby Movie Review) ఈ సినిమా కథ.
న్యూ ఏజ్ లవ్ స్టోరీ...
బేబీ టైటిల్‌కు తగినట్లుగానే న్యూ ఏజ్ లవ్‌స్టోరీగా దర్శకుడు సాయిరాజేష్ ఈ మూవీని తెరకెక్కించారు. ప్రేమ విషయంలో నేటి యువత ఆలోచనవిధానం ఎలా ఉంటుంది? ప్రేమను స్వీకరించే, అర్థం చేసుకునే విధానంలో యువత అభిప్రాయాలు ఎలా మారిపోతుంటాయన్నది రియలిస్టిక్‌గా ఈ సినిమాలో(Baby Movie Review) చూపించారు. తమ వయసు, పరిణతితో పాటు ఆధునిక జీవిన విధానం వల్ల తమ ఆలోచన తీరులో వచ్చే మార్పుల వల్ల యువత ఎదుర్కొనే సంఘర్షణను హృద్యంగా సినిమాలో ఆవిష్కరించారు.
మూడు పాత్రలతో...
మూడు పాత్రల నేపథ్యంలో ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీని యూత్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా అందంగా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు డైరెక్టర్. ముక్కోణపు ప్రేమకథలు టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్స్‌పై చాలా వచ్చాయి. వాటికి భిన్నంగా నేటి ప్రేమాయణాలు ఎలా ఉంటున్నాయన్నది క్రిస్టల్ క్లియర్‌గా ఈ సినిమాలో చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించారు. విఫల ప్రేమికుడిగా ఆనంద్ దేవరకొండ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ కథ(Baby Movie Review) మొదలవుతుంది. స్కూల్‌డేస్‌లోని లవ్ స్టోరీని చాలా నోస్టల్జిక్‌గా చూపించారు డైరెక్టర్. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ డైలాగ్స్‌తో ఈ లవ్ సీన్స్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.
విరామం ట్విస్ట్ హైలైట్...
ఆనంద్‌తో పాటు విరాజ్‌కు ప్రేమను వైష్ణవి యాక్సెప్ట్ చేసినట్లుగా విరామంలో ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని కలిగించారు డైరెక్టర్. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీని కంటిన్యూ చేసే క్రమంలో వైష్ణవి ఎదుర్కొనే సంఘర్షణతో సెకండాఫ్ రాసుకున్న విధానం బాగుంది. విరాజ్, వైష్ణవి డేటింగ్ సీన్స్‌ను బోల్డ్‌గా నడిపిస్తూనే అందులో నుంచి కావాల్సినంత ఎమోషన్స్ క్వారీ చేశారు. తన ప్రేమ విషయంలో వైష్ణవి తీసుకున్న డెసిషన్ తో సర్‌ప్రైజింగ్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు.
లెంగ్త్ మైనస్...
నిడివి ఈ సినిమాకు కొంత మైనస్‌గా మారింది. దాదాపు సినిమా మూడు గంటల లెంగ్త్ ఉంది. ముఖ్యంగా విరాజ్, వైష్ణవి లవ్ ట్రాక్, ఇంజినీరింగ్ కాలేజీ ఎపిసోడ్స్ కాస్త బోర్‌గా సాగిన ఫీలింగ్ కలుగుతుంది.
వైష్ణవికి ఎక్కువ మార్కులు...
ఈ సినిమాలో యాక్టింగ్ విషయంలో హీరోలు ఇద్దరి కంటే హీరోయిన్ వైష్ణవి చైతన్యకే ఎక్కువగా మార్కులు పడతాయి. తొలి సినిమాతోనే మల్టీపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో అదరగొట్టింది. అమాయకత్వం, కాస్త కన్నింగ్‌నెస్ ఉన్న పాత్రలో వేరియేషన్ చూపించిన విధానం బాగుంది. ఆటోడ్రైవర్‌గా ఆనంద్‌దేవరకొండ మెచ్యూర్డ్ యాక్టింగ్‌ను కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించాడు. ఇంజినీరింగ్ స్టూడెంట్‌గా స్టైలిష్ రోల్‌కు విరాజ్ న్యాయం చేశాడు.
Baby Movie Review-ఫీల్ గుడ్ లవ్ స్టోరీ...
బేబీ యూత్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే రియలిస్టిక్ ఎమోషనల్ లవ్‌స్టోరీ. ఫీల్‌గుడ్ మూవీగా ఆకట్టుకుంటుంది.