Avatar 2 OTT Streaming Date: ఇండియన్ ఫ్యాన్స్‌కు నిరాశ - అవతార్ -2 ఓటీటీలో చూడాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే..
28 March 2023, 11:06 IST
Avatar 2 OTT Streaming Date: విజువల్ వండర్ అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమాను ఓటీటీలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇండియన్ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. ఓవర్‌సీస్‌లో ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఇండియాలో మాత్రం స్ట్రీమింగ్ కావడం లేదు.
అవతార్ ది వే ఆఫ్ వాటర్
Avatar 2 OTT Streaming Date: జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ -2 ఓటీటీలోకి వచ్చేసింది. ఓవర్‌సీస్ లోమార్చి 28న (నేడు) అమెజాన్‌వీడియో , ఆపిల్ టీవీతో పాటు పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమా రిలీజైంది. అది కూడా పే ఫర్ వ్యూ విధానంలో అవతార్ -2ను ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ఓటీటీలో ఈ విజువల్ వండర్‌ను చూడాలని చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇండియన్ ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశనే మిగిల్చారు. ఇండియాలో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమా అందుబాటులోకి రాలేదు. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇండియాలో అవతార్ -2 రిలీజ్ కాబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఇండియన్ స్ట్రీమింగ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేసే అవకాశం ఉంది.
ఓవర్‌సీస్‌లో ఓటీటీలో చూడాలంటే 1600 చెల్లించాల్సిందే...
ఓవర్‌సీస్‌లో అవతార్ 2 సినిమాను ఓటీటీలో చూడాలంటే 19.99 డాలర్లు చెల్లించాలని డిస్నీ మూవీస్ పేర్కొన్నది. 19.99 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఈ సినిమా చూడటం కోసం 1600 రూపాయలకుపైనే డబ్బులు చెల్లించాలన్నమాట.
అమెరికాతో పాటు పలు దేశాల్లో అమెజాన్ వీడియో, ఆపిల్ టీవీతో పాటు వుడు, గూగుల్ ప్లేతో పాటు మరికొన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇండియాలో పే ఫర్ వ్యూ విధానంలో రిలీజ్ చేస్తే ఛార్జీలు ఎంత మొత్తం విధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అవతార్ 2 కథేమిటంటే...
తమ పిల్లలతో సంతోషంగా జీవితాన్ని సాగిస్తోన్న జాక్, నెట్రిలపై కల్నర్ క్వారిచ్ బృందం మరోసారి దాడికి యత్నిస్తుంది. కల్నల్ క్వారిచ్ దాడుల నుంచి తమ కుటుంబాన్ని జాక్, నెట్రి ఎలా కాపాడుకున్నారన్నది విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు జేమ్స్ కామెరూన్.
రీఫ్ ఐలాండ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కొత్త లోకంలో విహరింపజేశాయి. ఆస్కార్స్ 2023 లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా అవార్డును సొంతం చేసుకున్నది.