తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Miss Shetty Mr Polishetty Collection: 2 రోజుల్లో అన్ని కోట్లు.. అనుష్క, నవీన్ హిట్ కొట్టాలంటే మాత్రం!

Miss Shetty Mr Polishetty Collection: 2 రోజుల్లో అన్ని కోట్లు.. అనుష్క, నవీన్ హిట్ కొట్టాలంటే మాత్రం!

Sanjiv Kumar HT Telugu

09 September 2023, 15:12 IST

google News
  • Miss Shetty Mr Polishetty 2 Days Collection: చాలాకాలం గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా మంచి రివ్యూలు తెచ్చుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 2 రోజుల కలెక్షన్స్ చూద్దాం.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 2 డేస్ కలెక్షన్స్
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 2 డేస్ కలెక్షన్స్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 2 డేస్ కలెక్షన్స్

ప్రీ రిలిజ్ బిజినెస్

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి తొలిసారి జంటగా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. సెప్టెంబర్ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కుతోంది. అయితే డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ప్రధానంగా థియేట్రికల్ రైట్స్ రూ. 12.50 కోట్లకు అమ్ముడిపోయాయి. అలాగే ఈ సినిమాను 800 థియేటర్లలో విడుదల చేసినట్లు సమాచారం.

2వ రోజు

మహేశ్ బాబు పచ్చిగొల్ల దర్శకత్వంవహించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో సినిమాకు వసూళ్లు బాగానే కలెక్ట్ అవుతున్నాయి. ఈ చిత్రానికి 2వ రోజున నైజాంలో రూ. 68 లక్షలు, సీడెడ్‍లో రూ. 11 లక్షలు, ఆంధ్రప్రదేశ్‍లో రూ. 42 లక్షలు కలెక్ట్ అయ్యాయి.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.21 కోట్ల షేర్, రూ. 1.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.

2 రోజుల్లో

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి 2 రోజుల్లో నైజాంలో రూ. 1.48 కోట్లు, సీడెడ్‍లో రూ. 21 లక్షలు, ఆంధ్రప్రదేశ్‍లో రూ. 87 లక్షలు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో 2 రోజుల్లో రూ. 2.56 కోట్లు షేర్, రూ. 4.60 కోట్ల గ్రాస్ సాధించింది. అలాగే కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్‍లో రూ. 2.40 కోట్లు షేర్ వసూలు అయింది. ఇలా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2 రోజులకు రూ. 5.26 కోట్ల షేర్, 10.50 కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసి పర్వాలేదనిపించుకుంది.

బ్రేక్ ఈవెన్ కావాలంటే?

ఇక కామెడీ ఎంటర్టైనర్‍గా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు రూ. 13.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. అయితే, దీనికి రెండు రోజుల్లో రూ. 5.26 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఇంకా రూ. 8.20 కోట్లు వస్తేనే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుని లాభాల్లోకి పయనించే అవకాశం ఉంది. అప్పుడే సినిమా క్లీన్ హిట్ స్టేటస్ సొంతం చేసుకుంటుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం