తెలుగు న్యూస్  /  Entertainment  /  Ar Rahman Roped For Ramcharan Buchi Babu Sports Drama Movie

Ram Charan Ar Rahman: రామ్ చ‌ర‌ణ్‌ సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ మ్యూజిక్ - ఆ సెంటిమెంట్‌ను చ‌ర‌ణ్ మూవీ బ్రేక్ చేస్తుందా?

09 April 2023, 15:12 IST

  • Ram Charan Ar Rahman:రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఓ రూర‌ల్ డ్రామా మూవీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ మ్యూజిక్ అందించ‌బోతున్నాడు...

రామ్‌చ‌ర‌ణ్
రామ్‌చ‌ర‌ణ్

రామ్‌చ‌ర‌ణ్

Ram Charan Ar Rahman: ఆర్ఆర్ఆర్ (RRR) స‌క్సెస్ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ (Ramcharan) భారీ బ‌డ్జెట్ సినిమాల‌ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్‌లో లేదా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(Buchi babu) ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ మ‌రో మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామా క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. ఈ భారీ బ‌డ్జెట్ సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందించ‌బోతున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన ఓ త‌మిళ సినిమా ఈవెంట్‌లో రామ్‌చ‌ర‌ణ్ మూవీకి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ విష‌యాన్ని రెహ‌మాన్ స్వ‌యంగా వెల్ల‌డించాడు.

ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్నాయి. శంక‌ర్ సినిమా పూర్తికాగానే సెప్టెంబ‌ర్ నుంచి బుచ్చిబాబు సినిమా సెట్స్‌లో రామ్‌చ‌ర‌ణ్ అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌జెంట్ ఈ మూవీలో హీరోయిన్‌ను ఫైన‌ల్ చేసే ప‌నిలో చిత్ర యూనిట్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

రెహ‌మాన్ తెలుగు సినిమాలు ఫ్లాప్‌

డ‌బ్బింగ్ సినిమా పాట‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించిన ఏఆర్ రెహ‌మాన్ తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు మూడు స్ట్రెయిట్ సినిమాల‌కు మాత్ర‌మే సంగీతాన్ని అందించాడు. వెంక‌టేష్ సూప‌ర్ పోలీస్‌, మ‌హేష్‌బాబు నానితో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొమురం పులి సినిమాల‌కు ఏఆర్ రెహ‌మాన్‌ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

ఈ మూడు సినిమాలు మ్యూజిక‌ల్‌గా హిట్స్‌గా నిలిచినా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఫెయిల్యూర్ అయ్యాయి. తెలుగులో రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తోన్న నాలుగో సినిమాగా రామ్‌చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు మూవీ నిల‌వ‌నుంది.ఈ సినిమాతో రెహ‌మాన్ ఫ్లాప్ సెంటిమెంట్‌ను చ‌ర‌ణ్ బ్రేక్ చేస్తాడా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.