తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ayalaan Ott Release Date: శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Ayalaan OTT Release Date: శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

23 January 2024, 6:00 IST

  • Ayalaan OTT Release Date: సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన త‌మిళ మూవీ శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్ ఓటీటీలోకి రాబోతోంది. స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్
శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్

శివ‌కార్తికేయ‌న్ అయ‌లాన్

Ayalaan OTT Release Date:సంక్రాంతి కానుక‌గా రిలీజైన శివ‌కార్తికేయ‌న్ త‌మిళ మూవీ అయ‌లాన్ బాక్సాఫీస్ వ‌ద్ద మోస్తారు వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్‌కు పోటీగా బ‌రిలో నిలిచిన‌ ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ప‌న్నెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా దాదాపు 78 కోట్ల‌కుపైగా గ్రాస్ , న‌ల‌భై రెండు కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్‌ రాబ‌ట్టింది. కెప్టెన్ మిల్ల‌ర్ త‌ర్వాత 2024లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన త‌మిళ మూవీగా అయ‌లాన్ నిలిచింది. ఏలియ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో రూపొందిన అయ‌లాన్ సినిమాకు ఆర్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ట్రెండింగ్ వార్తలు

Prabhas Instagram Story: ప్రభాస్ పెళ్లి కాదు.. అతని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వెనుక అసలు విషయం ఇదీ

Preminchoddu: షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్

Suriya Kanguva: సూర్య కంగువ.. పది వేల మందితో సూర్య, బాబీ డియోల్ వార్ సీన్ షూటింగ్

Kajal Agarwal Kannappa: మంచు విష్ణు కన్నప్పలో కాజల్ అగర్వాల్.. అప్పుడు చెల్లెలిగా ఇప్పుడు?

స‌న్ నెక్స్ట్ ఓటీటీలో...

అయ‌లాన్ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను స‌న్ నెక్స్ట్ ఓటీటీ ద‌క్కించుకున్న‌ది. ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ ఫిబ్ర‌వ‌రి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలిసింది. త‌మిళంతో పాటు తెలుగులో కూడా అదే రోజు రిలీజ్ కానున్న‌ట్లు చెబుతున్నారు. ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో అయ‌లాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది.

ఇండియాలో ఫ‌స్ట్ మూవీ...

నోవా గ్యాస్ అనే కెమిక‌ల్‌తో భూగ్ర‌హానికి హాని త‌ల‌పెట్టాల‌ని చూసిన సైంటిస్ట్ కుట్ర‌ను ఏలియ‌న్ స‌హాయంతో ఓ యువ‌కుడు ఎలా ఎదుర్కొన్నాడ‌న్న‌దే అయ‌లాన్ మూవీ క‌థ‌. వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ హంగుల‌తో ఆర్ ర‌వికుమార్ అయ‌లాన్ మూవీని తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో దాదాపు 4500 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. అత్య‌ధిక వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఇండియ‌న్ మూవీ అయ‌లాన్ కావ‌డం గ‌మ‌నార్హం. గ్రాఫిక్స్ ప‌నుల కార‌ణంగానే అయ‌లాన్‌ షూటింగ్ ఆల‌స్య‌మైంది.

2016లో సినిమాను అనౌన్స్‌చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు షూటింగ్ జ‌రుపుకున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు 2024లో రిలీజైంది. ఈ సినిమాలో ఎలియ‌న్ పాత్ర‌కు సిద్ధార్థ్ వాయిస్ ఓవ‌ర్ అందించాడు. హీరో శివ‌కార్తికేయ‌న్‌తో పాటు సిద్ధార్థ్ ఎలాంటి రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా ఈ సినిమాకు ఉచితంగా ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం. అయ‌లాన్ మూవీకి ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించాడు.

ఐదేళ్ల త‌ర్వాత...

అయ‌లాన్ మూవీలో ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. 2019లో రిలీజైన సూర్య ఎన్‌జీకే త‌ర్వాత అయ‌లాన్‌తో కోలీవుడ్‌లోకి ర‌కుల్ రీఎంట్రీ ఇచ్చింది. హీరో ల‌క్ష్యానికి అండ‌గా నిల‌బ‌డే తారా అనే యువ‌తిగా క‌నిపించింది.

తెలుగులో ఆల‌స్యంగా రిలీజ్‌...

కోలీవుడ్‌లో సంక్రాంతికి రిలీజైన అయ‌లాన్ మూవీ తెలుగులో మాత్రం రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. సంక్రాంతికి గుంటూరుకారం, నా సామిరంగ‌, సైంధ‌వ్‌తో పాటు హ‌నుమాన్ సినిమాలు రిలీజ్ కావ‌డంతో కెప్టెన్ మిల్ల‌ర్‌, అయ‌లాన్ సినిమాల‌కు థియేట‌ర్లు కేటాయించ‌డం స‌మ‌స్య‌గా మారింది. దాంతో జ‌న‌వ‌రి 26కు ఈ రెండు సినిమాలు వాయిదాప‌డ్డాయి.

అయ‌లాన్ త‌ర్వాత డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ పెరియాసామీతో ఓ సినిమా చేస్తున్నాడు శివ‌కార్తికేయ‌న్‌. మిల‌ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు అగ్ర న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం